iDreamPost
android-app
ios-app

రేపు ఒక్క రోజే సినిమా థియేటర్లలోకి 10 సినిమాలు!

ఓకే రోజు సినిమా ధియేటర్‌లోకి ఏకంగా 10 సినిమాలు రానున్నాయి. వాటిలో తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన సినిమాలు కూడా ఉన్నాయి. డిసెంబర్‌ 15 థియేటర్లలోకి రానున్నాయి.

ఓకే రోజు సినిమా ధియేటర్‌లోకి ఏకంగా 10 సినిమాలు రానున్నాయి. వాటిలో తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన సినిమాలు కూడా ఉన్నాయి. డిసెంబర్‌ 15 థియేటర్లలోకి రానున్నాయి.

రేపు ఒక్క రోజే సినిమా థియేటర్లలోకి 10 సినిమాలు!

తెలుగు వాళ్లు సినిమా ప్రియులు. భాష ఎదైనా సరే.. మూవీ బాగుంటే చాలు నెత్తిన పెట్టుకుంటూ ఉంటారు. సూపర్‌ హిట్లను కట్టబెడుతూ ఉన్నారు. అందుకే ప్రతీ వారం పెద్ద సంఖ్యలోనే సినిమాలు ఓటీటీల్లోకి, థియేటర్లలోకి వస్తున్నాయి. ఈ వారం థియేటర్లలోకి దాదాపు 10 సినిమాలు రానున్నాయి. అది కూడా ఒకే రోజు థియేటర్లలోకి రానున్నాయి.

పిండం :

సాయికిరణ్‌ దైద దర్శకత్వం వహించారు. యశ్వంత్‌ దగ్గుమాటి నిర్మాతగా వ్యవహరించారు. క్రిష్ణ సౌరభ్‌ సూరంపల్లి మ్యూజిక్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు. సతీష్‌ మనోహరన్‌ సినిమాటోగ్రఫీ బాధ్యతల్ని చేపట్టారు. శిరీష్‌ ప్రసాద్‌ ఎడిటర్‌గా వ్యవహరించారు. శ్రీరామ్‌, ఖుషీ, ఈశ్వరీ రావు, శ్రీనివాస్‌ అవసరాల ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

కలశ : ది సింబల్‌ ఆప్‌ అంబుడెన్స్‌: 

కొండ రాంబాబు దర్శకత్వం వహించారు. రాజేశ్వరి చంద్రజ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. విజయ్‌ కూరాకుల సంగీతం అందించారు. వెంకట్‌ గంగాధరి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. జునైద్‌ సిద్ధిఖీ ఎడిటర్‌గా పని చేశారు. అనురాగ్‌ రాజ్‌పుత్‌, సోనాక్షి వర్మ, భాను శ్రీ, రోషిని కామిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు.

ఆలంబన :

ఈ చిత్రానికి పపరి కే విజయ్‌ దర్శకత్వం వహించారు. చంద్ర నిర్మాణ బాధ్యతల్ని చేపట్టారు. హిప్‌ హాప్‌ తమిళ సంగీతం అందించారు. వైష్ణవ్‌ రెడ్డి, పార్వతీ నాయర్‌, మణికందన్‌, యోగి బాబు, మురిశీ శర్మ, ఆనంద్‌రాజ్‌ తదితరులు ప్రధాన పాత్రలో నటించారు.

జోరుగా హుషారుగా :

అనుప్రసాద్‌ పూజారి దర్శకత్వం వహించారు. నిరీష్‌ తిరువీది నిర్మాతగా వ్యవహరించారు. ప్రనీత్‌ నంబూరి సంగీతం అందించారు. మహిరెడ్డి పండుగల సినిమాటోగ్రఫీ బాధ్యతల్ని చేపట్టారు. విరాజ్‌ అశ్విన్‌, పూజితా పొన్నాడ, శిరి హన్మంతు, రోహిణి, బ్రహ్మాజీ, సాయి కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటించారు.

మాయలో :

ఈ సినిమాకు మేగ్నా మిత్ర పెర్వర్‌ దర్శకత్వం వహించారు. షాలినీ నంబు నిర్మాతగా వ్యవహరించారు. నరేష్‌ అగస్త్య, భావన, జ్ఞానేశ్వరి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.

తికమక తండ : 

ఈ చిత్రానికి వెంకట్‌ మల్లమ్‌ దర్శకత్వం వహించారు. తిరుపతి శ్రీనివాస్‌ నిర్మాతగా వ్యవహరించారు. సురేష్‌ బొబ్బిలి సంగీత దర్శకత్వం వహించారు. హరి క్రిష్ణ, రామ క్రిష్ణ, రేఖ, యానీ జిబి, శివనారాయణ ప్రధాన పాత్రల్లో నటించారు.

చే లాంగ్‌ లివ్‌ : 

సుభవత్‌ బాలరాజ్‌ నాయక్‌ దర్శకత్వంతో పాటు, నిర్మాతగా కూడా వ్యవహరించారు. కొప్పి శెట్టి శంకర్‌ డిస్ట్యిబ్యూషన్‌ బాధ్యతల్ని చేపడుతున్నారు. శోభవత్‌ బాలరాజు, సమీర లావణ్య, పాసాల ఉమా మహేశ్వర్‌ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

వీటితో పాటు దలారి, శంతల, సఖి సినిమాలు కూడా డిసెంబర్‌ 15వ తేదీనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి, ఒకే రోజు ఏకంగా పది సినిమాలు థియేటర్లలో సందడి చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.