iDreamPost
android-app
ios-app

Prabhas: సలార్ చిత్రానికి ఊహించని మరో బెడద! అదేంటంటే?

  • Author Soma Sekhar Published - 09:39 PM, Tue - 5 December 23

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ ట్రైలర్ తోనే రికార్డులు బద్దలు కొట్టాడు. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉండగా.. సలార్ కు ఊహించని కొత్త చిక్కు వచ్చిపడింది. అదేంటంటే?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ ట్రైలర్ తోనే రికార్డులు బద్దలు కొట్టాడు. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉండగా.. సలార్ కు ఊహించని కొత్త చిక్కు వచ్చిపడింది. అదేంటంటే?

  • Author Soma Sekhar Published - 09:39 PM, Tue - 5 December 23
Prabhas: సలార్ చిత్రానికి ఊహించని మరో బెడద! అదేంటంటే?

ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ రిలీఫ్ ఫీలవుతున్నారు. ఇలాంటి టైంలో మరో పిడుగులాంటి వార్త వాళ్లని మళ్లీ కల్లోలంలో పడేసింది.  యానిమల్ సినిమా రిలీజ్ రోజునాడే రిలీజైన సలార్ ట్రైలర్, గంటల వ్యవధిలోనే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ దాటిపోయి రికార్డుల మీద రికార్డులు సృష్టించింది. ఇది డార్లింగ్ ఫ్యాన్స్ కు పెద్ద ఊరటను తెచ్చి పెట్టింది. రెబల్ స్టార్ నటించిన గత సినిమాలు రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాలతో పాటుగా ఇంతకు ముందు రిలీజైన సాహో మూవీ ప్రభాస్ అభిమానుల ఆశలపై నీళ్ళు జల్లాయి. దీంతో వాళ్ళు చతికిలబడిపోయారు. ఇక ఇప్పుడు వాళ్ల ఆశలన్నీ సలార్ మీదే ఉన్నాయి. కేజీఎఫ్ చిత్రం తర్వాత వస్తున్న ప్రశాంత్ నీల్ చిత్రం సలార్ కావడం, ప్రశాంత్ తప్పకుండా తమ హీరోకి బంపర్ హిట్ ఇస్తాడనే పేరాశ ఫ్యాన్స్ కి ఊపిరి పోస్తూ వచ్చింది.

ఈ క్రమంలోనే జూలై నెలలో విడుదలైన టీజర్ అంచనాలను బాగానే నిలబెట్టింది. అభిమానులు పండగ చేసుకునేట్టే టీజర్ ఉండడంతో సలార్ మీద నేచురల్ గానే అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. తర్వాత ట్రైలర్ బైటకు రావడానికి నెలలు పట్టేసింది. ఇదిలా ఉండగా.. డిసెంబర్ 22న సలార్ విడుదల కాబోతూండగా, నెల ప్రారంభంలో ట్రైలర్ రిలీజ్ చేయడానికి హోంబలే ప్రొడక్షన్స్ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే విడుదలైన ట్రైలర్ దుమ్ము లేపేసిన మాట వాస్తవం. ప్రభాస్ ఎలా ఉండాలో అలా ఉన్నాడు. బాహుబలి చిత్రంతో ఇండియన్ బాహుబలిగా పేరుతెచ్చుకున్న డార్లింగ్ పర్సనాలిటీకి తగిన విధంగా ఆ గెటప్, లుక్స్, డైలాగ్స్ ఉండడంతో అభిమానులకే కాదు, సగటు ప్రేక్షకులకు కూడా మతి పోయింది. ప్రభాస్ మిష్టర్ ఫర్ఫెక్ట్ లా కనిపించాడు. ఆ విజువల్స్, సెట్ వర్క్, షాట్స్, ఫ్రేమ్స్…..ఒకటి కాదు.. మొత్తానికి ప్రతీ యాంగిల్ సలార్ సినిమాని ఓ మేజికల్ ఎక్స్ పీరియన్స్ లా కళ్ళకు కట్టింది. భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా సలార్ ట్రైలర్ సంచలనం పుట్టించిన మాటైతే వాస్తవం.

ఈ నేపథ్యంలో తాజాగా మరో న్యూస్ బైటకు వచ్చి ప్రభాస్ అభిమానులను తీవ్రమైన నిరాశకు గురి చేసింది. అదేంటంటే.. సలార్ సినిమా గతంలో ప్రశాంత్ నీల్ తన తొలి ప్రయత్నంగా చేసిన ఉగ్రం సినిమా కథలాంటి కథతోనే తయారైందని వార్త వైరల్ అయింది. దాంతో అభిమానులు నిజానికి కొంత భయపడ్డారు. ఎందుకంటే గతంలో సాహో కూడా రన్ రాజా రన్ సినిమాకి కరెక్టుగా ట్రూకాపీలా ఉండడంతో.. తెలుగులో పెద్దగా సాహో లాగకపోగా, బాక్సాఫీసు దగ్గర డిజాస్టర్ అయింది. నార్త్ బెల్ట్ లో కొంత నయం. బాహుబలి మేనియాలో హిందీ వాళ్లంతా చూసేశారు. ఇప్పుడు మళ్లీ సలార్ సినిమా కథ ఉగ్రంలా ఉంటుందని టాక్ బైటకు రాగానే అందరికీ చెమటలు వచ్చేశాయి.  అయితే కథ ఎలా ఉన్నా, కనీసం సినిమా మేకింగ్ మాత్రం ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ లా ఉంటే చాలురా భగవంతుడా అనే స్థితికి వచ్చేశారు అభిమానులు. చూడాలి మరి ఏది ఎలా ఉంటుందో.  ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

                                                                                     – నాగేంద్ర కుమార్

 

 

Jojobet GirişJojobetJojobetJojobetHoliganbetJojobetHoliganbetjojobetgrandpashabetkralbetcasibomiptvjojobetcasibomcasibomGrandpashabetgrandpashabetcasinofast girişEscortes BelgiqueCasibomCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibom