iDreamPost
android-app
ios-app

The Goat: మైత్రీ చేతికి ది గోట్ తెలుగు రైట్స్.. భారీ రేంజ్ లో విడుదల!

  • Published Jul 09, 2024 | 3:39 PM Updated Updated Jul 09, 2024 | 3:39 PM

కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ది గోట్'. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వినాయక చవితి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో తెలుగు రిలీజ్ రైట్స్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దక్కించుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..

కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ది గోట్'. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వినాయక చవితి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో తెలుగు రిలీజ్ రైట్స్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దక్కించుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Jul 09, 2024 | 3:39 PMUpdated Jul 09, 2024 | 3:39 PM
The Goat: మైత్రీ చేతికి ది గోట్ తెలుగు రైట్స్.. భారీ రేంజ్ లో విడుదల!

టాలీవుడ్ లో ఎన్నో గొప్ప నిర్మాణ సంస్థలు ఉన్నాయి. శ్రీ వేంకటేశ్వర బ్యానర్ పై దిల్ రాజు, గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్, వైజయంతి మూవీస్ పై అశ్వనీ దత్, మైత్రీ మూవీస్ పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి అద్భుతమైన చిత్రాలను నిర్మిస్తూ ముందుకు సాగుతున్నారు. వీరితో పాటుగా మరికొన్ని బ్యానర్స్ కూడా మంచి మూవీస్ నిర్మిస్తూ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాయి. అయితే స్టార్ హీరో, భారీ బడ్జెట్ మూవీస్ అంటే అందరికీ తొలుత గుర్తుకు వచ్చేవి మాత్రం పై నాలుగు బ్యానర్లే. ఈ స్టార్ ప్రొడ్యూసర్స్ సినిమాలు నిర్మించడంతో పాటుగా ఇతర భాషల మూవీస్ ను తెలుగులో రిలీజ్ చేస్తుంటారు. అలా మైత్రీ మూవీస్ జాక్ పాట్ కొట్టేసింది. ఓ స్టార్ హీరో హై రేంజ్ మూవీని తెలుగులో రిలీజ్ చేయడానికి హక్కులను దక్కించుకుంది.

మైత్రీ మూవీ మేకర్స్.. టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే సూపర్ హిట్ చిత్రాలతో పాటుగా అభిరుచి గల చిత్రాలను నిర్మించే బ్యానర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2015లో నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి ముగ్గురు కలిసి స్థాపించిన ఈ సంస్థ.. తక్కువ కాలంలోనే టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక పేరును తెచ్చుకుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు తో తెరకెక్కించిన తొలి చిత్రం శ్రీమంతుడు తోనే ఇండస్ట్రీని షేక్ చేసింది. బాక్సాఫీస్ వసూళ్లతో పాటుగా సమాజానికి ఉపయోగపడే చిత్రాలు నిర్మించడమే తమ ఉద్దేశమని చెప్పకనే చెప్పింది. ఆ తర్వాత కూడా గొప్ప చిత్రలను నిర్మించింది. మరికొన్ని మూవీస్ ను పంపిణీ చేసింది.

ఇదిలా ఉండగా.. తాజాగా ఓ స్టార్ హీరో మూవీ తెలుగు విడుదల హక్కులను దక్కించుకుంది మైత్రీ సంస్థ. కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ లేటెస్ట్ మూవీ ‘గోట్'(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇక తెలుగు రిలీజ్ హక్కులను  మైత్రీ మూవీ మేకర్స్ దక్కించుకుంది. ఆంధ్రా, తెలంగాణలో గోట్ మూవీని భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నట్లు సంస్థ సోమవారం ప్రకటించింది. ఇప్పటికే విజయ్ బర్త్ డే రోజున విడుదల చేసిన గ్లింప్స్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇందులో విజయ్ డ్యూయెల్ రోల్ చేస్తుండటంతో.. మరింత హైప్ ఏర్పడింది. తెలుగులో మైత్రీ మూవీస్ విడుదల చేస్తుండటంతో.. ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. ఇక ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్, మీనాక్షీ చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రభుదేవా కీలక పాత్రలో మెరబోతున్నాడు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

 

View this post on Instagram

 

A post shared by AGS Entertainment (@agsentertainment)

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetine girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom