iDreamPost
android-app
ios-app

గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన సాయాజీ షిండే..

  • Published Apr 12, 2024 | 11:35 AM Updated Updated Apr 12, 2024 | 2:27 PM

Sayaji Shinde- Heart Attack: టాలీవుడ్ నటుడు సాయాజీ షిండే గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎన్నో ఆద్భుతమైన చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆయన గత కొంతకాలంగా ఏ తెలుగు సినిమాలోనూ కనిపించడం లేదు. అయితే తాజాగా ఆయన అనారోగ్యంకు గురయ్యి ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం అందింది. దీంతో ఆయనకు ఏం జరిగిందో అని ఇండస్ట్రీలో ప్రముఖులు, ఆయన అభిమానులు అందోళనలో చెందుతున్నారు.

Sayaji Shinde- Heart Attack: టాలీవుడ్ నటుడు సాయాజీ షిండే గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎన్నో ఆద్భుతమైన చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆయన గత కొంతకాలంగా ఏ తెలుగు సినిమాలోనూ కనిపించడం లేదు. అయితే తాజాగా ఆయన అనారోగ్యంకు గురయ్యి ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం అందింది. దీంతో ఆయనకు ఏం జరిగిందో అని ఇండస్ట్రీలో ప్రముఖులు, ఆయన అభిమానులు అందోళనలో చెందుతున్నారు.

  • Published Apr 12, 2024 | 11:35 AMUpdated Apr 12, 2024 | 2:27 PM
గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన సాయాజీ షిండే..

టాలీవుడ్ నటుడు ‘సాయాజీ షిండే‘ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎన్నో ఆద్భుతమైన చిత్రాల్లో విలన్ గా, తండ్రిగా, సహాయక పాత్రలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. అయితే మహారాష్ట్ర చెందిన షిండే మరాఠీతో పాటు హిందీ, తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ వంటి 4 భాషాల్లో నటించి మంచి ఆర్టిస్టుగా పేరు సంపాదించుకున్నారు. అయితే సినిమాల్లోకి రాకముందు ఈయన మరాఠీలో నాటకాలు వేసేవారు. అక్కడనుంచి వెండితెర పై అడుగు పెట్టిన ఈయన దాదాపు 200 పైగా చిత్రాల్లో నటించారు. అయితే గత కొంతకాలంగా సాయాజీ తెలుగు సిని పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో కూడా ఏ సినిమాల్లోనూ కనిపించటం లేదనే విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా నిన్న అనగా గురువారం ఆయన అనారోగ్యనికి గురయ్యారు. విపరీతమైన ఛాతి నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం అందింది. దీంతో  తమ అభిమాన నటుడుకి ఏమైందో అని ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

అయితే కొన్ని రోజుల క్రితం సాయాజీ షిండేకు ఛాతిలో నొప్పి వచ్చిందని.. దీంతో వెంటనే ఆసుపత్రిలో చేరి  వచ్చి సాధారణ పరీక్షలు చేయించుకున్నారని వైద్యులు అన్నారు . ఈ క్రమంలోనే..  ఈసీజీ టెస్ట్ చేయగా.. ఆయనకు 2D ఎకోకార్డియోగ్రఫీని పూర్తి చేసినప్పుడు, గుండెలో వెయిన్ బ్లాక్ ఉన్నట్లు గుర్తించమని వైద్యులు తెలిపారు. ఆ తర్వాత.. మరోసారి నిన్న ఛాతిలో నొప్పి రావడంతో వెంటనే అతనికి కొన్ని పరీక్షలు చేశామని.. కాగా, ఆయన గుండెలో వెయిన్ బ్లాక్ ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో వెంటనే ఆయనకు యాంజియోప్లాస్టీ చేసినట్లు వైద్యులు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం సాయాజీ షిండే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని త్వరలోనే ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు సాయాజీ షిండే త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు.

అయితే సాయాజీ షిండే మొదట 2001లో వచ్చిన ‘సూరి’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమ్యారు. ఆ తర్వాత ‘ఠాగూర్’, ‘వీడే’ , ‘ఆంధ్రావాలా’, ‘గుడుంబా శంకర్’, ‘పోకరి’ వంటి ఎన్నో చిత్రాల్లో ఆద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. కాగా, షిండే నటించిన సినిమాలన్నింటిలో పోకిరి సినిమానే ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో ఆయన పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. అలా ఆ సినిమా తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీలో బిజీగా అయిపోయారు. అయితే సాయాజీ షిండే చివరిగా 2023లో వచ్చిన ‘ఏజెంట్ నరసింహ’ సినిమాలో కనిపించారు. మరి ఆ సినిమా తర్వాత ఏ సినిమాల్లోనూ ఆయన కనిపించలేదు. మరి, ఏన్నో ఆద్భతమైన చిత్రాల్లో అలరించిన,మెప్పించిన నటుడు సాయాజీ షిండే ఆసుపత్రిలో చేరడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.