Krishna Kowshik
పుష్ప మూవీతో నేషనల్ క్రష్ ట్యాగ్ తెచ్చుకున్న రష్మికకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పకనే చెప్పేసింది. ఓ నెటిజన్..తన అభిప్రాయాన్ని చెప్పగా.. నిజమని వెల్లడించింది. ఇంతకు ఆమెకు ఎలాంటి భర్త కావాలంటే..?
పుష్ప మూవీతో నేషనల్ క్రష్ ట్యాగ్ తెచ్చుకున్న రష్మికకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పకనే చెప్పేసింది. ఓ నెటిజన్..తన అభిప్రాయాన్ని చెప్పగా.. నిజమని వెల్లడించింది. ఇంతకు ఆమెకు ఎలాంటి భర్త కావాలంటే..?
Krishna Kowshik
పుష్పతో దేశ వ్యాప్తంగా నేషనల్ క్రష్‌గా మారిన రష్మిక మందన్న.. గత ఏడాది విడుదలైన యానిమల్ మూవీ హిట్‌తో ఫుల్ జోష్‌లో ఉంది. కర్ణాటకలో పుట్టిన ఈ బ్యూటీ.. చందన సీమలో అడుగుపెట్టి.. అటు నుండి టాలీవుడ్, కోలీవుడ్లోకి పాకి.. మంచి క్రేజ్ తెచ్చుకుంది. అల్లు అర్జున్-సుకుమార్ మూవీ పుష్ప ద రైజ్‌తో ఆమె కెరీర్ ఒక్కసారిగా రైజ్ అయ్యింది. ఏకంగా బాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. తొలి సినిమానే.. బాలీవుడ్ సీనియర్ హీరో అమితాబ్ బచ్చన్‌తో తెర పంచుకునే అవకాశం కొట్టేసింది. ఆ తర్వాత మిషన్ మజ్ను, యానిమల్ చిత్రాలు చేసింది. సందీప్ వంగా- రణబీర్ కపూర్ కాంబోలో వచ్చిన యానిమల్.. కలెక్షన్ల మోత మోగించిన సంగతి విదితమే.
ఈ చిత్రంలో రష్మిక.. కాస్త బోల్డ్ అండ్ బ్యూటీగా కనిపించి.. అభిమానులకు కనువిందు చేసింది. గీతాంజలి క్యారెక్టర్లో ఆమె మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం చేతి నిండా సినిమా అవకాశాలతో, షూటింగ్స్‌తో బిజీ బిజీ అయిపోయింది ఈ పొన్ను . అయితే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంది. తాజాగా ఇండియా ఫోర్బ్ అండ్ 30 కేటగిరిలో చోటు కూడా సంపాదించింది. దీంతో వరుసగా ఆమెకు కంగ్రాట్యులేషన్స్ అంటూ విషెస్ కూడా తెలిపారు. విష్ చేసిన అభిమానులకు ఓపిగ్గా.. థాంక్యూ కూడా చెప్పింది. అలాగే వరుసగా అభిమానులు ప్రశ్నలకు రిప్లై ఇస్తూనే ఉంది ఈ నేషనల్ క్రష్. ‘మిర్రర్ సెల్ఫీ తీసుకన్నావ్ అదే గ్యాప్‌లో నాకు ఒక రిప్లై ఇవ్వొచ్చుగా’ అంటూ ఓ నెటిజన్ రష్మికను అడగ్గా.. ‘గ్యాప్‌లో అంట.. వర్క్ గ్యాప్‌లో ఏ సెల్ఫీ తీసుకున్నాన్ రా.. సెల్ఫీ తీసుకునేడప్పుడు గ్యాప్ లేకుండే’ అంటూ కొంటే సమాధానం ఇచ్చింది.
అయితే రష్మిక ఢిల్లీ ఫ్యాన్స్ అనే యూజర్.. ‘రష్మికమందన్న భర్తగా రావాలంటే.. ఎలాంటి లక్షణాలు ఉండాలి? ఆమె నేషనల్ క్రష్ కాబట్టి.. ఆమె భర్త ప్రత్యేకంగా ఉండాలి. ఆమె భర్త VD(విజయ్ దేవరకొండలా కాదులెండి)లా ఉండాలి. VD అంటే వెరీ డేరింగ్.. ఆమెను రక్షించగలిగేలా ఉండాలి. మేము ఆమెను రాణిలా చూస్తాం కాబట్టి.. ఆమె భర్త కూడా రాజులా ఉండాలి’ అంటూ ఓ పోస్టు చేశారు. దీనికి రష్మిక.. దట్స్ వెరీ ట్రూ అంటూ స్మైల్ అంటూ హార్ట్ సింబల్ రిప్లై ఇచ్చింది. దీన్ని బట్టి చూస్తే.. తన కాబోయే భర్త ఎలా ఉండాలో.. చెప్పకనే చెప్పేసింది ఈ క్రష్. కాగా, ఎప్పటి నుండో రష్మిక, విజయ్ దేవరకొండ రిలేషన్లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు ఇద్దరు. ప్రస్తుతం రష్మిక పుష్ప-2, రెయిన్ బో, ద గర్ల్ ఫ్రెండ్, చావా వంటి చిత్రాల్లో నటిస్తోంది.
What qualities should one have to become #RashmikaMandanna‘s husband?
She is National Crush of India
Her husband must be special.Her husband should be like VD.
I mean Very Daring 💪 Who can protect her.
We call her a queen 👸 then her husband should also be like a king 👑 pic.twitter.com/UwC4lyHBr4— Rashmika Delhi Fans (@Rashmikadelhifc) February 26, 2024