iDreamPost
android-app
ios-app

డే1 అదరగొట్టింది.. కానీ అసలు టార్గెట్ ముందుంది.

  • Published Aug 16, 2025 | 11:13 AM Updated Updated Aug 16, 2025 | 11:13 AM

భారీ అంచనాల మధ్యన కూలీ సినిమా రిలీజ్ అయింది. మొదటినుంచి సినిమా మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉండడంతో మొదటి రోజు థియేటర్స్ కు వెళ్లిన ఆడియన్స్ సినిమా కంప్లీట్ గా శాటిస్ఫై చేయలేకపోయింది. దీనితో సోషల్ మీడియాలో రివ్యూలు యావరేజ్ గా రావడం ,మిక్సెడ్ టాక్ స్ప్రెడ్ అవ్వడం జరిగింది.

భారీ అంచనాల మధ్యన కూలీ సినిమా రిలీజ్ అయింది. మొదటినుంచి సినిమా మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉండడంతో మొదటి రోజు థియేటర్స్ కు వెళ్లిన ఆడియన్స్ సినిమా కంప్లీట్ గా శాటిస్ఫై చేయలేకపోయింది. దీనితో సోషల్ మీడియాలో రివ్యూలు యావరేజ్ గా రావడం ,మిక్సెడ్ టాక్ స్ప్రెడ్ అవ్వడం జరిగింది.

  • Published Aug 16, 2025 | 11:13 AMUpdated Aug 16, 2025 | 11:13 AM
డే1 అదరగొట్టింది.. కానీ అసలు టార్గెట్ ముందుంది.

భారీ అంచనాల మధ్యన కూలీ సినిమా రిలీజ్ అయింది. మొదటినుంచి సినిమా మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉండడంతో మొదటి రోజు థియేటర్స్ కు వెళ్లిన ఆడియన్స్ సినిమా కంప్లీట్ గా శాటిస్ఫై చేయలేకపోయింది. దీనితో సోషల్ మీడియాలో రివ్యూలు యావరేజ్ గా రావడం ,మిక్సెడ్ టాక్ స్ప్రెడ్ అవ్వడం జరిగింది. ఇదంతా ఇలా ఉంటె గ్రౌండ్ లెవెల్ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. టాక్ ఇలా ఉన్నా సరే టికెట్స్ అదే రేంజ్ లో తెగుతున్నాయి. వార్ 2 తో కంపేర్ చేస్తే కూలీకె ఎక్కువ మార్కులు పడుతున్నాయి. అంత హైప్ ఇచ్చిన కూలీ డివైడ్ టాక్ వచ్చినా సరే.. ప్రేక్షకులు ఒక్కసారైనా కూలీని చూడాలని అనుకుంటున్నారు.

దీని అంతటకీ కారణం రజిని కాంత్ , నాగార్జున లాంటి పవర్ ప్యాక్డ్ స్టార్స్ సినిమాలో ఉండడమే. ముఖ్యంగా నాగ్ క్యారెక్టర్ కు ఫుల్ పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. అటు రజిని కూడా వింటేజ్ లుక్ లో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడంతో.. వీరిద్దరికోసమైన థియేటర్స్ కు వెళ్లాలని అనుకునే వారు చాలా మంది ఉన్నారు. మొదటి రోజు ఓపెనింగ్ లో లియో పేరు మీద ఉన్న దాటేసింది కూలి. ఏకంగా 151 కోట్ల కలెక్షన్స్ ను అందుకుంది. తెలుగు వెర్షన్ లో 20 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు టాక్. మొదటి రోజు గడిచిన తర్వాత కూలీ టికెట్స్ బుకింగ్స్ ఇంకాస్త వేగంగా దూసుకుపోతున్నాయి.

వార్ 2 కూలీ రేస్ లో అయితే కూలీదే పై చేయి అని క్లియర్ గా తెలిసిపోతుంది. సరే ఇంకా రిలాక్స్ అవ్వోచ్చులే అనుకుంటే పొరపాటే. వీకెండ్ వరకు ఒకే జనాలని థియేటర్స్ కు పుల్ చేసే సత్తా కూలీలో ఉంది. కానీ ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది. వీక్ డేస్ లో కూడా ఇదే జోరును కొనసాగిస్తే తప్ప అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వదు. ఈ మధ్య కాలంలో ప్రతి కొత్త మూవీ లైఫ్ స్పాన్ వీకెండ్ వరకు మాత్రమే ఉంటుంది. మరి కూలీ అయినా దీనిని బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి. ఈ అప్డేట్ పై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.