iDreamPost
android-app
ios-app

Suresh Kondeti: జర్నలిస్టు సురేష్ కొండేటిపై బ్యాన్? ఆ కాంట్రవర్సీ వల్లే..!

  • Published Dec 15, 2023 | 10:17 PM Updated Updated Dec 16, 2023 | 8:53 AM

ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్టు సురేష్ కొండేటి సోషల్ మీడియాలో బాగా పాపులర్ అనేది తెలిసిందే. మూవీ ప్రమోషనల్ ఈవెంట్స్​లో సెలబ్రిటీలను ఆయన అడిగే క్వశ్చన్స్ చాలాసార్లు ట్రోలింగ్​కు గురవడం గమనించే ఉంటారు.

ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్టు సురేష్ కొండేటి సోషల్ మీడియాలో బాగా పాపులర్ అనేది తెలిసిందే. మూవీ ప్రమోషనల్ ఈవెంట్స్​లో సెలబ్రిటీలను ఆయన అడిగే క్వశ్చన్స్ చాలాసార్లు ట్రోలింగ్​కు గురవడం గమనించే ఉంటారు.

  • Published Dec 15, 2023 | 10:17 PMUpdated Dec 16, 2023 | 8:53 AM
Suresh Kondeti: జర్నలిస్టు సురేష్ కొండేటిపై బ్యాన్? ఆ కాంట్రవర్సీ వల్లే..!

ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్టు సురేష్ కొండేటి గురించి తెలిసిందే. మూవీ ప్రమోషన్స్​లో ఆయన చేసే విన్యాసాలు, సెలబ్రిటీలను ఆయన అడిగే క్వశ్చన్స్ మీద నెట్టింట ట్రోలింగ్ కూడా జరుగుతూ ఉండటం గమనించే ఉంటారు. సోషల్ మీడియాలో ఆయన మీద నెగెటివిటీ భారీగానే ఉండటాన్ని అబ్జర్వ్ చేసే ఉంటారు. ఫిల్మ్ ప్రమోషన్ ఈవెంట్స్​లో స్టేజ్ పైకి ఎక్కి డ్యాన్సులు చేయడం ద్వారా ఆయన బాగానే పాపులర్ అయ్యారు. అలాంటి సురేష్ కొండేటి ఇప్పుడు చిక్కుల్లో పడ్డట్లు తెలుస్తోంది. ఇక మీదట ఆయన మూవీ ప్రమోషనల్​ ఈవెంట్స్​లో కనిపించడం కష్టమని అంటున్నారు. ఎందుకంటే సురేష్ కొండేటిని తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ బ్యాన్ చేసిందని వార్తలు వస్తున్నాయి.

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీఎఫ్​జేఏ), క్రిటిక్ అసోసియేషన్​తో పాటు పీఆర్వోలు అందరూ కలసి కోఆర్డినేషన్ కమిటీగా ఏర్పడి శుక్రవారం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో మూవీ ఓపెనింగ్స్ నుంచి రిలీజ్ ఈవెంట్స్, ప్రెస్ మీట్స్ వరకు చాలా వాటి మీద డెసిజన్స్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే జర్నలిస్టు సురేష్ కొండేటి మీద కూడా సంచలన నిర్ణయం తీసుకున్నారని టాక్. రీసెంట్​గా జరిగిన సంతోషం అవార్డుల కాంట్రవర్సీ నేపథ్యంలో ఆయనకు టీఎఫ్​సీసీ ఒక లెటర్​ను జారీ చేసింది. దీంతో ఇదే కారణంగా కొన్నాళ్ల పాటు సురేష్​ను ప్రెస్​ మీట్లకు దూరంగా ఉంచాలని టీఎఫ్​జేఏ నిర్ణయించిందని వినికిడి. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున జరిగే ప్రెస్ మీట్స్​లో సురేష్ కొండేటి కొంతకాలం పాటు కనిపించే అవకాశం లేదని రూమర్స్ వస్తున్నాయి.

కాగా, చాన్నాళ్లుగా సంతోషం అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సురేష్ కొండేటి ఈసారి ఆ ప్రోగ్రామ్​ను గోవాలో ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కోసం సౌతిండియా నుంచి చాలా మంది సినీ ప్రముఖులను, మీడియా ప్రతినిధులను గోవాకు తీసుకెళ్లారు. అయితే ఈవెంట్ నిర్వహణలో పలువురు కన్నడ సెలబ్రిటీలకు చేదు అనుభవం ఎదురైందంటూ వార్తలు వచ్చాయి. కన్నడ ప్రముఖుల్ని స్టేజీ మీద అవమానించారని, హోటల్ సిబ్బందితోనూ వారికి ఇబ్బంది ఏర్పడిందని, రూమ్ బిల్స్ కూడా చెల్లించలేదనే విమర్శలు వినిపించాయి. ఈ విషయంలో తెలుగు పరిశ్రమను కన్నడ జర్నలిస్టులు తప్పుబట్టారు. అయితే దీని మీద మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సీరియస్ అయ్యారు. ఒక వ్యక్తి చేసిన దానికి మొత్తం టాలీవుడ్​కు ఆపాదించడం సరికాదన్నారు. ఇక, ఈ కాంట్రవర్సీ వల్ల విమర్శల పాలైన సురేష్ కొండేటి.. ఇప్పుడు బ్యాన్​ను కూడా ఎదుర్కోవాల్సి వస్తోందని ఫిల్మ్ నగర్ టాక్. అయితే తనను బ్యాన్ చేశారంటూ వస్తున్న వార్తలపై సురేష్ కొండేటి సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు. తాను ఓ డివోషనల్ ట్రిప్​లో ఉన్నానని. మళ్లీ హ్యాపీగా ప్రెస్ మీట్స్​కు వస్తానని క్లారిటీ ఇచ్చారు. మరి.. సురేష్ కొండేటి మీద నిషేధం విధించారంటూ వస్తున్న న్యూస్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.