iDreamPost
android-app
ios-app

సైంధవ్‌ ట్విట్టర్‌ రివ్యూ.. వెంకీ యాక్టింగ్‌ చింపేశాడు!

Saindhav Movie Twitter Review: సైంధవ్‌ సినిమా గురించి సోషల్‌ మీడియా వేదికల్లో చర్చ జరుగుతోంది. మూవీలో వెంకటేష్‌ వన్‌ మ్యాన్‌ ఆర్మీ షో చేశాడంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Saindhav Movie Twitter Review: సైంధవ్‌ సినిమా గురించి సోషల్‌ మీడియా వేదికల్లో చర్చ జరుగుతోంది. మూవీలో వెంకటేష్‌ వన్‌ మ్యాన్‌ ఆర్మీ షో చేశాడంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

సైంధవ్‌ ట్విట్టర్‌ రివ్యూ.. వెంకీ యాక్టింగ్‌ చింపేశాడు!

విక్టరీ వెంకటేష్‌-శైలేష్‌ కొలను కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సైంధవ్‌’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల అయింది. ఈ సినిమాకు ప్రేక్షకులనుంచి మంచి స్పందన వస్తోంది. మూవీ చూసిన కొంతమంది నెటిజన్లు తమ అనుభవాలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటూ ఉన్నారు. వెంకీ మామ యాక్టింగ్‌పై ప్రత్యేక ప్రశంసలు కురిపిస్తున్నారు.

‘‘ ఫస్ట్‌ హాఫ్‌ డీసెంట్‌గా ఉంది. మొదటి 30 నిమిషాలు స్లోగా నడుస్తుంది. తర్వాత మెల్లగా స్టోరీ నరేషన్‌లోకి వెళ్లిపోతుంది. యాక్షన్‌ సీక్వెన్సెస్‌, అందరి నటనలు బాగున్నాయి. బీజీఎమ్‌ ఇంకాస్త బాగా ఉండాల్సింది’’.. ‘‘ సైంధవ్‌ అశ్లీలతకు తావు లేకుండా బాగా అనిపించింది. సినిమా క్లైమాక్స్‌లో నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, వెంకీ మామల యాక్టింగ్‌ అద్భుతంగా ఉంది. థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ కోసం ఓ సారి చూడొచ్చు. ఇంతకంటే ఎక్కువ ఎక్స్‌పెక్ట్‌ చేయోచ్చు. కానీ, ఎక్కడా బోరు కొట్టలేదు’’..

‘‘ ఇప్పుడే షో చూసి వచ్చాను. యాక్షన్‌ సీక్వెన్స్‌లు చాలా బాగున్నాయి. ఎమోషన్స్‌తో నడిచే స్టోరీ బాగా వర్కవుట్‌ అయింది. పాటలు, బీజీఎమ్‌ ఏ మాత్రం బాగా లేవు. కొన్ని సన్ని వేశాల్లో వెంకీ యాక్టింగ్‌ బాగుంది. మిగితాదంతా యావరేజ్‌’’.. ‘‘ సైంధవ్‌ సినిమా బాగుంది. ఈ సంక్రాంతికి విశ్వరూపం చూపించాడు. అవర్‌ సైకో బ్యాక్‌ విత్‌ బ్యాంగ్‌.. సినిమా టీంకు శుభాకాంక్షలు’’.. మొత్తానికి వెంకీ మామ మంచి టాక్‌ను తెచ్చుకుంది. ఈ సంక్రాంతి రేసులో తన స్థానాన్ని నిలబెట్టుకుంది.

కాగా, ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చిత్రంలోని ఓ సీన్‌పై సోషల్‌ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. హీరో వెంకటేష్‌ ఓ విలన్‌ నోట్లో తుపాకి పెట్టి కాలుస్తాడు. బుల్లెట్‌ అతడి బ్యాక్‌ నుంచి వస్తుంది. దీనిపై నెటిజన్లు కామెడీ చేయటం మొదలుపెట్టారు. దీంతో దర్శకుడు శైలేష్‌ స్పందించాడు… ‘‘ ఓ వ్యక్తిని మీరు ఓ ప్రత్యేక పొజిషన్‌లో కూర్చోబెట్టి.. అతడి నోట్లోకి బ్యారెల్‌ గన్‌ను జొప్పించి.. గన్‌ను 80 డిగ్రీలు కిందకు పెట్టి కాలిస్తే..

బుల్లెట్‌ కడుపులోంచి ఆ విధంగా బయటకు వస్తుంది. మీరు పెట్టిన వీడియోలో ప్రకారం చెప్పాలంటే.. అలా కాలిస్తే.. కడుపును చీలుస్తుంది. అలా కూడా పేగుల్లోంచి దూరి బ్యాక్‌ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా మీరు కాల్చాలంటే.. దానికి చాలా ప్రాక్టీస్‌.. అనుభవం కావాలి’’ అని అన్నారు. మరి, సైంధవ్‌ మ్వూవీ ట్విటర్‌ రివ్యూపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి