iDreamPost
android-app
ios-app

Nani: రజినీ, విజయ్ బాటలో నాని.. కొత్త ట్రెండ్​కు న్యాచురల్ స్టార్ శ్రీకారం!

  • Published Sep 02, 2024 | 9:53 PM Updated Updated Sep 02, 2024 | 10:24 PM

Nani, Saripodhaa Sanivaaram Movie, Rajinikanth, Vijay: న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు కొత్త ట్రెండ్​కు శ్రీకారం చుట్టారు. ఇది టాలీవుడ్​కు సూపర్ న్యూస్ అనే చెప్పాలి. ఇంతకీ నాని ఏం చేశారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Nani, Saripodhaa Sanivaaram Movie, Rajinikanth, Vijay: న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు కొత్త ట్రెండ్​కు శ్రీకారం చుట్టారు. ఇది టాలీవుడ్​కు సూపర్ న్యూస్ అనే చెప్పాలి. ఇంతకీ నాని ఏం చేశారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Published Sep 02, 2024 | 9:53 PMUpdated Sep 02, 2024 | 10:24 PM
Nani: రజినీ, విజయ్ బాటలో నాని.. కొత్త ట్రెండ్​కు న్యాచురల్ స్టార్ శ్రీకారం!

సొంతగడ్డ పైనే కాదు.. పరాయిగడ్డ మీద కూడా రాణించాలని అందరూ కోరుకుంటారు. ప్రతి హీరో, దర్శకుడు తమ మార్కెట్​ను మరింత పెంచుకోవాలని భావిస్తారు. తమ సినిమాలు మరిన్ని భాషల్లో, వైడర్ ఆడియెన్స్​కు రీచ్ అవ్వాలని చూస్తుంటారు. అయితే మార్కెట్ విస్తృతి పెంచడం అంత ఈజీ కాదు. దీనికి చాలా సమయం పడుతుంది. కొన్ని చోట్ల అయితే పరభాషా సినిమాలకు ఆదరణ దక్కడం చాలా కష్టం. కానీ ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమేనని కొందరు నిరూపిస్తుంటారు. న్యాచురల్ స్టార్ నాని కూడా ఇదే ప్రూవ్ చేశారు. ఆయన నటించిన కొత్త చిత్రం ‘సరిపోదా శనివారం’ గత గురువారం బిగ్ స్క్రీన్స్​లో విడుదలైంది. మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ ఫిల్మ్ బ్లాక్​బస్టర్ రన్​ను కంటిన్యూ చేస్తోంది. ఈ సినిమాతో నాని కొత్త ట్రెండ్​కు తెరదీయడం విశేషం.

తెలుగు స్టేట్స్​లో కలెక్షన్స్​లో దుమ్మురేపుతున్న ‘సరిపోదా శనివారం’ మూవీ తమిళనాట కూడా మంచి హోల్డ్​ను కనబరుస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తమిళ సినిమాలను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. అక్కడి హీరోలపై మనోళ్లు ఎంత ప్రేమ చూపిస్తారో అందరికీ తెలిసిందే. అయితే తమిళ ఆడియెన్స్ మాత్రం తెలుగు హీరోలను అంతగా ఆదరించరనే అభిప్రాయం ఉంది. ‘బాహుబలి’, ‘ఈగ’ లాంటి ఒకట్రెండు మూవీస్ తప్పితే అక్కడ అనువాదమై హిట్లు కొట్టిన తెలుగు చిత్రాలు అంతగా లేకపోవడమే దీనికి ఎగ్జాంపుల్​గా చెబుతుంటారు. కానీ ‘ఈగ’తో అక్కడి ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించిన నాని ఆ తర్వాత ఆ మార్కెట్ మీద ఫోకస్ చేయలేదు. కానీ ‘దసరా’, ‘హాయ్ నాన్న’తో తమిళుల్ని పలకరించారు. ‘సరిపోదా శనివారం’తో మరోమారు వాళ్ల ముందుకు వచ్చేశారు. ఈ మూవీ అక్కడ సూపర్ హిట్ దిశగా అడుగులు వేస్తుండటం విశేషం. తమిళంలో ‘సూర్యాస్ సాటర్ డే’ పేరుతో రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ అదరగొడుతోంది.

నానితో పాటు ఎస్​జే సూర్య ఉండటం, ప్రమోషన్స్ బాగా చేయడం, బెటర్ టాక్, రివ్యూలు రావడంతో ‘సరిపోదా శనివారం’ మూవీ తమిళనాట మంచి రన్​ను కొనసాగిస్తోంది. ఇప్పటికే రూ.10 కోట్ల మేర వసూళ్లు చేసిందని ట్రేడ్ వర్గాల అంచనా. మామూలుగా తెలుగు సినిమాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకతో పాటు ఉత్తరాదిన మంచి వసూళ్లు రావడం సాధారణమే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​కు అయితే మలయాళంలోనూ సూపర్ మార్కెట్ ఉంది. మన దేశంతో పాటు ఓవర్సీస్​లోనూ రికార్డు స్థాయి వసూళ్లు, పాన్ ఇండియా రేంజ్​లో హిట్లు కొడుతున్న తెలుగు హీరోలకు తమిళ మార్కెట్ మాత్రం అంతుచిక్కనిదిగా ఉంది. కమల్ హాసన్, రజినీకాంత్ నుంచి సూర్య, విజయ్ దాకా అక్కడి వారు ఇక్కడకు వచ్చి బ్లాక్​బస్టర్స్ కొడుతున్నారు. కానీ మనవారు మాత్రం తమిళ నాట జెండా పాతలేకపోతున్నారు. అయితే ఎట్టకేలకు ‘సరిపోదా శనివారం’తో కొత్త ట్రెండ్​ మొదలైనట్లే కనిపిస్తోంది. రజినీ, విజయ్ ఇక్కడ సక్సెస్ అయినట్లు.. నాని తమిళంలో విజయం సాధించడం భేష్ అని అంతా మెచ్చుకుంటున్నారు. అందునా సూర్య-విజయ్​లకు తెలుగులో సక్సెస్ అవడానికి చాలా కాలం పట్టింది. కానీ నాని మాత్రం తక్కువ టైమ్​లోనే తమిళనాట జెండా పాతేశాడని అంతా ప్రశంసిస్తున్నారు. మరి.. ‘సరిపోదా శనివారం’ తమిళ వెర్షన్ విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.