iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారి.. బుల్లితెరపై బ్యూటీ క్వీన్..? ఎవరో తెలుసా..?

ఫోటోకు ఫోజులిస్తున్న ఈ చిన్నారి .. ఇప్పుడు బుల్లితెరపై బ్యూటీ క్వీన్. చిన్నప్పటి నుండి నటనను అవపోసన పట్టిన ఆమె.. స్మాల్ స్క్రీన్ పైకి అడుగు పెట్టి అనతి కాలంలోనే మహిళా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది.

ఫోటోకు ఫోజులిస్తున్న ఈ చిన్నారి .. ఇప్పుడు బుల్లితెరపై బ్యూటీ క్వీన్. చిన్నప్పటి నుండి నటనను అవపోసన పట్టిన ఆమె.. స్మాల్ స్క్రీన్ పైకి అడుగు పెట్టి అనతి కాలంలోనే మహిళా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది.

ఈ చిన్నారి.. బుల్లితెరపై బ్యూటీ క్వీన్..? ఎవరో తెలుసా..?

సిల్వర్ స్క్రీన్ మీదే కాదు.. స్మాల్ స్క్రీన్లపై కూడా పరాయి ఇండస్ట్రీ హవా కొనసాగుతుంది. సీరియల్లో సైతం మెయిన్ రోల్స్ కింద పొరుగు రాష్ట్రాల చెందిన నటీనటులను తీసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఒకప్పుడు తమిళ నటీనటులదీ పై చేయిగా ఉంటే.. ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేస్తున్నారు కన్నడ ఇండస్ట్రీకి చెందిన భామలు. ఇదిగో ఆ కోవలోకే వస్తుంది ఈ చిన్నారి పాప కూడా. కన్నడ ఇండస్ట్రీ సీరియల్స్ చేసి ఆ తర్వాత తెలుగు నాట అడుగు పెట్టింది. కానీ ఎక్కడా కన్నడ కస్తూరీలా అనిపించదు. అచ్చమైన తెలుగు అమ్మాయిగానే ఆకట్టుకుంది. తన కట్టు, బొట్టు అంతా పదహరణాల తెలుగు ఆడపడుచులానే ఉంటుంది కాబట్టి.. ఆమెను తమ అమ్మాయిగా ఓన్ చేసుకున్నారు ఇక్కడ మహిళా ప్రేక్షకులు. ఇంతలా ఆకట్టుకున్న ఆ అమ్మాయి ఎవరో కాదు.. మేఘనా లోకేశ్.

మేఘనా అంటే ఎక్కువ గుర్తు పట్టకపోవచ్చు కానీ.. శశి అంటే ఠక్కున చెప్పేస్తుంటారు. 2013లో వచ్చిన శశిరేఖా పరిణయం ధారావాహికతో తెలుగు నాట అడుగు పెట్టింది ఈ శాండిల్ వుడ్ భామ. శశీ బీటెక్ అంటూ అల్లరి పిల్లగా ఆకట్టుకుంది. అనతికాలంలోనే తన నటనతో టీవీ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత కళ్యాణ వైభోగంలో డ్యూయల్ రోల్ పోషించింది. ఇది జీ తెలుగులో ఆరేళ్ల పాటు కొనసాగింది. అంటే గత ఏడాది వరకు ఈ సీరియల్ నడుస్తూనే ఉంది. రక్త సంబంధం, కళ్యాణం, కమనీయం సీరియల్స్ చేసింది. ధారావాహికల్లో ఆమెకు ఫేం రావడంతో పలు చిత్రాల్లోనూ నటించింది. ఇది మా ప్రేమ కథలో యాంకర్ రవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఎమోషన్, బ్యూటీఫుల్ లైఫ్, అమీర్ పేట టూ అమెరికా వంటి చిత్రాలు, షార్ట్ ఫిల్మింస్‌లో నటించింది.

Meghana Lokesh actress 1

మైసూర్‌లో పుట్టి పెరిగి మేఘా లోకేశ్ చిన్నప్పటి నుండి కళల పట్ల ఆసక్తి కనబర్చేది. ఆమె థియేటర్ ఆర్టిస్ట్. 8 సంవత్సరాల వయస్సు నుండే ఆమె ప్రదర్శనలు ఇచ్చేది. ఆమె అలా 270కి పైగా ప్రదర్శనలిచ్చింది. మెల్లిగా  కన్నడ బుల్లితెరపై చిన్న చిన్న యాడ్స్ చేసింది. పవిత్ర బంధన అనే టెలివిజన్ షో ద్వారా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత పురుషోత్తమ చేసి.. టాలీవుడ్‌లోకి కాలు మోపింది. ఇక అక్కడ నుండి వరుస సీరియల్స్, సినిమాలు, షోస్ చేసింది. 2019లో స్వరూప్ భరద్వాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న మేఘనా లోకేశ్.. నటనకు ఫుల్ స్టాప్ పెట్టలేదు. కెరీర్ కంటిన్యూ చేస్తూనే ఉంది. తాజాగా జీ తెలుగులో సూపర్ జోడీలో సందడి చేసింది. ప్రస్తుతం వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. స్వెట్ అనే పేరుతో ఆభరణాల బిజినెస్ చేస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Shwet By Meghana Lokesh (@shwet_by_meghanalokesh)