iDreamPost
android-app
ios-app

ఈసారి మల్లేశ్వరిని మించిన మ్యాజిక్ కనిపిస్తుందా !

  • Published Aug 16, 2025 | 10:09 AM Updated Updated Aug 16, 2025 | 10:09 AM

వెంకటేష్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఎలాంటి హిట్ అందుకున్నాయి తెలియనిది కాదు. చెప్పాలంటే త్రివిక్రమ్ కు పేరు తెచ్చిపెట్టింది వెంకీ మామ సినిమాలే. ఈ కాంబో ఇంకొక్క సినిమా పడితే చూద్దామని వింటేజ్ మూవీ లవర్స్ అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు.

వెంకటేష్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఎలాంటి హిట్ అందుకున్నాయి తెలియనిది కాదు. చెప్పాలంటే త్రివిక్రమ్ కు పేరు తెచ్చిపెట్టింది వెంకీ మామ సినిమాలే. ఈ కాంబో ఇంకొక్క సినిమా పడితే చూద్దామని వింటేజ్ మూవీ లవర్స్ అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు.

  • Published Aug 16, 2025 | 10:09 AMUpdated Aug 16, 2025 | 10:09 AM
ఈసారి మల్లేశ్వరిని మించిన మ్యాజిక్ కనిపిస్తుందా !

వెంకటేష్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఎలాంటి హిట్ అందుకున్నాయి తెలియనిది కాదు. చెప్పాలంటే త్రివిక్రమ్ కు పేరు తెచ్చిపెట్టింది వెంకీ మామ సినిమాలే. ఈ కాంబో ఇంకొక్క సినిమా పడితే చూద్దామని వింటేజ్ మూవీ లవర్స్ అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వారి ఆశ నెరవేరే రోజులు వచ్చేసాయి. హారిక హాసిని బ్యానర్ మీద త్రివిక్రమ్ దర్శకత్వంలో.. వెంకటేష్ హీరోగా ఓ సినిమా రూపుదిద్దుకోబోతుంది. తాజాగా ఆ సినిమాకు సంబందించిన పూజ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈసారి మల్లేశ్వరిని మించిన ఎంటెర్టైన్మెట్ పక్కా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

నిజానికి ఈ ప్రాజెక్ట్ ఎనిమిదేళ్ల క్రితమే ఫిక్స్ అయింది. అప్పట్లో అనౌన్సుమెంట్ కూడా ఇచ్చారు. కానీ అనుకోని కారణాల వలన సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. ఈలోగా ఎవరి కమిట్మెంట్స్ వాళ్ళు బిజీ బిజీ అయ్యారు. ఇప్పుడు ఇద్దరు ఫ్రీ అవ్వడంతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈమధ్యన త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్ కుమార స్వామి థీమ్ మీద ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అది సెట్స్ మీదకు వెళ్ళడానికి టైం పట్టేలా ఉంది కాబట్టి ఈలోపు ఈ సినిమాను కంప్లీట్ చేయడానికి రెడీ అయ్యారు. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమా రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

అంటే వచ్చే ఏడాది వెంకటేష్ నుంచి రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఒకటి త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరొకటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న మెగా 157. ఈ సినిమాలో వెంకీ గెస్ట్ రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇవి కాకుండా ఇంకా వెంకటేష్ మరే సినిమాలు ఒప్పుకోలేదు. చూస్తుంటే ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ కాంబినేషన్స్ రిపీట్ అవుతున్నట్టు ఉన్నాయి. ఇక ఈసారి వచ్చే వెంకీ , త్రివిక్రమ్ కాంబినేషన్ వింటేజ్ వైబ్ ను తీసుకొస్తుందో లేదో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.