సమంత.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. తన నటనతో, అందంతో ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టింది. కాగా.. ప్రస్తుతం సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో సతమతమవుతోంది సామ్. దాంతో ఈ విరామాన్ని పూర్తిగా తన ఆరోగ్యం కోసం కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే.. ఆధ్యాత్మిక బాటను అనుసరిస్తోంది. తాజాగా సద్గురు ఈషా సెంటర్ లో జాయిన్ అయ్యింది సామ్. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
గతకొంత కాలంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. దాంతో తాజాగా సినిమాలకు కొంత విరామం ప్రకటించింది ఈ బ్యూటీ. ఈ విరామ సమయాన్ని ఆధ్యాత్మిక స్థితిలో గడపడం ద్వారా తన ఆరోగ్యాన్ని తిరిగి స్ట్రాంగ్ గా చేసుకోవాలని సామ్ భావిస్తోంది. అందులో భాగంగానే సద్గురు ఈషా సెంటర్ లో జాయిన్ అయ్యింది సమంత. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. మెడలో పూల దండతో.. ధ్యాన స్థితిలో ఉన్న సామ్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలతో పాటుగా ఓ ఇంట్రెస్టింగ్ నోట్ కూడా రాసుకొచ్చింది సమంత.
సమంత ఆ నోట్ లో..”ఓ మనిషి ఎలాంటి ఆలోచనలు లేకుండా, నిశ్చలంగా కూర్చోవడం, డిస్టబెన్స్, కదలికలు లేకుండా కూర్చోవడం దాదాపు అసాధ్యం అనిపించింది. ఈరోజు నా ధ్యాన స్థితి మూలంగా నేను కొంత శక్తిమంతురాలిని అయ్యానని అనిపిస్తోంది. ఈ ప్రక్రియ ఇంత సులువుగా, పవర్ ఫుల్ గా ఉంటుందని నేను అనుకోలేదు” అంటూ రాసుకొచ్చింది సామ్. ప్రస్తుతం సమంత, విజయ్ దేవరకొండకు జోడీగా ఖుషీ సినిమాలో నటించింది. ఈ మూవీ ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. దానితో పాటుగా సిటడెల్ షూటింగ్ ను కూడా కంప్లీట్ చేసింది. కాగా.. గత కొంతకాలంగా సమంత తీవ్ర మానసిక వ్యాధికి లోనైనట్లుగా తెలుస్తోంది. అందుకే కొన్ని నెలలుగా పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ.. ఆధ్యాత్మిక సేవలో తరిస్తోంది.
ఇదికూడా చదవండి: ఈ గ్రూపు ఫొటోలో ఓ స్టార్ హీరోయిన్ ఉంది.. ఎవరో గుర్తుపట్టారా?