iDreamPost

ఈ గ్రూపు ఫొటోలో ఓ స్టార్‌ హీరోయిన్‌ ఉంది.. ఎవరో గుర్తుపట్టారా?

ఈ గ్రూపు ఫొటోలో ఓ స్టార్‌ హీరోయిన్‌ ఉంది.. ఎవరో గుర్తుపట్టారా?

పైన కనిపిస్తున్న గ్రూపు ఫొటోలో ఓ స్టార్‌ హీరోయిన్‌ కూడా ఉంది. చిత్ర పరిశ్రమలో అందంతో పాటు అభినయం కూడా ఉన్న అతి కొద్ది మంది హీరోయిన్స్‌లో ఆమె కూడా ఒకరు. ఓ లవ్‌ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆ మలయాళ ముద్దు గుమ్మ ఎంతో మంది కుర్రాళ్ల మనసు దోచుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ భామ 2016లో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు.

మొదటి సినిమానే ఓ స్టార్‌ డైరెక్టర్‌తో తీశారు. కేవలం నటిగానే కాదు.. ఓ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కూడా పని చేశారు. 2022లో శ్రీక్రిష్ణుడి కథాంశంతో వచ్చిన ఓ సినిమాతో ప్యాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయారు. ఆమె ఇంకెవరో కాదు.. ఫొటోను చూస్తేనే అర్థం అయిపోతుంది.. అనుపమ పరమేశ్వరన్‌ అని. స్కూళ్లో  చదివేటప్పుడు ఆమె తన తోటి విద్యార్థులతో కలిసి దిగిన ఆ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ముందు వరుసలో ఎంతో క్యూట్‌గా ఉన్న చిన్నప్పటి అనుపమను చూసి ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

కాగా, అనుపమ త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన ‘ అఆ’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటి వరకు తెలుగులో పదికి పైగా సినిమాలు చేశారు. ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో మూడు సినిమాలు చేస్తున్నారు. ఈ మూడు సినిమాలు షూటింగ్‌ జరుపుకుంటున్నాయి. వీటిలో డీజే టిల్లు సీక్వెల్‌.. టిల్లు స్క్వయర్‌ కూడా ఉంది. మరి, రింగుల జుట్టు చిన్నది అనుపమ పరమేశ్వరన్‌ చిన్ననాటి ఫొటోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి