Somesekhar
సంక్రాంతికి రాబోతున్న ఐదు సినిమాలు కూడా టాక్ పరంగా, బజ్ పరంగా ఓ రేంజ్ లో ఉన్నాయి. అయితే ప్రతి సినిమాకు బలాలు మరియు బలహీనతలు ఉంటాయి. మరి ఈ సంక్రాంతికి రాబోతున్న సినిమాల బలాలు మరియు బలహీనతలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.
సంక్రాంతికి రాబోతున్న ఐదు సినిమాలు కూడా టాక్ పరంగా, బజ్ పరంగా ఓ రేంజ్ లో ఉన్నాయి. అయితే ప్రతి సినిమాకు బలాలు మరియు బలహీనతలు ఉంటాయి. మరి ఈ సంక్రాంతికి రాబోతున్న సినిమాల బలాలు మరియు బలహీనతలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.
Somesekhar
ప్రతీ సంక్రాంతికి కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్ద హీరోల సినిమాలు ఒకటి రెండు అంతకు మించి వస్తూనే ఉంటాయి. అయితే ఈసారి ఏకంగా నాలుగు పెద్ద హీరోల సినిమాలు ఒక చిన్న హీరో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మహేష్ బాబు గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామి రంగ, రవితేజ ఈగల్, తేజ సజ్జ హనుమాన్ సినిమాలతో రాబోతున్నారు. సంక్రాంతి సీజన్ ను సద్వినియోగం చేసుకునేందుకు ఈ ఐదు సినిమాలు పోటీ పడుతున్నాయి. ఈ పోటీలో మాదే పై చేయి అంటే మాదే పై చేయి అన్నట్లుగా ఆయా చిత్రాల హీరోలు, యూనిట్ సభ్యులు నమ్మకంగా ఉన్నారు. ప్రచారాలు, పోస్టర్ లు, వీడియోలు చూస్తూ ఉంటే ఒకదాన్ని మించి ఒకటి అన్నట్లుగా ఈ సంక్రాంతికి రాబోతున్న సినిమాలు ఉంటాయి అనిపిస్తుంది. మొత్తంగా ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాల విందు ఖాయం. ఈ సంక్రాంతికి రాబోతున్న సినిమాలకు సంబంధించిన బలాలు మరియు బలహీనతలు ఓసారి పరిశీలిద్దాం.
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబో అవ్వడం ఈ సినిమాకు చాలా పెద్ద బలం. వీరి కాంబోలో మూవీ కోసం ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాలు కమర్షియల్ గా హిట్ అవ్వలేదు.. కానీ టీవీ టెలికాస్ట్ లో సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాకి త్రివిక్రమ్, మహేష్ బాబు, హీరోయిన్ శ్రీలీల బలంగా చెప్పుకోవచ్చు. ఇక బలహీనత విషయానికి వస్తే ఈ సినిమా షూటింగ్ మొన్నటి వరకు జరుగుతూనే ఉంది. కనుక పబ్లిసిటీకి ఎక్కువ సమయం దక్కలేదు అనేది టాక్.
వరుసగా ‘హిట్’ తో హిట్ కొట్టిన దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందడం ఈ సినిమా బలం. అంతే కాకుండా ఈ సినిమా వెంకీ కి 75వ సినిమా అవ్వడం వల్ల కూడా చాలా పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. చాలా రోజుల నుంచి ప్రమోషన్స్ నిర్వహించడం కూడా సినిమాకు అదనపు బలం గా చెప్పుకోవచ్చు. ఇక సైంధవ్ కి ఒకే ఒక్క బలహీనత వెంకీ గత చిత్రాల ఫలితాలు. ఈ మధ్య కాలంలో ఆయన హిట్ కొట్టలేక పోయాడు. మరి ఈ సినిమాతో హిట్ లోటు ను భర్తీ చేస్తాడా అనేది చూడాలి.
నాగార్జున సంక్రాంతికి ఈ సినిమా తో రావడం హిట్ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వడం ఖాయం అనే టాక్ వినిపిస్తుంది. సోగ్గాడే చిన్ని నాయన మరియు బంగార్రాజు సినిమాలు సంక్రాంతికి వచ్చి హిట్ అయ్యాయి. ఈ సినిమా సంక్రాంతికి వస్తుండటంతో హిట్ సెంటిమెంట్ కంటిన్యూ అవుతుందని, అదే ఈ సినిమా బలంగా అక్కినేని ఫ్యాన్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు. అల్లరి నరేష్ మరియు రాజ్ తరుణ్ లు ఈ సినిమాలో ఉండటం ప్లస్ గా చెప్పుకోవచ్చు. నాగ్ గత చిత్రాల ఫలితాలు ఈ సినిమా విషయంలో ఎలా పని చేస్తాయి అనేది బలహీనత గా చెప్పుకోవచ్చు.
రవితేజ ఈ సినిమాలో చాలా విభిన్నమైన లుక్ లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ మరియు టీజర్ లు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాయి. పాజిటివ్ బజ్ క్రియేట్ అవ్వడం ఈ సినిమాకు అతి పెద్ద బలంగా చెప్పుకోవచ్చు. ఇంత పోటీలో రావడం ఈ సినిమా కు కాస్త బలహీనతగా పరిగణించే అవకాశం ఉందని కొందరు ఊహిస్తున్నారు.
ఈ సినిమా ఆంజనేయుడి కాన్సెప్ట్ తో రూపొందడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా ఈ సినిమా టీజర్ కి విశేష స్పందన దక్కింది. ఆదిపురుష్ కంటే హనుమాన్ బాగుంటుంది అనే పాజిటివ్ ముందస్తు బజ్ ను క్రియేట్ చేసింది. ఇది సినిమాకు అతి పెద్ద బలం. గుంటూరు కారం విడుదల రోజే రావడం అనేది కచ్చితంగా మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
మొత్తానికి ఈ సంక్రాంతి పండుగను మరింత కలర్ ఫుల్ గా, ఆనందంగా మార్చేందుకు గాను టాలీవుడ్ నుంచి ఈ అయిదు సినిమాలు రాబోతున్నాయి. తెలుగు సినిమా పరిశ్రమ కు ఈ ఏడాది కలిసి రావాలి అంటే ఈ సంక్రాంతి సినిమాలు అన్నీ కూడా విజయాన్ని సొంతం చేసుకోవాలని సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు. మరి ఈ సంక్రాంతి సినిమాల్లో మీ ఫస్ట్ ఛాయిస్ ఏంటి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.