Tirupathi Rao
Tumbbad Movie Re Release In Theatres: దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేక్షకులను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసిన చిత్రం తుంబాడ్. ఇప్పుడు ఈ మూవీ మరోసారి థియేటర్లలోకి రాబోతోంది. ఈ రోజునే తుంబాడ్ చిత్రం రీ రిలీజ్ కాబోతోంది.
Tumbbad Movie Re Release In Theatres: దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేక్షకులను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసిన చిత్రం తుంబాడ్. ఇప్పుడు ఈ మూవీ మరోసారి థియేటర్లలోకి రాబోతోంది. ఈ రోజునే తుంబాడ్ చిత్రం రీ రిలీజ్ కాబోతోంది.
Tirupathi Rao
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజుల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. సినీ ప్రేక్షకులు అంతా తమ అభిమాన హీరోల పుట్టినరోజుల సందర్భంగా వారి కెరీర్ లో వచ్చిన బిగ్గెస్ట్ మూవీస్ ని థియేటర్లలో.. అది కూడా 4కేలో రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోల సినిమాలు థియేటర్లలో రీ-రిలీజ్ అయ్యాయి. ఇటీవల మహేశ్ బాబు మురారి, తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర సినిమాలు థియేటర్లలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అటు బాలీవుడ్ లో కూడా ఈ రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల తృప్తీ ధిమ్రీ నటించిన లైలా మజ్నూ, రణబీర్ కపూర్ రాక్ స్టార్ ని రీ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి ఒక క్రేజీ సినిమా వచ్చి చేరుతోంది. నిజానికి ఈ సినిమా ఒకటి థియేటర్లలో రీ రిలీజ్ అవుతుందని ఎవరూ ఊహించను కూడా లేరు. అదే సోహమ్ షా నటించిన తుంబాడ్ చిత్రం.
బాలీవుడ్ లో కూడా రీ రిలీజుల ట్రెండ్ బాగానే నడుస్తోంది. తాజాగా తుంబాడ్ రీ రిలీజ్ కాబోతోంది అని పింక్ విల్లా చెప్పుకొచ్చింది. ఈ సినిమాకి తెలుగులో కూడా కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ చిత్రాన్ని ఓటీటీలో చూసి ఎంతో మెస్మరైజ్ అయిపోయారు. ఇంక తుంబాడ్ చిత్రం గురించి చెప్పుకోవాలంటే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిందే తుంబాడ్ చిత్రం. ఈ మూవీని రూ.5 కోట్లతో నిర్మిస్తే.. బాక్సాఫీస్ వద్ద రూ.13.50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టందంట. అలాగే ఓటీటీలో అయితే రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పటికీ ఇండియన్ సినిమాలో ఉన్న టాప్ రేటెడ్ హారర్ చిత్రాలు అని కొడితే ఓటీటీలో మీకు తుంబాడ్ కచ్చితంగా వస్తుంది. ఐఎండీబీలో ఈ చిత్రానికి 8.2/10 రేటింగ్ కూడా ఉంది. 62 వేల మంది ఈ చిత్రానికి ఆ రేటింగ్ ఇచ్చారు. అంటే సినిమాలో కచ్చితంగా విషయం ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తుంబాడ్ చిత్రాన్ని ఆగస్టు 30న రీ రిలీజ్ చేయబోతున్నట్లు చెబుతున్నారు.
తుంబాడ్ కథ:
తుంబాడ్ అనే గ్రామంలో ఒక పాడు బడిన బంగ్లా ఉంటుంది. అందులో ఒక అమ్మవారి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం లోపల ఒక రహస్య గుహ ఉంటుంది. ఆ గుహలో ఒక విచిత్రమైన రాక్షసుడు ఉంటూ ఉంటాడు. ఈ భూమి మీద ఉన్న బంగారం మొత్తం అతని ఒంట్లోనే ఉంటుంది. అతని శరీరం నుంచి బంగారు కాసులు పడుతూనే ఉంటాయి. అయితే వాటిని తీసుకోవడం అంత తేలిక కాదు. కానీ, ఆ రాక్షసుడి నుంచి బంగారం తీసుకోవడానికి వినాయక్ ఒక తెలివైన పథకం పన్నుతాడు. అతను దానికి ఆహారం ఆశ చూపించి.. బంగారం దోచేస్తూ ఉంటాడు. అయితే అలా ఎంతకాలం దానిని తన అధీనంలో ఉంచుకున్నాడు? ఆ రాక్షసుడు వినాయక్ చేసిన మాయలో ఎంతకాలం ఉంటాడు? అసలు ఆ రాక్షసుడు బంగారం ఎలా ఇస్తాడు? అనే విషయాలు తెలియాలి అంటే తుంబాడ్ సినిమా చూడాల్సింది. అమెజాన్ ప్రైమ్ లో ఉన్న ఈ తుంబాడ్ సినిమా చూసేందుకు క్లిక్ చేయండి.