iDreamPost
android-app
ios-app

ఇంకా జోరు చూపిస్తున్న మహావతార్ నరసింహ

  • Published Aug 16, 2025 | 2:53 PM Updated Updated Aug 16, 2025 | 2:53 PM

కథలో కంటెంట్ దానిని ఏ బడా హీరో సినిమా అయినా పాన్ ఇండియా సినిమా అయినా బీట్ చేయలేదని.. మహావతార్ నరసింహ సినిమా నిరూపించింది. మొన్నటివరకు సినిమా అడ్డు అదుపు లేకుండా కలెక్షన్స్ కొల్లగొడుతూనే ఉంది. సరి కూలి , వార్ 2 రేస్ లోకి వచ్చిన తర్వాత మహావతార్ తగ్గిపోతుందిలే అనుకుంటే.

కథలో కంటెంట్ దానిని ఏ బడా హీరో సినిమా అయినా పాన్ ఇండియా సినిమా అయినా బీట్ చేయలేదని.. మహావతార్ నరసింహ సినిమా నిరూపించింది. మొన్నటివరకు సినిమా అడ్డు అదుపు లేకుండా కలెక్షన్స్ కొల్లగొడుతూనే ఉంది. సరి కూలి , వార్ 2 రేస్ లోకి వచ్చిన తర్వాత మహావతార్ తగ్గిపోతుందిలే అనుకుంటే.

  • Published Aug 16, 2025 | 2:53 PMUpdated Aug 16, 2025 | 2:53 PM
ఇంకా జోరు చూపిస్తున్న మహావతార్  నరసింహ

కథలో కంటెంట్ దానిని ఏ బడా హీరో సినిమా అయినా పాన్ ఇండియా సినిమా అయినా బీట్ చేయలేదని.. మహావతార్ నరసింహ సినిమా నిరూపించింది. మొన్నటివరకు సినిమా అడ్డు అదుపు లేకుండా కలెక్షన్స్ కొల్లగొడుతూనే ఉంది. సరి కూలి , వార్ 2 రేస్ లోకి వచ్చిన తర్వాత మహావతార్ తగ్గిపోతుందిలే అనుకుంటే. ఇక్కడ కూడా ఈ సినిమా ఆ రెండు సినిమాలను డామినేట్ చేసింది. కూలీ , వార్ 2 సినిమాలకు ఊహించినంత రేంజ్ లో టాక్ రాకపోవడంతో.. మరోసారి మహావతార్ కు రెస్పాన్స్ దక్కుతుంది.

బుక్ మై షో లో ఇప్పటికి 10 నుంచి 15 వేల వరకు టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. అంటే ఇంకా ఆడియన్స్ ఈ సినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని క్లియర్ గా అర్థమైపోతుంది. ఇప్పటివరకు రెండు వందల కోట్ల గ్రాస్ వరకు కలెక్షన్స్ అందుకుంది. ఇదే బజ్ కొనసాగితే ఇంకో 100 కోట్లు ఈజీగా రాబడుతుందని ట్రేడ్ వర్గాల అంచనా . ఈ సినిమా ఇంత హిట్ అవ్వడానికి రీజన్ లేకపోలేదు. ఎందుకంటే మన పురాణాలను సినిమాల రూపంలో ఇది వరకు చాలా మందే చూపించారు. కానీ ఉన్నది ఉన్నట్లుగా చూపించినవారు మాత్రం కొందరే. అందులో ఈ సినిమా ఒకటి.

యానిమేషన్ సినిమానే అయినా కానీ.. ప్రాణం ఉన్న మనుషులలానే ఒరిజినల్ గా చూపించిన తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. పూర్తి కథను కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకుని తెరపైన కనబరిచిన తీరుకు ప్రతి ఒక్కరు మైమరచిపోయారు. అందుకునేమో సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు అయినా కూడా.. ఏమాత్రం తడబడకుండా అదే హోల్డ్ ను కనబరుస్తుంది. ఇక ఇంకా ఈ మూవీ థియేటర్స్ ను రూల్ చేస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.