iDreamPost
android-app
ios-app

Brahmanandam:హాస్య బ్రహ్మ బ్రహ్మానందం పుట్టిన రోజు నేడే

  • Published Feb 01, 2024 | 11:16 AM Updated Updated Feb 01, 2024 | 11:16 AM

గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుతో పాటు ప్రదర్శక కళల రంగానికి ఆయన చేసిన కృషికి గాను పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.

గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుతో పాటు ప్రదర్శక కళల రంగానికి ఆయన చేసిన కృషికి గాను పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.

  • Published Feb 01, 2024 | 11:16 AMUpdated Feb 01, 2024 | 11:16 AM
Brahmanandam:హాస్య బ్రహ్మ బ్రహ్మానందం పుట్టిన రోజు నేడే

తెలుగు సినిమా పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ కమెడియన్ గా ఎన్నో ఏళ్లుగా రాణించి అలరించిన బ్రహ్మానందం పుట్టినరోజు నేడు. ఆయనను తెలుగు సినీ హాస్యనటులు దేవుడిలా భావిస్తారంటే అతిశయోక్తి కాదు. తన తొలి చిత్రం ఆహా నా పెళ్లంట (1987)లో అర గుండుగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న తరువాత ఈ ప్రముఖ హాస్యనటులు ఎనలేని అభిమానం పొంది వృద్ధి చెందారు.

ఆ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చడంతో అనతికాలంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ కమెడియన్ గా ఎదిగారు. అంతకు ముందు ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా అత్తిలిలో తెలుగు లెక్చరర్ గా పని చేశారు. క్రమక్రమంగా జనాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.

గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుతో పాటు ప్రదర్శక కళల రంగానికి ఆయన చేసిన కృషికి గాను పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. అలాగే ఉత్తమ హాస్యనటుడిగా ఆరు నంది అవార్డులు, ఫిల్మ్ ఫేర్ అవార్డులు కూడా అందుకున్నారు బ్రహ్మానందం.

ఈ రోజు (ఫిబ్రవరి 01) బ్రహ్మానందం 68వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా తోటి సెలబ్రిటీలు, దేశంలోని ఆయన అభిమానుల నుంచి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దూకుడు, జల్సా, ఆంజనేయులు, ఢీ, రెడీ, విక్రమార్కుడు, అతడు, పోకిరి, అప్పుల అప్పారావు, మనీ మనీ, వెంకీ, మన్మథుడు, అదుర్స్, రేసుగుర్రం లాంటి సినిమాలు బ్రహ్మీ పంచిన శతకోటి నవ్వులలో కొన్నిగా చెప్పుకోవచ్చు.