iDreamPost
android-app
ios-app

సలార్ ఫ్యాన్స్‌కు చేదు వార్త.. ఆలస్యంగా రానున్న ప్రభాస్!

కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అంటూ సరిపెట్టేసుకుంటున్నారు అభిమానులు సలార్ విషయంలో. సినిమా విడుదల దగ్గరపడుతున్నకొద్దీ టెన్షన్ నెలకొంది. దేవా (ప్రభాస్) బయటకు రావడం లేదు. సరిగ్గా రిలీజ్ డేట్ 10 రోజులు కూడా లేదు. ప్రమోషన్లు లేవు. ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి న్యూసే లేదు. ఇలాంటి సమయంలో మరో షాకింగ్ న్యూస్.

కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అంటూ సరిపెట్టేసుకుంటున్నారు అభిమానులు సలార్ విషయంలో. సినిమా విడుదల దగ్గరపడుతున్నకొద్దీ టెన్షన్ నెలకొంది. దేవా (ప్రభాస్) బయటకు రావడం లేదు. సరిగ్గా రిలీజ్ డేట్ 10 రోజులు కూడా లేదు. ప్రమోషన్లు లేవు. ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి న్యూసే లేదు. ఇలాంటి సమయంలో మరో షాకింగ్ న్యూస్.

సలార్ ఫ్యాన్స్‌కు చేదు వార్త.. ఆలస్యంగా రానున్న ప్రభాస్!

సలార్ మూవీ రోజు రోజుకూ హీట్ పెంచుతోంది. డిసెంబర్ 22నే రిలీజ్ పెట్టుకుని ఎలాంటి ప్రమోషన్స్ షురూ చేయడం లేదు చిత్ర యూనిట్. ఏంటో ఆ కాన్ఫిడెన్స్ అర్థం కావట్లేదు. ప్రభాస్ మేనియా, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ క్రేజే థియేటర్ల దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది.. అందులో సందేహం లేదు. కానీ ఎందుకో ప్రభాస్ సహా అందరూ సైలెంట్‌గా ఉన్నారు. టీజర్, ట్రైలర్లతో అలజడి సృష్టించినా.. సింగిల్స్ అంటూ హంగామా చేసినా.. ప్రభాస్ లాంటి కటౌట్ అభిమానుల ముందుకు రావడం లేదు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి సమాచారం లేదు. అసలు జరుపుతారో లేదో కూడా డౌటే. రెండు రోజుల్లో మరో ట్రైలర్ రాబోతుంది. ఈ సమయంలో షాకింగ్ న్యూస్ ఒకటి హల్ చల్ చేస్తోంది.

సలార్ రెండు భాగాల్లో తెరకెక్కిస్తున్నాడు కెప్టెన్ ప్రశాంత్ నీల్. అయితే ఇటీవల విడుదల చేసిన టీజర్ అరుపు పుట్టించింది కానీ.. కాస్త పరీక్ష పెట్టించింది. కారణం.. ట్రైలర్ సగం నుండి కటౌట్ కనబడటం. అతడి రాక కోసం కోట్లాది మంది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న వేళ.. మిడిల్ ఆర్డర్ బ్యాట్ మాన్‌లా మెరిశాడు డార్లింగ్ ప్రభాస్. అయితే ఇప్పుడు డై హార్ట్ ఫ్యాన్స్ గుండెలు బద్దలు కొట్టే న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతోంది. అదే ట్రైలర్ మాదిరి.. మూవీలో కూడా కాస్త లేటుగానే దర్శనమివ్వబోతున్నాడట ఈ డైనోసార్. సుమారు అరగంట తర్వాత కనిపించబోతున్నాడట టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, బాక్సాఫీస్ రారాజు ప్రభాస్.

వెండితెరపై అతడి రాక కోసం 30 నిమిషాలు ఓపిక పట్టాల్సిందే. సలార్ ది సీజ్ ఫైర్ మొత్తం 2 గంటల 55 నిమిషాలు ఉండనుంది. ఫస్టాఫ్ గంట 15 నిమిషాలు, మలి సగం గంట 40 నిమిషాలు సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. సినిమాలో ప్రభాస్ ఎంట్రీ ఆలస్యంగా ఉండబోతుందని ట్రైలర్‌తో చెప్పకనే చెప్పాడు దర్శకుడు. ఈ మూవీపై అభిమానులను ఎన్నో అంచనాలు పెట్టుకుని ఉన్నారు. ఈ సమయంలో ఇలాంటి న్యూస్ ఫ్యాన్స్‌కు మింగుడు పడక పోవచ్చు. ఇక ఈ మూవీలో శృతి హాసన్, పృధ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, బాబీ సింహ, శ్రియా రెడ్డి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. మరీ డార్లింగ్ ఆలస్యంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి