ఎన్టీఆర్ మొదటి సారి నేరుగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన మూవీ ఇది. అది కూడా బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. సో తారక్ అభిమానులలో సినిమా మీద అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రమోషన్స్ లో అనుకున్నంత సౌండ్ చేయలేదు కానీ.. ఒక్క ప్రమోషనల్ ఈవెంట్ పెట్టి అందరిని సైలెంట్ చేసేసింది వార్ 2. మరి వార్ 2 అనుకున్నంత రేంజ్ లో ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది రివ్యూలో చూసేద్దాం.
ఎన్టీఆర్ మొదటి సారి నేరుగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన మూవీ ఇది. అది కూడా బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. సో తారక్ అభిమానులలో సినిమా మీద అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రమోషన్స్ లో అనుకున్నంత సౌండ్ చేయలేదు కానీ.. ఒక్క ప్రమోషనల్ ఈవెంట్ పెట్టి అందరిని సైలెంట్ చేసేసింది వార్ 2. మరి వార్ 2 అనుకున్నంత రేంజ్ లో ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది రివ్యూలో చూసేద్దాం.
Swetha
ఇది అసలు స్ట్రెయిట్ బాలీవుడ్ మూవీ. అయినా సరే తెలుగులో దీనికి ఇంత హైప్ ఉందంటే.. దాని వెనుక ఒకే ఒక్క రీజన్ మ్యాన్ ఆఫ్ ది మాసెస్ జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ మొదటి సారి నేరుగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన మూవీ ఇది. అది కూడా బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. సో తారక్ అభిమానులలో సినిమా మీద అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రమోషన్స్ లో అనుకున్నంత సౌండ్ చేయలేదు కానీ.. ఒక్క ప్రమోషనల్ ఈవెంట్ పెట్టి అందరిని సైలెంట్ చేసేసింది వార్ 2. మరి వార్ 2 అనుకున్నంత రేంజ్ లో ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది రివ్యూలో చూసేద్దాం.
కథ :
కబీర్ ( హృతిక్ రోషన్) ఒక రా ఏజెంట్ గా పని చేసి ఆ తర్వాత ఓ కాంట్రాక్ట్ కిల్లర్ గా మారిపోతాడు. హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తులే అతని టార్గెట్. సరిగ్గా అదే సమయంలో ఐదు దేశాలకు చెందిన కొందరు వ్యాపారవేత్తలు.. ఇండియా అభివృద్ధిని అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారు దానికి కబీర్ అయితే సరైన వ్యక్తి అనుకుని ఆ బాధ్యతను అతనికి అప్పగిస్తారు. ఈ క్రమంలో కబీర్ తన గురువు అయిన RAW చీఫ్ లుత్రా (అశుతోష్ రాణా)ను హత్య చేసి పారిపోతాడు. ఈ విషయం అందరిని షాక్ కు గురి చేస్తుంది. వెంటనే RAW కొత్త ఏజెంట్ విక్రం చలపతి (జూనియర్ ఎన్టీఆర్)ను నియమిస్తారు. విక్రమ్ కబీర్ ను ఛేజ్ చేసే క్రమంలో వారిద్దరూ చిన్ననాటి స్నేహితులని తెలుస్తుంది. అసలు వీరిద్దరి ఫ్లాష్ బ్యాక్ ఏంటి ? కబీర్ ఎందుకు తన గురువును చంపాడు ? ఆ వ్యాపార వేత్తలు ఆ మిషన్ ను సక్సెస్ఫుల్ గా పూర్తి చేస్తారా ? దీని వెనుక ఉన్న కథ ఏంటి ? అనేది తెరపై చూడాల్సిన సినిమా
నటీనటుల, టెక్నీకల్ పని తీరు :
నటీనటుల విషయానికొస్తే.. జూనియర్ ఎన్టీఆర్ , తారక్ ఇద్దరు పోటాపోటీగా అదరగొట్టారు. ఎవరి పాత్రలకు తగినట్టు వారు న్యాయం చేశారు. టాలీవుడ్ లో తారక్ క్రేజ్ ను చూసే మూవీకి వెళ్తారు కాబట్టి.. వారికి మాత్రం పక్కా ఐ ఫీస్ట్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్ లో ఇద్దరు హోరాహోరీగా నటించిన తీరు అదిరిపోతోంది. ఇక టెక్నీకల్ టీం విషయానికొస్తే.. ఎప్పటిలానే బాలీవుడ్ మార్క్ సినిమాలో కనిపిస్తుంది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ కు సింక్ అయ్యేలా ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోతోంది. కొన్ని చోట్ల VFX షాట్స్ , ఎడిటింగ్స్ విషయంలో జాగ్రత్త తీసుకుంటే బావుండేది. సినిమాటోగ్రపీ మూవీకి మంచి లుక్ తీసుకునివచ్చింది.
విశ్లేషణ :
జూనియర్ ఎన్టీఆర్ స్ట్రెయిట్ గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా. సో తారక్ అభిమానులతో పాటు తెలుగు మూవీ లవర్స్ అంతా వార్ 2 మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు. వీరి అంచనాలను ఏ మాత్రం తగ్గకుండా తారక్ కూడా అదే రేంజ్ లో తన నట విశ్వరూపం చూపించాడు. చెప్పినట్టుగానే ఫ్యాన్స్ ను కాలర్ ఎగరేసుకునేలా చేశాడు. ఇద్దరి హీరోల ఎంట్రీ అదిరిపోతోంది. కానీ ఆ తర్వాత మాత్రం ఊహాగానాలు దెబ్బ తింటాయి. రెగ్యులర్ స్పై యాక్షన్ ఫార్మేట్ చూసిన ఫీల్ కలుగుతుంది. మొదటి హాఫ్ అంతా హృతిక్ క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళాడు దర్శకుడు. ఆ తర్వాత ఇంటర్వెల్ సీన్ మంచి హై ఫీల్ వస్తుంది. ఇక సెకండ్ ఆఫ్ లో అసలు ట్విస్ట్ లు బయటపడతాయి. ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ , ట్విస్ట్ లు మాత్రం బాగా వర్కౌట్ అయ్యాయి. కానీ హై వస్తుంది అనుకున్న సీన్స్ లో మాత్రం ప్రేక్షకులు కాస్త డిస్సపాయింట్ అవుతారు. ఇక క్లైమాక్స్ లో ఇద్దరు హీరోలు సృష్టించిన విధ్వంసం శాటిస్ఫ్యాక్షన్ ఇస్తుంది.
ప్లస్ లు :
తారక్ , హృతిక్ రోషన్
సినిమాటోగ్రఫి
బ్యాక్గ్రౌండ్ స్కోర్
మైనస్ లు:
VFX ఎడిటింగ్ (కొన్ని చోట్ల )
ఎమోషన్ వర్కట్ కాకపోవడం
రేటింగ్ : 2.75/5
చివరిగా : తారక్ , హృతిక్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ థ్రిల్లర్ విత్ డిఫరెంట్ మేకింగ్