iDreamPost
android-app
ios-app

సమ్మె వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేది ఎవరు ?

  • Published Aug 14, 2025 | 10:57 AM Updated Updated Aug 14, 2025 | 10:57 AM

ఫెడరేషన్ కార్మికులతో , ఫిలిం ఛాంబర్ పెద్దలు ఈ వివాదాన్ని ఓ కొలిక్కి తీసుకుని వచ్చేందుకు ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కానీ అది కూడా సక్సెస్ అయినట్టు కనిపించడం లేదు. ఫెడరేషన్ కార్మికులు ఎక్కడా కూడా వెనక్కు తగ్గడం లేదు. ముఖ్యంగా స్లాట్స్ విధానంపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు

ఫెడరేషన్ కార్మికులతో , ఫిలిం ఛాంబర్ పెద్దలు ఈ వివాదాన్ని ఓ కొలిక్కి తీసుకుని వచ్చేందుకు ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కానీ అది కూడా సక్సెస్ అయినట్టు కనిపించడం లేదు. ఫెడరేషన్ కార్మికులు ఎక్కడా కూడా వెనక్కు తగ్గడం లేదు. ముఖ్యంగా స్లాట్స్ విధానంపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు

  • Published Aug 14, 2025 | 10:57 AMUpdated Aug 14, 2025 | 10:57 AM
సమ్మె  వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేది ఎవరు ?

ఫెడరేషన్ కార్మికులతో , ఫిలిం ఛాంబర్ పెద్దలు ఈ వివాదాన్ని ఓ కొలిక్కి తీసుకుని వచ్చేందుకు ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కానీ అది కూడా సక్సెస్ అయినట్టు కనిపించడం లేదు. ఫెడరేషన్ కార్మికులు ఎక్కడా కూడా వెనక్కు తగ్గడం లేదు. ముఖ్యంగా స్లాట్స్ విధానంపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఇరు వర్గాల మధ్యన రాజీ కుదర్చాలని చూస్తున్నారు కానీ అది సాధ్యపడడం లేదు. ఈ సమ్మె కారణంగా ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న షూటింగ్స్ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసిన తరుణంలో ఆయా సినిమాల షూటింగ్స్ గ్యాప్ లేకుండా జరగాలి. కానీ ఇప్పుడు అది సాధ్యపడే పనిలా కనిపించడం లేదు.

ఇలానే కనుక డిలే అవుతూ వెళ్తే.. చెప్పిన సమయానికి సినిమాలు రిలీజ్ అవ్వడం కష్టమే. అసలే పెద్ద పెద్ద సినిమాలు రేస్ లో ఉన్నాయి. పైగా అన్నీ బావున్నా కూడా ఈ మధ్య సినిమాలు చెప్పిన సమయానికి రావడం లేదు. ఇక ఇప్పుడు ఇన్ని వివాదాల మధ్యన అనుకునం సమయానికి రిలీజ్ అవుతాయా లేదా అనేది సందేహమే. ఇక తాజాగా జరిగిన డిస్కషన్స్ లో కార్మికులు అడిగిన వేతనాలను పెంచేందుకు నిర్మాతలు సిద్దంగానే ఉన్నారని.. కానీ వారికి కొన్ని షరతులు ఉన్నట్లు చెప్పుకొచ్చారు.

”2018, 2022లో జరిగిన అగ్రిమెంట్స్‌లో ఉన్న రెండు షరతులను వాళ్లు అమలు చేయడం లేదు. ముందు వాటిని ఒప్పుకోవాలి. వీటితో పాటు మరో రెండు షరతులు కూడా ఉన్నాయి. ఇదే విషయాన్ని ఛాంబర్‌ ద్వారా వాళ్ల దృష్టికి తీసుకొచ్చాం. వాటిపై చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటే, వేతనాలు పెంచడానికి నిర్మాతలు సిద్ధమే” అన్నారు. సో ఇలా వారి నిర్ణయాలను చెప్పినప్పటికీ సమ్మెను మాత్రం ఇంకా విరమించుకోలేదు కార్మికులు. ఇక ఈ వివాదానికి ఎవరు ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.