iDreamPost
android-app
ios-app

అదిరిపోయే టీజర్ తో వచ్చేసిన రవి తేజ మిస్టర్ బచ్చన్ మూవీ..

  • Published Jul 28, 2024 | 6:22 PMUpdated Jul 28, 2024 | 6:22 PM

Mr Mr.Bachchan Teaser : మాస్ మహారాజ రవి తేజ మూవీస్ కు అప్పటికి ఇప్పటికి అదే ఫ్యాన్ బేస్ కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలో ప్రస్తుతం రవి తేజ నటిస్తున్న నటిస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను రివీల్ చేశారు మేకర్స్. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Mr Mr.Bachchan Teaser : మాస్ మహారాజ రవి తేజ మూవీస్ కు అప్పటికి ఇప్పటికి అదే ఫ్యాన్ బేస్ కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలో ప్రస్తుతం రవి తేజ నటిస్తున్న నటిస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను రివీల్ చేశారు మేకర్స్. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Jul 28, 2024 | 6:22 PMUpdated Jul 28, 2024 | 6:22 PM
అదిరిపోయే టీజర్ తో వచ్చేసిన రవి తేజ మిస్టర్ బచ్చన్ మూవీ..

ఇప్పుడు ఇండస్ట్రీ లో ఉన్న యంగ్ హీరోస్ కు కూడా.. రవి తేజ టఫ్ కాంపిటేషన్ ఇస్తున్నాడని చెప్పి తీరాలి. మాస్ మహారాజ రవి తేజ మూవీస్ కు అప్పటికి ఇప్పటికి అదే ఫ్యాన్ బేస్ కొనసాగుతూ ఉంది. ఇక మొదటి నుంచి కూడా రవి తేజ వినూత్నమైన మాస్ క్యారెక్టర్స్ నే ఎంచుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా రవి తేజ నటిస్తున్న మూవీ మిస్టర్ బచ్చన్. ఆల్రెడీ ఈ సినిమా అనౌన్స్స్ చేసిన దగ్గర నుంచి కూడా డీసెంట్ హైప్ క్రియేట్ చేస్తుంది. ఆల్రెడీ వచ్చిన అప్ డేట్స్ మూవీ పై కాస్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగా.. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను కూడా రివీల్ చేశారు మేకర్స్. దానికి సంబంధించని విషయాలు చూసేద్దాం.

మిస్టర్ బచ్చన్ .. నామ్ తో సునా హోగా అనే ట్యాగ్ తో.. ఆగష్టు 15 న మాస్ మహా రాజా మూవీ థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమాకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. ఇప్పటికే ఈ మూవీ సరికొత్త కాన్సెప్ట్ తో ఉందంటూ.. ఆల్రెడీ టాక్ వినిపిస్తూనే ఉంది. ఇక ఇప్పుడు తాజాగా రిలీజ్ చేసిన టీజర్ నెక్ట్ లెవెల్ లో ఉంది. టీజర్ ను గమనిస్తే.. ఓపెనింగ్ లోనే మంచి ఓల్డ్ మెలోడీ సాంగ్స్ తో కొన్ని సీన్స్ చూపించి అందరికి పాత మెమరీస్ ను గుర్తు చేశారు. అలాగే ఆ తర్వాత కామెడీ సీన్స్ , యాక్షన్ సిక్వెన్సెస్ , రవి తేజ మాస్ డైలాగ్స్ అన్ని సమపాళ్లలో చూపించి.. మూవీ మీద టోటల్ హైప్ క్రియేట్ చేసినట్టు ఉంది. ఇక రవి తేజ, జగపతి బాబు మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పి తీరాలి. దీనిని బట్టే చెప్పేయొచ్చు. ఈ మూవీ కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేస్తుందని.

Mr Bachan Teaser

ఇక ఈ సినిమా విషయానికొస్తే.. రవి తేజ ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ అభిమానిగా కనిపించనున్నారు. రవి తేజకు జోడిగా ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. అయితే ఆల్రెడీ హరీష్ శంకర్ , రవి తేజ కాంబినేషన్ లో మంచి సక్సెస్ సినిమాలే వచ్చాయి. దీనితో ఈ సినిమాపై కూడా అందరికి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పుడు విడుదల చేసిన టీజర్ తో ఈ సినిమాపై మరింత ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారు ప్రేక్షకులు. ఇంకా సినిమాకు కొద్దీ రోజులు మాత్రమే సమయం ఉండడంతో.. త్వరలోనే మూవీ టీం ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయనున్నారు. ఇక విడుదల తర్వాత మూవీ ఎలాంటి టాక్ ను సంపాదించుకుంటుందో వేచి చూడాలి. మరి ఈ మూవీ అప్ డేట్ పై మీ అభిప్రయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి