దళపతి విజయ్ కి ఒక తమిళంలోనే కాకుండా.. పాన్ ఇండియా లెవల్లో ఫాలోయింగ్ ఉంది. తెలుగులో కూడా విజయ్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. కోలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోల్లో దళపతి విజయ్ కూడా ఒకడు. విజయ్ సినిమా అంటే వంద కోట్లు గ్యారెంటీ అనే ట్యాగ్ సొంతం చేసుకున్నాడు. అయితే ఇప్పుడు విజయ్ పేరు పాన్ ఇండియా లెవల్లో మోత మోగిపోతోంది. ఎందుకంటే విజయ్ తీసుకునే రెమ్యూనరేషన్ విషయంలో ఇప్పుడు ఒక గాసిప్ నడుస్తోంది. ఆ రెమ్యూనరేషన్ బాలీవుడ్ కూడా కాదు.. హాలీవుడ్ రేంజ్ లో ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
దళపతి విజయ్ క్రేజ్, రెమ్యూన రేషన్ గురించి ఎప్పుడూ టాక్ నడుస్తూనే ఉంటుంది. సౌత్ లో ఉన్న అగ్ర తారల్లో విజయ్ కూడా ఒకడు. అయితే ఇప్పుడు విజయ్ నుంచి రాబోతున్న లియో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కావడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత విజయ్ కొన్నిరోజులు రెస్ట్ తీసుకోనున్నాడు. ఆ తర్వాత ఆగస్టులో మరో సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి టైటిల్, డైరెక్టర్, స్టోరీ వంటి ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. కానీ, ఈ సినిమాకి విజయ్ తీసుకునే రెమ్యూనరేషన్ విషయంలో ఒక గాసిప్ చక్కర్లు కొడుతోంది.
ఆ ప్రాజెక్టుకు విజయ్ అక్షరాలా రూ.200 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నాడు అని చెబుతున్నారు. అదే నిజం అయితే ఒక సినిమాకి రూ.200 కోట్లు తీసుకున్న హీరోగా ఇండియాలోనే విజయ్ మొదటి వ్యక్తి అవుతాడు. బాలీవుడ్ లో ఉన్న షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి అగ్ర తారలను వెనక్కి నెట్టేసి విజయ్ మొదటి స్థానానికి చేరుకుంటాడు. అయితే ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉంది అనేది మాత్రం అధికారిక ప్రకటన వస్తేనే చెప్పగలం. ఇప్పుడు ఈ వార్తను విజయ్ ఫ్యాన్స్ నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు. విజయ్ టాప్ అంటూ కామెంట్ చేస్తున్నారు.