iDreamPost
android-app
ios-app

వెరైటీ ఐడియాలంటే ఉపేంద్రనే.. కొత్త టీజర్ తో మళ్లీ ప్రూవ్ చేశాడు!

  • Author ajaykrishna Published - 11:46 AM, Tue - 19 September 23
  • Author ajaykrishna Published - 11:46 AM, Tue - 19 September 23
వెరైటీ ఐడియాలంటే ఉపేంద్రనే.. కొత్త టీజర్ తో మళ్లీ ప్రూవ్ చేశాడు!

ఇండస్ట్రీలో ఉన్న మల్టీటాలెంటెడ్ హీరోలలో కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర ఒకరు. ఆయన సినిమాలకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కెరీర్ ఆరంభం నుండే డిఫరెంట్ సినిమాలు.. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియాలతో తీసి ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్న ఉపేంద్ర.. డైరెక్టర్ కం యాక్టర్ గా కొన్ని అద్భుతాలు తెరకెక్కించాడు. ఉపేంద్ర అనగానే మనకు ఏ, ఉపేంద్ర, ఓం, రా, సూపర్, బుద్దిమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ వెరైటీ సినిమాలు గుర్తొస్తుంటాయి. ఓవైపు హీరోగా చేస్తూనే.. మరోవైపు స్వీయ దర్శకత్వంలో సినిమాలు తెరపైకి తీసుకొస్తున్నాడు ఉపేంద్ర. ఉపేంద్ర గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు.

తెలుగులో చాలా సినిమాలలో హీరోగా.. కీలకపాత్రలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే.. 2015లో సూపర్ హిట్ ఉపేంద్ర సినిమాకు సీక్వెల్ ‘ఉప్పి 2’ స్వీయదర్శకత్వంలో తెరకెక్కించాడు ఉపేంద్ర. ఆ తర్వాత దర్శకుడిగా మళ్లీ ఏ సినిమా చేయలేదు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఉపేంద్ర.. కొత్త సినిమా చేస్తున్నాడు. ఇన్నాళ్లు తన జానర్ ని పక్కన పెట్టి.. హీరోగా చేసిన ఉపేంద్ర.. ఇప్పుడు మళ్ళీ తన వెరైటీ జానర్ లో కొత్త సినిమా అనౌన్స్ చేసేశాడు. వినాయక చవితి సందర్బంగా తన కొత్త సినిమా టైటిల్ తో పాటు టీజర్ కూడా రిలీజ్ చేశాడు.

ఇంతకీ.. ఉపేంద్ర కొత్త సినిమా టైటిల్ ఏం పెట్టాడో చూశారా! యూఐ(UI). ఈ సినిమా టైటిల్ తో పాటు టీజర్ కూడా చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది. సుమారు రెండు నిముషాల నిడివి కలిగిన యూఐ టీజర్.. చూస్తే మైండ్ బ్లాక్ చేస్తోంది. ఎందుకంటే.. టీజర్ లో మాటలు తప్ప ఎలాంటి విజువల్స్ లేవు. పైగా స్క్రీన్ అంతా కేవలం డార్క్ చీకటితో నిండిపోయింది. అందులోనే డైలాగ్స్ తో థ్రిల్లింగ్ నేరేషన్ ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు ఉపేంద్ర. ఈ టీజర్ మీ ఊహలకే వదిలేస్తున్న అని చివరిలో ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో వెరైటీ అంటే.. ఉపేంద్రనే అని, ఇలాంటి ఐడియాలన్నీ ఆయనకే సాధ్యమని ప్రేక్షకులు అంటున్నారు. కాగా.. ఇటీవల కబ్జాతో భారీ దెబ్బతిన్న ఉపేంద్ర, ఈ సినిమాతో పాన్ ఇండియా హిట్ ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. మరి యూఐ టీజర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.