Venkateswarlu
సలార్ నుంచి ఇప్పటికే ‘ సూరీడే’ అని పాట ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ పాటకు సోషల్‌మీడియాలో మంచి స్పందన లభించింది. విడుదలైన గంటల్లోనే లక్షల వ్యూస్ తెచ్చుకుంది.
సలార్ నుంచి ఇప్పటికే ‘ సూరీడే’ అని పాట ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ పాటకు సోషల్‌మీడియాలో మంచి స్పందన లభించింది. విడుదలైన గంటల్లోనే లక్షల వ్యూస్ తెచ్చుకుంది.
Venkateswarlu
సలార్ సినిమా విడుదలకు కేవలం కొన్ని గంటలు మాత్రమే ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కొన్ని చోట్ల 1 గంటకు స్పెషల్ షోలు పడనున్నాయి. అంటే తెల్లవారుజామున నాలుగు గంటల కల్లా మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేస్తుంది. సలార్ ఎలా ఉందని థియేటర్లకు వెళ్లి చెప్పాల్సిన పని లేదు. ట్రైలర్లతోనే మూవీ ఎలా ఉంటుందో దర్శకుడు ప్రశాంత్ నీల్ చెప్పకనే చెప్పాడు. ఫ్యాన్స్ మాత్రం సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. సలార్ రికార్డులు క్రియేట్ చేస్తుందని గట్టిగా నమ్ముతున్నారు.
సలార్ ఇప్పటికే చాలా రికార్డులు క్రియేట్ చేసింది. సలార్ మొదటి ట్రైలర్ యూట్యూబ్‌లో విడుదలైన 18 గంటల్లోనే 100 మిలియన్ల మార్కును అందుకుంది. కేజీఎఫ్ 2పై ఉన్న రికార్డులను తుడిచి పెట్టింది. ఇప్పటి వరకు దాదాపు 180 మిలియన్ల వ్యూస్ తెచ్చుకుంది. రెండు రోజుల క్రితం వచ్చిన సెకండ్ ట్రైలర్ కూడా రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు 120కి పైగా మిలియన్ల వ్యూస్ తెచ్చుకుంది. ప్రీ బుకింగ్స్ విషయంలోనూ సలార్ తన సత్తా చాటుతోంది.
ఇండియాతో పాటు ఓవర్‌సీస్‌లో కూడా కోట్ల రూపాయల ప్రీ బుకింగ్స్ బిజినెస్ జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే, ఫ్యాన్స్ ధాటికి ప్రీ బుకింగ్స్ జరిగే సైట్లు సైతం క్రాష్ అయ్యాయి. ఇలా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్న సలార్.. మరో రికార్డు క్రియేట్ చేయడానికి సిద్ధమైంది. విడుదలకు కొన్ని గంటల ముందుకు చిత్ర బృందం మరో పాటను విడుదల చేసింది. గురువారం మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో లిరికల్ పాట ‘‘ప్రతి కథలో..’’ యూట్యూబ్‌లో విడుదల అయింది. లక్షల వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ పాట హిందీలో ‘‘ కిషన్ మే’’గా.. కన్నడలో ‘‘ప్రతి కథెయా’’గా.. మలయాళంలో ‘‘ ప్రతికరమో’’గా.. తమిళంలో ‘‘ పాల కడయిల్’’గా విడుదల అయింది.
ప్రతీ గాధలో రాక్షసుడే.. హింసలు పెడతాడు..
అనచగనే పుడతాడు.. రాజే ఒకడు..
శత్రువునే కడతేర్చే.. పనిలో మనరాజు..
హింసలనే మరిగాడు.. మంచిని మరిచే..
ఆ నీచుడి అంతు చూశాడు..
పంతంతో పోరాడీ.. క్రోథంతో మారిపోయాడు..
తానే ఓ రక్కసుడై సాధించే గుణం ఉండాలి..
బలవంతుడైన ఎదురించాలి..
నీ ఓర్పు, నేర్పునిక చాటాలి..
గెలవాలంటే మన్నించాలి..
కోపం అది లోపం అవ్వదా..
యుద్దమైన చిరునవ్వుతోనే ఆపేసి చూపాలిరా..
నీ ఒప్పులలా.. మిగలాలిరా..
ఆ శిలపైనే ఓ రాతలా
నీ తప్పులలా చెరగాలిరా..
ఆ ఇసుకలపై మన గీతలా..
తలనే దించై.. జగడాలకే పోకురా..
పగనే తుంచై అది ఎప్పుడూ కీడురా..
నిజమను ధైర్యం అండరా.. కరుగును దేహం కండరా..
తెలివితో లోకం ఏలరా.. నిలబడరా..
మనదను స్వార్థం వీడరా.. మనిషికి మాటే నీడరా..
ఇచ్చిన మాటే తప్పితే గెలవవురా..
కోపం అది లోపం అవ్వదా..
యుద్దమైన చిరునవ్వుతోనే ఆపేసి చూపాలిరా..
నీ ఒప్పులలా.. మిగలాలిరా..
ఆ శిలపైనే ఓ రాతలా
నీ తప్పులలా చెరగాలిరా..
ఆ ఇసుకలపై మన గీతలా..