iDreamPost
android-app
ios-app

సలార్ లోని ఖాన్సార్ పూర్తి కథని వివరిస్తూ వీడియో విడుదల!

Salaar Movie Tribes And Family Details: సలార్ సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన తెగలు, ఫ్యామిలీ ట్రీ వివరాలు ఇప్పుడు చూద్దాం.

Salaar Movie Tribes And Family Details: సలార్ సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన తెగలు, ఫ్యామిలీ ట్రీ వివరాలు ఇప్పుడు చూద్దాం.

సలార్ లోని ఖాన్సార్ పూర్తి కథని వివరిస్తూ వీడియో విడుదల!

సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులను ఈ మూవీ అలరిస్తోంది. ఇప్పటికే 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.402 కోట్ల వసూళ్లు రాబట్టింది. సలార్ పేరు చెప్తేనే ఫ్యాన్స్ పూలనకాలతో ఊగిపోతున్నారు. థియేటర్స్ కి రిపీటెడ్ ఆడియన్స్ కూడా బాగా వస్తున్నారు. ఒక్క ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా అందరూ ఈ సలార్ సీజ్ ఫైర్ సినిమాని థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ జరుగుతోంది. ప్రశాంత్ నీల్ సినిమా అంటే ప్రేక్షకుల నుంచి ఎన్నో రకాల రెస్పాన్సులు వస్తూ ఉంటాయి. అలాగే ఒక అభిమాని ఈ సలార్ సినిమాకి సంబంధించి కోర్ ప్లాట్ అయిన ఖాన్సార్ ఫ్యామిలీ ట్రీని వివరిస్తూ వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియో హోంబలే ఫిల్మ్స్ తమ అధికారిక యూట్యూబ్ ఛానల్ లో షేర్ చేసింది.

ఖాన్సార్ నగరం:

అతి కిరాతకమైన బంధిపోట్లు అయిన మన్నార్సీ తెగ, శౌర్యాంగ తెగ, ఘనియార్ తెగ. ఈ మూడు తెగలు కలిసి వారికంటూ సొంతంగా ఒక నగరాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. దాని పేరే ఖాన్సార్ నగరం. వీరికి పాలనకు అనుగుణంగా కొన్ని షరతులను పెట్టుకున్నారు. నియమాల పుస్తకాన్ని నిబంధన అంటారు. దాని ప్రకారమే ఖాన్సార్ లో పాలన జరుగుతుంది. దానివైపు చూడటం కాదు కదా.. దాని పేరు పలకడానికి కూడా ఎవరూ ధైర్యం చేయరు. ఈ ఖాన్సార్ నగరాన్ని పాలించే వ్యక్తిని కర్త అంటారు. అతనికి కింద 8 మంది దొరలు, 61 మంది కాపరులు ఉంటారు. 40 ఏళ్లకు ఒకసారి ఖాన్సార్ నగరంలో అధికారం ఒక తెగ నుంచి మరో తెగకు మారుతుంది.

ఫ్యామిలీ ట్రీ:

ఖాన్సార్ నగరాన్ని మొదట పాలించింది శివమన్నార్. ఈ కర్త మరణం తర్వాత ఖాన్సార్ పాలనాధికారం శౌర్యాంగ తెగకు వెళ్లాలి. కానీ, శివమన్నార్ కుమారుడు రాజమన్నార్(జగపతిబాబు) అలా జరగనివ్వలేదు. శౌర్యాంగ తెగ పెద్ద ధారాను చంపేశాడు. అంతేకాకుండా ఆ శౌర్యాంగ తెగలో ఎవరినీ వదలకుండా మట్టుబెట్టాడు. ఆ తర్వాత ఖాన్సార్ పాలన మన్నార్సీ, ఘనియార్ తెగలు మాత్రమే చేశాయి. రాజమన్నార్ కు ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్యకు రాధా రమా, రుద్ర రాజమన్నార్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండో భార్యకు కూడా వరద రాజమన్నార్, బాచీ రాజమన్నార్ అనే ఇద్దరు కొడుకులున్నారు. మొదటి భార్య పిల్లలు, మొదటి భార్య తమ్ముడికి సభలో దొరల హోదాని కల్పిస్తాడు కర్త. ఆ తర్వాత మిగిలిన ఐదుగురు దొరలు ఘనియార్ తెగకు చెందిన వారినే నియమిస్తారు. వారిలో నారంగ్, వాలి, రంగా, గురుంగ్, చీకా అనే ఐదుగురు దొరలుగా ఉన్నారు. వారిలో సీజ్ ఫైర్ భాగంలో నారంగ్, అతని కుమారుడు విష్ణు, రంగా చనిపోతారు. కర్త రాజమన్నారు రెండో భార్య కుమారుడు వరద కేవలం కాపరిగానే ఉంటాడు.

వీళ్లకు ఓటు హక్కు కూడా ఉంటుంది. కర్తకు 15 ఓట్లు, మొదటి భార్య తమ్ముడు ఓమ్ కి 4 ఓట్లు, మిగిలిన దొరలకు తలో 3 ఓట్లు ఉంటాయి. మిగిలిన కాపరులకు ఒకటి చొప్పున ఓటు ఉంటుంది. మొత్తం ఖాన్సార్ నగరంలో 101 ఓట్లు ఉంటాయి. కర్తలేని సమయంలో వరద ప్రాణాలా కాపాడటానికి రాధా రమ సీజ్ ఫైర్ ని ఆజ్ఞాపిస్తుంది. కానీ, రుద్ర రాజమన్నార్ నిబంధనలో ఉన్న క్లాజ్ తో సీజ్ ఫైర్ ఎత్తేయడానికి ఓటింగి కి వెళ్తాడు. ఆ సీజ్ ఫైర్ ఓటింగ్ కి వెళ్లే సమయంలో జరిగిందే సలార్ సినిమా కథ. అలాగే సీజ్ ఫైర్ ఎత్తేసిన రాత్రి జరిగిన ఘటనలు సలార్ రెండో పార్ట్ శౌర్యాంగ పర్వం మూవీకి టీజర్ లాంటిది. అదిరిపోయే ట్విస్ట్ తో సలార్ సినిమా సీజ్ ఫైర్ ని ముగించి.. శౌర్యాంగ పర్వంపై భారీ అంచనాలను రేకెత్తించారు. మరి.. సలార్ సినిమా మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.