iDreamPost
android-app
ios-app

Babloo Prithiveeraj: 57 ఏళ్ల నటుడితో డేటింగ్‌.. తాజాగా బ్రేకప్‌! ఎందుకంటే..

  • Published Mar 18, 2024 | 3:41 PM Updated Updated Mar 18, 2024 | 3:41 PM

ప్రముఖ నటుడు పృథ్విరాజ్ తన భార్యతో విడాకుల తర్వాత.. శీతల్ అనే తెలుగు అమ్మాయితో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. అయితే, కొన్నాళ్ల క్రితం వీరి మధ్యన కూడా విబేధాలు తలెత్తాయని రూమర్స్ వినిపించాయి. ఇక తాజాగా శీతల్ ఆ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది.

ప్రముఖ నటుడు పృథ్విరాజ్ తన భార్యతో విడాకుల తర్వాత.. శీతల్ అనే తెలుగు అమ్మాయితో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. అయితే, కొన్నాళ్ల క్రితం వీరి మధ్యన కూడా విబేధాలు తలెత్తాయని రూమర్స్ వినిపించాయి. ఇక తాజాగా శీతల్ ఆ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది.

  • Published Mar 18, 2024 | 3:41 PMUpdated Mar 18, 2024 | 3:41 PM
Babloo Prithiveeraj: 57 ఏళ్ల నటుడితో డేటింగ్‌.. తాజాగా బ్రేకప్‌! ఎందుకంటే..

యాక్టర్ పృథ్విరాజ్ గురించి తెలుగు ఆడియన్స్ కు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా, విలన్ గా సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు పృథ్విరాజ్. అటు సినిమాలతో పాటు ఇటు సీరియల్స్ లో కూడా మంచి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. అంతేకాకుండా తన పర్సనల్ విషయాల వలన ఇటు సోషల్ మీడియాలో కూడా ట్రోల్ అవుతూనే ఉంటాడు. గతంలో పృథ్విరాజ్ బీనాను పెళ్లాడాడు. ఆ తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో 56 ఏళ్ళ వయస్సులో ఈ నటుడు శీతల్ అనే మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనే ప్రచారం జరిగింది. కొన్నాళ్ల క్రితం వీరి మధ్య కూడా విభేదాలు వచ్చాయనే వార్తలు జోరుగా వినిపించాయి. మొన్నటివరకు ఆ వార్తలపై క్లారిటీ లేదు కానీ.. తాజాగా ఆ వారి బ్రేక్ అప్ నిజమేనంటూ.. శీతల్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా క్లారిటీ ఇచ్చింది.

పృథ్విరాజ్ బీనాల మధ్య దాంపత్య బంధం కొన్నాళ్ల పాటు బాగానే సాగింది. వీరిద్దరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. అయితే కొంతకాలం తర్వాత వీరి మధ్య గొడవలు రావడంతో.. వారిద్దరూ చట్ట పరంగా విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక ఆ తర్వాత పృథ్విరాజ్ శీతల్ అనే తెలుగు అమ్మాయితో.. ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ కొంతకాలం పాటు లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నారు. ఈ క్రమంలోనే పృథ్విరాజ్ ఆమెను సీక్రెట్ గా పెళ్లిచేసుకున్నాడనే వార్తలు జోరుగా వినిపించిన కొన్నాళ్లకే.. వీరిద్దరికి బ్రేక్ అప్ అయిందనే వార్తలు కూడా బాగ వినిపించాయి. వాటిలో ఎంత వరకు నిజం ఉందో అని అనుకునేలోపే తాజాగా శీతల్ .. తన సోషల్ మీడియా ఖాతా ద్వారా క్లారిటీ ఇచ్చేసింది.

Dating a 57-year-old actor 2

శీతల్ ఆ పోస్ట్ ద్వారా.. “చాలా మంది నా జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఎన్నో ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. నా పరిస్థితి అర్ధం చేసుకోకుండా ఏదేదో ఊహించుకుంటున్నారు. పృథ్వి, నేను పెళ్లి చేసుకోలేదు. సహజీవనం చేశామంతే ! మేము ఊహించినట్లుగా మా రిలేషన్ ముందుకు వెళ్ళలేదు. అయితే, ఈ ప్రయాణంలో మేము సంతోషాన్ని పంచుకున్న క్షణాలెన్నో ఉన్నాయి. కొద్దీ నెలల క్రితమే మేము విడిపోయాము. జరిగిందేదో జరిగిపోయింది. దయచేసి మా నిర్ణయాన్ని గౌరవిస్తూ, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించరని ఆశిస్తున్నాను”. అంటూ పోస్ట్ ద్వారా క్లారిటీ ఇచ్చింది శీతల్. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.