iDreamPost
android-app
ios-app

Ram Charan: అఫీషియల్: క్రికెట్ టీమ్ కొనుగోలు చేసిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్!

  • Published Dec 24, 2023 | 12:26 PM Updated Updated Dec 24, 2023 | 12:26 PM

టాలీవుడ్ స్టార్ హీరో, గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ ఓ కొత్త క్రికెట్ టీమ్ ను కొనుగోలు చేశారు. మరి ఆ క్రికెట్ టీమ్ ఏది? ఆ కొత్త క్రికెట్ లీగ్ ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ స్టార్ హీరో, గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ ఓ కొత్త క్రికెట్ టీమ్ ను కొనుగోలు చేశారు. మరి ఆ క్రికెట్ టీమ్ ఏది? ఆ కొత్త క్రికెట్ లీగ్ ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Ram Charan: అఫీషియల్: క్రికెట్ టీమ్ కొనుగోలు చేసిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్!

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఎప్పుడైతే ప్రారంభం అయ్యిందో.. అప్పటి నుంచి క్రికెట్ రూపురేఖలే మారిపోయాయి. పుట్టగొడుల్లా ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్ లు పుట్టుకొచ్చాయి. ఇప్పటికే కరేబియన్ లీగ్, బిగ్ బాష్ లీగ్, పాకిస్థాన్ లీగ్ లాంటి ఎన్నో టోర్నీలు క్రికెట్ లవర్స్ ను అలరిస్తూ.. ముందుకు సాగుతున్నాయి. తాజాగా మరో కొత్త క్రికెట్ లీగ్ ప్రేక్షకులను అలరించడానికి వస్తోంది. అంతే కాదండోయ్ ఈ లీగ్ లో ఓ టీమ్ ను కొనుగోలు చేశాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఈ విషయాన్ని చరణే స్వయంగా సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. మరి ఇంతకీ ఆ కొత్త క్రికెట్ లీగ్ ఏది? అందులో రామ్ చరణ్ కొన్న ఫ్రాంచైజీ ఏది? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ స్టార్ హీరో, గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచారు. అందుకు కారణం ఏ సినిమా న్యూసో కాదు. అసలు విషయం ఏంటంటే? రామ్ చరణ్ ఓ కొత్త క్రికెట్ టీమ్ ను కొనుగోలు చేశారు. ఈ వార్త వినగానే మళ్లీ ఐపీఎల్ లోకి ఇంకో కొత్త టీమ్ వస్తుంది అనుకున్నారో మీరు తప్పులో కాలేసినట్లే. రామ్ చరణ్ కొన్నది ఐపీఎల్ క్రికెట్ టీమ్ కాదు.. ISPLt10లో క్రికెట్ టీమ్. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ టీ10 2023 పేరిట మరో కొత్త క్రికెట్ లీగ్ ప్రారంభం కాబోతోంది. ఇక ఈ లీగ్ లో హైదరాబాద్ టీమ్ ను కొనుగోలు చేశారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ విషయాన్ని స్వయంగా చరణే వెల్లడించారు.

ట్విట్టర్ వేదికగా రామ్ చరణ్ ఇలా రాసుకొచ్చారు.”ఈ విషయాన్ని మీతో పంచుకోవడం ఎంతో ఆసక్తిగా, సంతోషంగా ఉంది. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ లో నేను టీమ్ హైదరాబాద్ కు ఓనర్ గా ఉన్నందుకు గర్వపడుతున్నాను. గల్లీ క్రికెట్ కు వైభవం తీసుకొచ్చేందుకు, సమాజంలో స్ఫూర్తిని పెంపొందించడం కోసం ఈ ఐఎస్పీఎల్ తోడ్పడుతుంది. ఇక ఈ లీగ్ లో హైదరాబాద్ కీర్తిని పెంచేందుకు మీరు నాతో చేతులు కలపండి” అంటూ రామ్ చరణ్ పేర్కొన్నారు. అయితే ఈ నయా టీ10 క్రికెట్ లీగ్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇది ఎప్పుడు ప్రారంభం అవుతుంది తదితర విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొత్త క్రికెట్ టీమ్ కొనడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.