Arjun Suravaram
Hanuman Movie: సంక్రాంతికి విడుదలై అద్భుత విజయాన్ని అందుకున్న సినిమాలో హనుమాన్ ఒకటి. ఇప్పుడు ఒక్కడ చూసిన అదే పేరు వినిపిస్తోంది. అయితే ఈ సినిమాలో చూపించిన విభీషణుడి పాత్రపై ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Hanuman Movie: సంక్రాంతికి విడుదలై అద్భుత విజయాన్ని అందుకున్న సినిమాలో హనుమాన్ ఒకటి. ఇప్పుడు ఒక్కడ చూసిన అదే పేరు వినిపిస్తోంది. అయితే ఈ సినిమాలో చూపించిన విభీషణుడి పాత్రపై ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Arjun Suravaram
సంక్రాంతి బరిలో నిలిచి భారీ విజయాన్ని అందుకున్న చిత్రం ‘హనుమాన్’. ఈ సినిమా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజ సజ్జా కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, సముద్ర ఖని కీలక పాత్రలో నటించారు. అలానే అమృత అయ్యర్ ఈ సినిమాలో తేజాకు జోడిగా నటించారు. ఇక ఈ సినిమా ప్రీమియర్స్ షోస్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుని కలెక్షన్స్ సైతం భారీగానే రాబడుతుంది. ఈ సినిమా కథ, కథనం, విజువల్స్, నటీనటుల యాక్టింగ్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇలా అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో వచ్చే విభీషణుడి క్యారెక్టర్ సినిమాను మరోస్థాయిలో నిలబెట్టింది.
‘హనుమాన్’.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ మూవీ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. రిలీజ్‌కు ముందు నుంచే టాక్ ఆఫ్ టౌన్‌గా మారిపోయిందీ ఈ చిత్రం. ప్రీమియర్ షోలతోనే రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టింది ‘హనుమాన్’. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ సత్తా చాటిన ఈ సినిమా.. విడుదలైన తర్వాత ఫుల్ పాజిటివ్ టాక్ రావడంతో దుమ్మురేపుతోంది. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలోనూ తడాఖా చూపిస్తోంది. ఇక ప్రశాంత్ వర్మ టేకింగ్ చాలా అద్భుతంగా ఉంది. అంతేకాక పూరాణాల్లో ఉన్న విభీషణుడి పాత్రను కూడా ఈ సినిమాలో చూపించాడు. హీరోను బ్యాగ్రౌండ్ లో డ్రైవ్ చేస్తూ విభీషణుడు కనిపిస్తాడు. అయితే ప్రశాంత్ వర్మ.. ఆ క్యారెక్టర్ ను తీసుకోవడం పట్ల అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇక్కడ కొన్ని సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పురాణాల్లో ఉన్న విభీషణుడు నేటి కాలంలో కూడా బతికే ఉన్నాడా అనే అనుమానం చాలా మందిలో వ్యక్తమవుతుంది. మరి.. అసలు నిజం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…
విభీషణుడు లంకాధిపతి రావణాసురుడి సోదరుడు. రామరావణ యుద్ధంలో రాముడి పక్షాన నిలిచాడు విభిషణుడు. అంతేకాక రాముడు రావణాసురుడిని అంతమొందించడంలో విభీషణుడు కీలక పాత్ర పోషించాడు. ఆయన ఇచ్చిన సలహాతోనే రాముడు రావణుడిని చంపేశాడు. అనంతరం విభీషణుడికి శ్రీరాముడు ఓ వరం కూడా ఇచ్చినట్లు పురాణలు చెబుతున్నాయి. బంధాలు అనుబంధాలు అని కాకుండా.. ధర్మం వైపు నిలబడిన వ్యక్తివి కాబట్టి..చిరంజీవిగా లంకను పరిపాలిస్తూ ఉంటావు అని వరం ఇచ్చారు.
ఇక రాముడి వరంతో విభీషణుడు లంకను పరిపాలిస్తుంటాడు. అయితే రాముడు వరం కారణంగా ఆయనకు మరణం అనేది లేదని పురాణాలు చెబుతున్నాయి. యుగాలు మారిన ఆయన చిరంజీవిగానే ఉంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇలా భారత పురాణాల ప్రకారం.. ఏడు మందిని చిరంజీవులు అంటారు. అశ్వత్థామ, బలి, హనుమంతుడు, విభీషణుడు, కృపుడు, పరశురాముడు, వ్యాసుడు.. ఈ ఏడుగురిని సప్త చిరంజీవులు అని పిలుస్తారు. చిరంజీవులు అంటే మరణం లేని వారు అనే విషయం మనకు తెలిసిందే. అంటే వీరు ఏ కాలంలో అయినా బతికే ఉంటారు.
ఇక ప్రశాంత్ వర్మ పురాణాల్లోని చిరంజీవి అనే అంశాన్ని పట్టుకున్నాడు. ఈ క్రమంలోనే హనుమాన్ సినిమాకు ఏ పాత్ర అయితే స్కోప్ ఉందో..దానిని తీసుకున్నాడు. ఈ క్రమంలోనే హీరోను డ్రైవ్ చేసే వ్యక్తిగా విభీషణుడిని ప్రశాంత్ వర్మ చూపించాడు. చిరంజీవుల్లో విభీషణుడు ఒకరు కాబట్టి.. హనుమాన్ సినిమాలో ప్రశాంత్ వర్మ.. ఆ క్యారెక్టర్ ను ఇన్ వాల్వ్ చేశాడు. అంతేకాక తన చరిత్రను చెబుతూ.. హీరోకు మద్దతు విభీషణుడు నిలబడిన విధానాన్ని డైరెక్ట్ బలంగా చూపించారు. చిరంజీవులు ఏ కాలంలోనైనా ఉంటారని పురాణాలు చెప్తున్న ప్రధాన అంశంతో హనుమాన్ సినిమాలో విభీషణుడిని ప్రశాంత్ వర్మ తీసుకొచ్చారు.
అంతేకాక ఈ క్యారెక్టర్ అద్భుతంగా తెరకెక్కించడంలో ప్రశాంత్ వర్మ సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాలో విభీషణుడి పాత్రలో సముద్రఖని అద్భుతంగా నటించారు. ఓ సన్నివేశంలో ఆయన చెప్పే డైలాగ్స్.. కార్తికేయ-2 లో అనుపర్ కేర్ ను గుర్తు చేశాయి. అలా మొత్తంగా భారత ఇతిహాసాల ప్రకారం..ఏడు మంది చిరంజీవులు ఉన్నారు. అందుకే ‘హనుమాన్’ మూవీలో విభీషణుడ్ని బతికే ఉన్నట్లు ప్రశాంత్ వర్మ చూపించారు. మరి.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాలో విభీషణుడి పాత్రను చూపించిన విధానంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.