iDreamPost
android-app
ios-app

Kalki Movie Update: ప్రభాస్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో అవి లేనట్లే !

  • Published Jun 21, 2024 | 8:44 AMUpdated Jun 21, 2024 | 8:44 AM

రెబల్ స్టార్ ప్రభాస్ ను మళ్ళీ వెండి తెరపై చూసే రోజులు దగ్గర పడుతున్నాయి. మరొక వారం రోజుల్లో.. మళ్ళీ ప్రభాస్ మ్యానియా కొనసాగనుంది. అయితే కల్కి సినిమా కోసం అంతగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు మాత్రం ఓ బ్యాడ్ న్యూస్.

రెబల్ స్టార్ ప్రభాస్ ను మళ్ళీ వెండి తెరపై చూసే రోజులు దగ్గర పడుతున్నాయి. మరొక వారం రోజుల్లో.. మళ్ళీ ప్రభాస్ మ్యానియా కొనసాగనుంది. అయితే కల్కి సినిమా కోసం అంతగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు మాత్రం ఓ బ్యాడ్ న్యూస్.

  • Published Jun 21, 2024 | 8:44 AMUpdated Jun 21, 2024 | 8:44 AM
Kalki Movie Update: ప్రభాస్ ఫ్యాన్స్ కు  బ్యాడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో అవి లేనట్లే !

కల్కి సినిమా గురించి ఏ రేంజ్ లో హైప్ ఇచ్చారో.. అదే రేంజ్ లో కొన్ని సార్లు ప్రేక్షకులను.. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులను మేకర్స్.. నిరాశ పరిచారు. చాలా సార్లు సినిమా రిలీజ్ విషయంలోనూ, కొన్ని సార్లు అప్ డేట్స్ విషయంలోనూ.. ఇక రీసెంట్ గా మూవీ సాంగ్ రిలీజ్ విషయంలో కూడా.. ప్రభాస్ అభిమానులు నిరాశ చెందారని చెప్పి తీరాల్సిందే. అయినా సరే ప్రభాస్ కోసం ఇవన్నీ పక్కన పెట్టేసి కనీసం ఈ సినిమా ప్రమోషన్స్ అయినా భారీగా ప్లాన్ చేసారా అంటే.. అది కూడా సైలెంట్ గా చేసేస్తున్నారు. ఇంకా రిలీజ్ కు కొద్దీ రోజులు సమయం మాత్రమే మిగిలి ఉండడంతో.. ఈ మూవీ సెలెబ్రేషన్స్ కోసం ఎదురుచూస్తున్న తెలుగు ప్రేక్షకులకు. ఏదైనా బ్యాడ్ న్యూస్ చెప్పబోతున్నారా అని అనిపిస్తుంది.

సాధారణంగా చిన్న చిన్న సినిమాలకే .. రిలీజ్ డేట్ దగ్గర పడిందంటే.. మూవీ టీమ్ అంతా కూడా ప్రమోషన్స్ చేయడం, వరుస ఇంటర్వూస్ చేయడం, గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్స్ చేయడం.. ఇలా ఒకటి రెండు కాకుండా ఎంత వీలైతే అంత.. ప్రమోషన్స్ ను చేస్తూ ఉంటారు. అలాంటిది.. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతున్న కల్కి సినిమాకు మాత్రం ప్రమోషన్స్ విషయంలో ఏ మాత్రం జోరు కనిపించడం లేదు. ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అయితే ఫినిష్ చేసేసుకున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎలాంటి ప్రమోషన్స్ ను నిర్వహించట్లేదని.. ఎలాంటి ఈవెంట్స్ జరగవని.. ఇన్సైడ్ ఇండస్ట్రీ నుంచి బజ్ వినిపిస్తుంది. ఇక జూన్ 21 న మరొక ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీనిని బట్టి చూస్తే., ఇక తెలుగు స్టేట్స్ లో ఎటువంటి ఈవెంట్ లేనట్లే.

ఇక మరోవైపు కల్కి సినిమా నుంచి.. సరిగా ప్రమోషన్స్ లేవని ఫ్యాన్స్ ఫీల్ అవుతూ ఉంటే.. మూవీ టీమ్ మాత్రం ముంబై రోడ్స్ మీద బుజ్జి భైరవ అంటూ సందడి చేస్తున్నారు . ప్రీ రీలిజ్ ఈవెంట్ ను కూడా చాలా అంటే చాలా సింపుల్ గా ముగించేశారు. దానికి సంబంధించిన అప్ డేట్స్ కూడా ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాము. మరి సైలెంట్ గా సినిమాను రిలీజ్ చేసేసి.. దాని సక్సెస్ గురించి రీసౌండ్ వచ్చేలా సెలెబ్రేషన్స్ చేద్దాం అనుకుంటున్నారో ఏమో కానీ.. సినిమాపై హైప్ క్రియేట్ చేసేసి.. సందడి మాత్రం తగ్గించేశారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి