Swetha
ప్రస్తుతం థియేటర్స్ లో వార్ 2, కూలీ సినిమాలు సందడి చేస్తున్నాయి. ఈ రెండిటికి ఎలాంటి టాక్ లభిస్తుందో గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము. అయితే ఈ రెండు సినిమాలతో పాటు ఇటు ఓటిటి లో కూడా చాలానే సినిమాలు ప్రేక్షకుల కోసం వెయిట్ చేస్తున్నాయి
ప్రస్తుతం థియేటర్స్ లో వార్ 2, కూలీ సినిమాలు సందడి చేస్తున్నాయి. ఈ రెండిటికి ఎలాంటి టాక్ లభిస్తుందో గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము. అయితే ఈ రెండు సినిమాలతో పాటు ఇటు ఓటిటి లో కూడా చాలానే సినిమాలు ప్రేక్షకుల కోసం వెయిట్ చేస్తున్నాయి
Swetha
ప్రస్తుతం థియేటర్స్ లో వార్ 2, కూలీ సినిమాలు సందడి చేస్తున్నాయి. ఈ రెండిటికి ఎలాంటి టాక్ లభిస్తుందో గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము. అయితే ఈ రెండు సినిమాలతో పాటు ఇటు ఓటిటి లో కూడా చాలానే సినిమాలు ప్రేక్షకుల కోసం వెయిట్ చేస్తున్నాయి. ఓటిటి లో వచ్చే సినిమాలలో ముఖ్యంగా హర్రర్ సినిమాలకు ఎలాంటి క్రేజ్ ఉందొ తెలియనిది కాదు. ఇప్పుడు అలాంటి ఓ సినిమా ఓటిటి ని షేక్ చేస్తుంది. మరి ఆ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో ఓ నలుగురు ఫ్రెండ్స్ కారులో అడవిలో వెళ్తుంటారు. దారిలో అనుకోకుండా వాళ్ళ కారు ఓ చెట్టును ఢీ కొడుతుంది. దీనితో వారు పక్కనే ఉన్న ఓ హౌస్ లోకి వెళ్తారు. అక్కడ వారికి కొన్ని బొమ్మలు కనిపిస్తాయి. కానీ వాటికి కళ్ళు , చెవి, ముక్కు , నోరు లాంటివి ఉండవు. వాటి ప్లేస్ లో మనుషుల అవయవాలు ఉంటాయి. దీనితో వారంతా వణికిపోతారు. ఆ హౌస్ లో ఎటు చూసినా ఆ బొమ్మలే కనిపిస్తాయి. అసలు ఆ బొమ్మలు ఏంటి ? వాటిని ఎవరు చేశారు ? అని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత ఏమైంది? ఆ జర్నీలో వారికి ఎలాంటి పరిస్థితిలు ఎదురయ్యాయి ? అసలు ఆ బొమ్మల వెనుక ఉన్న కథేంటి ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఈ సినిమా పేరు “ఏ క్లాసిక్ హారర్ స్టోరీ”. ప్రస్తుతం ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో కూడా మూవీ అందుబాటులో ఉంది. కాబట్టి ఈ వీకెండ్ ఓ బెస్ట్ హర్రర్ మూవీ చూడాలంటే మాత్రం ఈ సినిమా బెస్ట్ ఛాయస్ అని చెప్పొచ్చు. మరీ ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.