iDreamPost
android-app
ios-app

పుష్ప 2లో కేశవ మారబోతున్నాడా? తెరపైకి కొత్త చర్చ?

  • Published Dec 07, 2023 | 1:09 PM Updated Updated Dec 07, 2023 | 1:09 PM

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబోలో వచ్చిన పుష్ప సినిమాలో అత్యంత కీలకమైన కేశవ పాత్రలో నటించిన నటుడు జగదీష్‌ యువతి ఆత్మహత్య కేసులో అరెస్ట్‌ అయ్యాడు. దాంతో ఇప్పుడు రూపొందుతున్న పుష్ప 2 లో ఆయన ఉంటాడా అనే చర్చ జరుగుతోంది. 

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబోలో వచ్చిన పుష్ప సినిమాలో అత్యంత కీలకమైన కేశవ పాత్రలో నటించిన నటుడు జగదీష్‌ యువతి ఆత్మహత్య కేసులో అరెస్ట్‌ అయ్యాడు. దాంతో ఇప్పుడు రూపొందుతున్న పుష్ప 2 లో ఆయన ఉంటాడా అనే చర్చ జరుగుతోంది. 

  • Published Dec 07, 2023 | 1:09 PMUpdated Dec 07, 2023 | 1:09 PM
పుష్ప 2లో కేశవ మారబోతున్నాడా? తెరపైకి కొత్త చర్చ?

అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌డం ని దక్కించుకున్న విషయం తెల్సిందే. పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌, రష్మిక మందన్న తర్వాత ఎక్కువగా కనిపించే పాత్ర కేశవ అనే విషయం తెల్సిందే. కేశవ పాత్రలో జగదీష్ నటించాడు. పుష్ప సినిమాతో జగదీష్ పేరు మారుమ్రోగింది. అంతకు ముందే ఇండస్ట్రీకి పరిచయం అయిన జగదీష్ కి కేశవ పాత్ర ఏ స్థాయిలో ఇమేజ్ ని తెచ్చి పెట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుష్ప లో కీలక పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్న కారణంగా ఏకంగా చిన్న సినిమాల్లో లీడ్ రోల్స్ చేసే అవకాశాన్ని కూడా జగదీష్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం రూపొందుతున్న పుష్ప 2 లో కూడా జగదీష్ పాత్ర అత్యంత కీలకంగా ఉంటుందని, ప్రేక్షకులకు కేశవ పాత్ర కనెక్ట్‌ అవ్వడంతో కథ లో బిగ్‌ ట్విస్ట్‌ కేశవ పాత్రతో ఉండేలా దర్శకుడు సుకుమార్‌ ప్లాన్‌ చేశాడని కూడా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో జగదీష్ ఒక కేసులో అరెస్ట్‌ అవ్వడం చర్చనీయాంశంగా మారింది.

పుష్ప మూవీ తర్వాత కేశవ పాత్రలో నటించిన జగదీష్ కి వరుస ఛాన్సులు వస్తున్నాయి. ప్రస్తుతం జగదీష్.. పుష్ప 2 మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఒక యువతి ఆత్మహత్య కేసులో జగదీష్‌ ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించారు. ఓ జూనియర్ ఆర్టిస్ట్ వేరే వ్యక్తితో ఉన్నప్పడు ప్రైవేట్ ఫోటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని జగదీష్ బెదిరించడంతో వేధింపులు తాళలేక మనస్థాపానికి గురై గత నెల 29న యువతి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన నేపథ్యంలో దీనంతటికి కారణం పుష్ప నటుడు జగదీష్ అని నిర్ధారించారు. గత కొన్నిరోజులుగా తప్పించుకొని తిరుగుతున్న జగదీష్ పై ఐపీసీ 354(సి), 306 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. బుధవారం కోర్టులో హాజరు పరిచారు. గతంలో జగదీష్ కి మృతురాలికి సినీ రంగంలో పరిచయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు విచారణ జరగాల్సి ఉంది. ఇంత పెద్ద కేసులో నిందితుడిగా ఉండి, కచ్చితంగా ముందు ముందు శిక్ష పడబోతున్న జగదీష్ ను పుష్ప 2 లో కొనసాగించడం సాధ్యమేనా అన్నట్లుగా ప్రస్తుతం చర్చ జరుగుతోంది.

పుష్ప 2 సినిమా షూటింగ్‌ ఇప్పటికే సగానికి పైగా పూర్తి అయింది. ఆ మధ్య అల్లు అర్జున్, జగదీప్‌ కాంబో సన్నివేశాల చిత్రీకరణ కూడా జరిగింది. రాబోయే రోజుల్లో మరిన్ని సన్నివేశాల్లో జగదీష్ పాల్గొనాల్సి ఉంది. ఇలాంటి సమయంలో జగదీష్ అరెస్ట్‌ అవ్వడంతో మైత్రి మూవీ మేకర్స్ , సుకుమార్‌ ఏం ఆలోచిస్తున్నారు అనే చర్చ మొదలైంది. జగదీష్ నింధితుడిగా తెలితే శిక్ష పడే అవకాశం ఉంది.. అలాంటపుడు అతన్ని మూవీలో కంటిన్యూ చేయనిస్తారా? లేదా? అని మెజార్టీ యూనిట్‌ సభ్యులు భావిస్తున్నారట. కేశవ పాత్ర ప్రాధాన్యత బట్టి జగదీష్ తో షూటింగ్ చేయాంటే .. చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ మూవీ కోసం ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో రిస్క్ తీసుకోవడం అవసరామా? అని చిత్రయూనిట్ భావిస్తున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఈ క్రమంలోనే కేశవ పాత్ర కోసం మరో నటుడిని తీసుకుంటారా? ఆ పాత్ర పరిధి తగ్గిస్తారా? లేదా జగదీష్ తో ఉన్న సన్నివేశాలు రీ షూట్ చేస్తారా? అన్న విషయంపై ఇండస్ట్రీలో రక రకాల చర్చలు మొదలయ్యాయి. కాకపోతే ఈ విషయంపై ఎలాంటి అఫిషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై చిత్ర యూనిట్ ఏమంటుందో చూడాలి. ఈ విషయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJojobetJojobetHoliganbetJojobetHoliganbetjojobetgrandpashabetkralbetcasibomiptvjojobetcasibomcasibomGrandpashabetgrandpashabetepikbahis girişEscortes BelgiqueCasibomCasibomgrandpashabetJOJOBET GİRİŞLERİCasibom