Swetha
తెలుగు బుల్లితెర రియాలిటీ షో.. బిగ్ బాస్ ద్వారా ఎంతో మందికి పరిచయం అయింది ప్రియాంక సింగ్ (పింకీ). తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదుర్కొన్న ఆటుపోట్ల గురించి చెప్పుకొచ్చింది.
తెలుగు బుల్లితెర రియాలిటీ షో.. బిగ్ బాస్ ద్వారా ఎంతో మందికి పరిచయం అయింది ప్రియాంక సింగ్ (పింకీ). తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదుర్కొన్న ఆటుపోట్ల గురించి చెప్పుకొచ్చింది.
Swetha
ప్రియాంక సింగ్ అంటే ఒకప్పుడు ఎవరికీ తెలియక పోవచ్చు . కానీ, తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా ఇప్పుడు అందరికి సుపరిచితమే. పుట్టుకతో అబ్బాయి అయినా కూడా .. తనలో ఉన్న అమ్మాయి లక్షణాలను గుర్తించి.. తన జీవితంలో ఎన్నో ఆటు పోట్లు, అవమానాలు ఎదుర్కొని.. దైర్యంగా ఈరోజు అమ్మాయిగా సొసైటీలోను .. అటు ఇండస్ట్రీలోనూ మంచి గుర్తింపును తెచ్చుకుంది ప్రియాంక సింగ్ అలియాస్ పింకీ. హీరోయిన్లు సైతం అసూయా పడే అందం పింకీ సొంతం. బిగ్ బాస్ తర్వాత పింకీ క్రేజ్ మరింత పెరుగుతూ వస్తుంది. అటు పలు టీవీ షోస్ లోను.. ఇటు సోషల్ మీడియాలోను నిత్యం తన ఫోటోలను షేర్ చేస్తూ.. కుర్రకారు హృదయాలను దోచుకుంటుంది. అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక .. తానూ అమ్మాయిగా మారడానికి కంటే ముందు.. తానూ ఎదుర్కొన్న సమస్యల గురించి .. అనేక సందర్భాలలో తానూ పడిన అవమానాల గురించి.. వ్యక్తపరిచింది.
తానూ అమ్మాయిగా ఎలా మారింది అనే విషయంపై ప్రియాంక మాట్లాడుతూ.. “చిన్నపుడు అక్క స్కూల్ నుంచి రాగానే .. తన డ్రెస్సులు వేసుకునేదాన్ని. రాను రాను నాకు అమ్మాయిగా ఉండాలనిపించింది. అలా పదవ తరగతి తర్వాత హైదరాబాద్ కు వచ్చాను. మేకప్ ఆర్టిస్ట్ గా చేశాను. ఆ తర్వాత జబర్దస్త్ షో లో లేడీ గెటప్స్ వేసాను. ఆ డబ్బుతో సర్జరీ చేయించుకున్నాను. ఆ సమయంలో విపరీతమైన నొప్పితో భాదపడ్డాను. హాస్పిటల్ లో పట్టించుకునే వాళ్ళు లేరు. ఓ పక్క రక్త స్రావం అవుతున్నా .. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి గేటు వరకు నడుచుకుంటూ వెళ్ళాను”. అంటూ చెప్పుకొచ్చింది. మరో వైపు ఒకానొక సమయంలో ఆరోగ్యం బాగా క్షీణించి మరల కోలుకోవడానికి. ఎన్నో సర్జరీలు చేయించుకోవడంతో.. తన బ్యాంక్ బ్యాలన్స్ మొతం జీరో అయిపోయిందని . మళ్ళీ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయి వరకు చేరుకున్నాను అంటూ ఆమె తన భాధను వ్యక్త పరిచింది.
అలాగే ఆమె తన జీవితంలో మూడు సార్లు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నదట. ఆ విషయమై ప్రియాంక మాట్లాడుతూ.. “నా జీవితంలో మూడు సార్లు ఆత్మహత్యాయత్నం చేశాను. పదో తరగతి అయ్యాక అందరు ఏదైతే అన్నారో.. నాన్న నోటి నుంచి వచ్చేసరికి నేను చనిపోవాలి అనుకున్నాను. అప్పుడు కిరోసిన్ పోసుకుని కాల్చుకున్నాను. ఆ సమయంలో 60 శాతం వరకు కాలిపోయింది. దానికి ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఆ తర్వాత ప్రేమలో ఫెయిల్ అయినపుడు.. స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నాను. ఆ తర్వాత సర్జరీ అయ్యాక ఆర్థరైటిస్ రావడంతో .. ఆ బాధ భరించలేక మళ్ళీ స్లీపింగ్ పిల్స్ తీసుకున్నాను. ఆలా మూడు సార్లు చనిపోవాలి అనుకున్నా సరే .. బ్రతికాను. నాకోసం ఎదో రాసిపెట్టి ఉంది . అందుకే దేవుడు నన్ను బ్రతికిస్తున్నాడు అనుకున్నాను. అందుకే భగవంతుడిని నమ్ముతాను”. అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక. ఇక ఈమె ప్రస్తుతం ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తుందట. అలాగే చిన్న చిన్న సినిమాలతో పాటు హీరోయిన్ గా కూడా చేస్తుందట ప్రియాంక. మరి, ప్రియాంక సింగ్ తన వ్యక్తిగత జీవితం గురించి పంచుకున్న సంఘటనలపై .. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.