iDreamPost
android-app
ios-app

Game Changer: గేమ్ ఛేంజర్ టార్గెట్ ఫిక్స్.. కానీ, NTR వల్ల మాత్రం టెన్షన్!

Game Changer Target Sets By Devara Movie: రామ్ చరణ్- శంకర్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఎన్టీఆర్ దేవర సినిమాతో గేమ్ ఛేంజర్ కు ఒక టార్గెట్ అయితే ఫిక్స్ చేశాడు. మరి.. ఆ టార్గెట్ ఏంటి? దేవరకు గేమ్ ఛేంజర్ కు ఉన్న సంబంధం ఏంటో చూద్దాం.

Game Changer Target Sets By Devara Movie: రామ్ చరణ్- శంకర్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఎన్టీఆర్ దేవర సినిమాతో గేమ్ ఛేంజర్ కు ఒక టార్గెట్ అయితే ఫిక్స్ చేశాడు. మరి.. ఆ టార్గెట్ ఏంటి? దేవరకు గేమ్ ఛేంజర్ కు ఉన్న సంబంధం ఏంటో చూద్దాం.

Game Changer: గేమ్ ఛేంజర్ టార్గెట్ ఫిక్స్.. కానీ, NTR వల్ల మాత్రం టెన్షన్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అంతా ఇప్పుడు గేమ్ ఛేంజర్ కోసమే ఎదురుచూస్తున్నారు. పైగా శంకర్ దర్శకత్వం కావడంతో ఆ మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అలాగే ట్రిపులార్ మూవీ తర్వాత రామ్ చరణ్ రేంజ్ గ్లోబల్ స్థాయికి వెళ్లిపోయింది. రాజమౌళితో మూవీ చేసిన తర్వాత వస్తున్న మూవీ కావడంతో గట్టి అంచనాలే నెలకొన్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ దేవరగా ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. కేవలం మూడ్రోజుల్లోనే మూడు వందల కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేశాడు. అంతేకాకుండా.. రాజమౌళి సెంటిమెంట్ ను కూడా తారక్ పటాపంచలు చేశాడు. ఇప్పుడు దేవరతో ఎన్టీఆర్ హిట్టు కొట్టడమే కాకుండా.. రామ్ చరణ్ కు కూడా టార్గెట్ ఫిక్స్ చేశాడు. అవును.. చెర్రీ టార్గెట్ ని ఫిక్స్ చేసింది ఎన్టీఆరే. అదేంటి.. రామ్ చరణ్ టార్గెట్ ని ఎన్టీఆర్ ఫిక్స్ చేయడం ఏంటి.. అనుకుంటున్నారా? ఆ కథ ఏంటో చూద్దాం.

అసలు ఈ లెక్క ఏంటో తెలియాలి అంటే ముందు.. దేవర గురించి మాట్లాడుకోవాలి. ఎన్టీఆర్- కొరటాల కాంబోలో వచ్చిన దేవర పార్ట్ 1ని 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ ని 200 కోట్ల రూపాయలకు అమ్మారు. దేవర చిత్రం కేవలం మూడ్రోజుల్లోనే ఏకంగా 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. నిజంగా ఇది ఎన్టీఆర్ స్టామినా అనే చెప్పాలి. నిజానికి తొలిరోజు డివైడ్ టాక్ వచ్చింది. కానీ, ఎక్కడా కూడా కలెక్షన్స్ మాత్రం తగ్గట్లేదు. దేవర జోరు చూస్తుంటే.. మూవీ లాంగ్ రన్ లో కచ్చితంగా 500 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసేలాగే ఉంది. ఇప్పుడు ఈ కలెక్షన్స్ లెక్కలు చూసుకుంటే మాత్రం.. దేవర సూపర్ హిట్ అనే చెప్పాలి.

మరి.. గేమ్ ఛేంజర్ కి దేవర పెట్టిన టార్గెట్ ఏంటి? అది కూడా చూద్దాం. ఇక్కడ దేవరకు బడ్జెట్- బిజినెస్- కలెక్షన్స్ అన్నీ కలిసొచ్చాయి. అయితే గేమ్ ఛేంజర్ పరిస్థితి మాత్రం అంత సులభంగా ఉండేలా కనిపించడం లేదు. ఎందుకంటే దేవర బడ్జెట్ 350 కోట్ల రూపాయలు అయితే.. గేమ్ ఛేంజర్ కు మాత్రం బడ్జెట్ 450 కోట్ల రూపాయలు అయ్యింది. అంటే ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ ని కచ్చితంగా 300 కోట్ల రూపాయలకు అమ్మాల్సి ఉంటుంది. అంటే అప్పుడు ఎలా లేదన్నా కూడా.. గేమ్ ఛేంజర్ సినిమా 600 కోట్ల రూపాయల గ్రాస్ ని కలెక్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎన్టీఆర్ కు ఉన్నా ఫాలోయింగ్.. అదే స్థాయి కలెక్షన్స్ రాబట్టగల సత్తా రామ్ చరణ్ కు కూడా ఉంది. సినిమా హిట్ అయితే మాత్రం 600 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ అనేవి అసలు లెక్కే కాదు.

కానీ, సినిమా డివైడ్ టాక్ వచ్చినా.. సినిమా ఆకట్టుకోలేకపోయినా కూడా అంత కలెక్ట్ చేయడం చాలా కష్టం. అయితే రామ్ చరణ్ కావడం.. లెంజడరీ డైరెక్టరీ శంకర్ కావడంపై గేమ్ ఛేంజర్ పై మినిమం అంచనాలు పెట్టుకోవచ్చు. అలాగే రామ్ చరణ్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో తెలుగు ప్రేక్షకులకు తెలియనిది కాదు. ఈ ఫ్యాక్టర్స్ గేమ్ ఛేంజర్ కచ్చితంగా కొట్టాల్సిందే అని కోరుకుందాం. అలాగే ఎన్టీఆర్ సెట్ చేసిన టార్గెట్ కూడా బాగుంది. టాలీవుడ్ ఇప్పుడు గ్లోబల్ స్థాయికి ఎదుగుతున్న నేపథ్యంలో హీరోల మధ్య ఇలాంటి హెల్తీ పోటీ ఉండటం చాలా మంచి విషయం. అలాంటి పోటీ ఇండస్ట్రీ ఎదగడానికి ఉపయోగపడుతుంది. మరి.. గేమ్ ఛేంజర్ కు దేవర సెట్ చేసిన టార్గెట్ ని రామ్ చరణ్ రీచ్ అవుతాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.