iDreamPost
android-app
ios-app

OTT లో సడన్ గా సూపర్ మ్యాన్ ఎంట్రీ.. ఎక్కడంటే ?

  • Published Aug 13, 2025 | 4:20 PM Updated Updated Aug 13, 2025 | 4:20 PM

ఇప్పుడు ఓటిటి సినిమాలంటే హర్రర్ థ్రిల్లర్స్ , ఇన్వెస్టిగేషన్ జోనర్స్ ఇవే ఎక్కువగా ఉంటున్నాయి. కానీ ఒకప్పుడు హాలీవుడ్ సూపర్ హీరో జానర్ లో బోలెడు సినిమాలు వచ్చేవి. ఇక సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ సినిమాలకి ఉండే ఫ్యాన్ బేస్ గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1984 నుంచి ఈ సూపర్ హీరోల సినిమాలు వస్తూనే ఉన్నాయి.

ఇప్పుడు ఓటిటి సినిమాలంటే హర్రర్ థ్రిల్లర్స్ , ఇన్వెస్టిగేషన్ జోనర్స్ ఇవే ఎక్కువగా ఉంటున్నాయి. కానీ ఒకప్పుడు హాలీవుడ్ సూపర్ హీరో జానర్ లో బోలెడు సినిమాలు వచ్చేవి. ఇక సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ సినిమాలకి ఉండే ఫ్యాన్ బేస్ గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1984 నుంచి ఈ సూపర్ హీరోల సినిమాలు వస్తూనే ఉన్నాయి.

  • Published Aug 13, 2025 | 4:20 PMUpdated Aug 13, 2025 | 4:20 PM
OTT లో సడన్ గా సూపర్ మ్యాన్ ఎంట్రీ.. ఎక్కడంటే ?

ఇప్పుడు ఓటిటి సినిమాలంటే హర్రర్ థ్రిల్లర్స్ , ఇన్వెస్టిగేషన్ జోనర్స్ ఇవే ఎక్కువగా ఉంటున్నాయి. కానీ ఒకప్పుడు హాలీవుడ్ సూపర్ హీరో జానర్ లో బోలెడు సినిమాలు వచ్చేవి. ఇక సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ సినిమాలకి ఉండే ఫ్యాన్ బేస్ గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1984 నుంచి ఈ సూపర్ హీరోల సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఈ ఫ్రాంచైజ్ లో వచ్చిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర విధ్వంసం సృష్టిస్తూనే ఉన్నాయి. ఇక రీసెంట్ గా థియేటర్ లో రిలీజ్ అయినా ఓ సూపర్ హీరో మూవీ.. నెల రోజులకే ఓటిటి లో ఎంట్రీ ఇవ్వనుంది.

డిసి యూనివర్స్ నుంచి జూలై 11న సూపర్ మ్యాన్ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా సూపర్ డూపర్ టాక్ తెచ్చుకోలేదు కానీ పరవాలేదని అనిపించుకుంది. ఇండియాలో కూడా ఈ సినిమా బాగానే ఆడింది. ఇక ఇప్పుడు ఈ సినిమా నెల రోజులు కూడా గడవకముందే ఓటిటి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపోతుంది. థియేటర్ లో మిస్ అయినా కానీ ఓటిటి లో మాత్రం ప్రేక్షకులు అసలు మిస్ కాకుండా చూస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాను ఆగష్టు 15 నుంచి ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీ, ఫాండంగో ఓటిటి లలో స్ట్రీమింగ్ కానుంది.

ఈ సినిమా స్టోరీ లైన్ విషయానికొస్తే.. జహ్రాన్‪‌పూర్‌పై బొరేవియా తన సైన్యంతో దాడి చేసినప్పుడు.. దానిని సూపర్ మ్యాన్ అడ్డుకుంటాడు. అయితే ఇక్కడ లెక్స్ లూథర్ అనే వ్యక్తి టెక్నాలజీతో కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో సూపర్ మ్యాన్ పైన అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు నెగిటివ్ గా చెబుతూ ఉంటాడు. వీడియోలు కూడా చూపించడంతో అందరికి అతనిమీద నమ్మకం పోతుంది. అప్పుడు సూపర్ మ్యాన్ ఏమి చేసాడు ? తర్వాత ఏమి జరిగింది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. కాబట్టి అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.