Swetha
తెలుగు దర్శకులు ఇతర భాష హీరోలకు ఎలాంటి హిట్స్ అందిస్తున్నారో తెలియనిది కాదు. రెండు నెలల క్రితం వచ్చిన కుభేరతో అది మరోసారి ప్రూవ్ అయింది. ఎంతైనా వాళ్ళు డైరెక్టర్స్ ను ఎంచుకునే తీరు బావుందంటూ సోషల్ మీడియాలో ఒకటే ప్రశంసల వర్షం కురిసింది. ఇదంతా సరే ఇప్పుడు మరోసారి ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే.. రీసెంట్ గా వార్ 2 సినిమా రిలీజ్ అయింది కాబట్టి
తెలుగు దర్శకులు ఇతర భాష హీరోలకు ఎలాంటి హిట్స్ అందిస్తున్నారో తెలియనిది కాదు. రెండు నెలల క్రితం వచ్చిన కుభేరతో అది మరోసారి ప్రూవ్ అయింది. ఎంతైనా వాళ్ళు డైరెక్టర్స్ ను ఎంచుకునే తీరు బావుందంటూ సోషల్ మీడియాలో ఒకటే ప్రశంసల వర్షం కురిసింది. ఇదంతా సరే ఇప్పుడు మరోసారి ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే.. రీసెంట్ గా వార్ 2 సినిమా రిలీజ్ అయింది కాబట్టి
Swetha
తెలుగు దర్శకులు ఇతర భాష హీరోలకు ఎలాంటి హిట్స్ అందిస్తున్నారో తెలియనిది కాదు. రెండు నెలల క్రితం వచ్చిన కుభేరతో అది మరోసారి ప్రూవ్ అయింది. ఎంతైనా వాళ్ళు డైరెక్టర్స్ ను ఎంచుకునే తీరు బావుందంటూ సోషల్ మీడియాలో ఒకటే ప్రశంసల వర్షం కురిసింది. ఇదంతా సరే ఇప్పుడు మరోసారి ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే.. రీసెంట్ గా వార్ 2 సినిమా రిలీజ్ అయింది కాబట్టి. ఇక్కడ ఇంత స్టార్డమ్ , ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంచుకుని కూడా.. ఇతర భాషలలో సినిమాలు అనగానే కనీసం ట్రాక్ రికార్డ్ కూడా చూడకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి.. తీరా రిలీజ్ తర్వాత తలలు పట్టుకుంటే ఏమి లాభం అని.. వార్ 2 చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో పెడుతున్న కామెంట్స్.
నిజమే ఎన్టీఆర్ మొదటి స్ట్రెయిట్ బాలీవుడ్ సినిమానే .. ఎన్టీఆర్ తన పాత్రకు ఎలాంటి న్యాయం చేసాడో అదంతా చేసాడు. అయినా సరే సినిమా మాత్రం ఊహించిన రేంజ్ లో పేలలేదు. దానికి కారణం విఎఫ్ఎక్స్ ఎడిటింగ్ అని ..కొన్ని లాజిక్స్ మిస్ అయ్యాయని.. ఇలా రకరకాల రీజన్స్ చెప్తున్నారు. గతంలో మగధీర లాంటి కల్ట్ క్లాసిక్ మూవీ తర్వాత.. రామ్ చరణ్ అపూర్వ లఖియాకి ఎస్ చెప్పి జంజీర్ లాంటి సినిమాను తీసాడు. ఈ సినిమాకు అప్పట్లో ఎలాంటి నెగిటివ్ టాక్ వచ్చిందో తెలియనిది కాదు. 2013 లో సోషల్ మీడియాకు ఇంత క్రేజ్ లేదు కాబట్టి పెద్దగా విషయాలు బయటకు రాలేదు కానీ.. ముంబై రిపోర్ట్స్ లో రామ్ చరణ్ ను ట్రోల్ చేసిన వారు లేకపోలేదు.
ఇక ఆ తర్వాత బాహుబలి సినిమాతో బాక్స్ ఆఫీస్ కుంభస్థలాన్నే బద్దలు కొట్టిన డార్లింగ్.. ఆదిపురుష్ తో బోల్తా పడ్డాడు. రామ్ చరణ్ చేసిన అదే తప్పు ప్రభాస్ కూడా చేసాడు. ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో తెలియనిది కాదు. ఇప్పటికి డార్లింగ్ అభిమానులకు అదొక పీడకల. కథ కథనం కాసేపు పక్కన పెడితే ఆ VFX, ఎడిటింగ్ కు ఒక్కొక్కరి మైండ్ బ్లాక్ అయింది. సరే అయిందేదో అయింది ఇకనుంచైనా మన హీరోలు జాగ్రత్తగా చూస్ చేసుకుంటే చాలని అనుకుంటే.. ఇప్పుడు తారక్ విషయంలో కూడా ఇదే రిపీట్ అయింది.
చాలా కాన్ఫిడెంట్ గా రెండు కాలర్స్ ఎగరేసి మరీ తారక్ సినిమా హిట్ అని చెప్పాడు. అటు ఆడియన్స్ కూడా అలానే అనుకున్నారు. కానీ ఎక్కడో సినిమాలో ఆ వెలితి కనిపించిందన్న మాట వాస్తవం. కలెక్షన్స్ రూపంలో కూడా అది కనిపిస్తూనే ఉంది. ఈ మూడు సినిమాలలో హీరోలు తమ పాత్రకు తమ వంతు న్యాయం చేసారు. కానీ ఆ దర్శకులు మాత్రం మన హీరోలను, ఆడియన్స్ కు సినిమా మీద ఉన్న ప్రేమను గ్రాంటెడ్ గా తీసుకున్నారని టాక్. సో ఇక నుంచైనా మన టాలీవుడ్ అగ్ర హీరోలు ఆ ట్రాప్ లో పడకుండా జాగ్రత్తగా ఉంటే చాలని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.