iDreamPost
android-app
ios-app

నవాజుద్దీన్ సిద్ధిఖీ సంచనల వ్యాఖ్యలు.. రొమాన్స్ కు వయసుతో సంబంధం లేదు!

నవాజుద్దీన్ సిద్ధిఖీ సంచనల వ్యాఖ్యలు.. రొమాన్స్ కు వయసుతో సంబంధం లేదు!

నవాజుద్దీన్ సిద్ధిఖీ.. ఈ విలక్షణ నటుడికి పాన్ ఇండియా లెవల్లో అభిమానులు ఉన్నారు. పాత్ర ఏదైనా ఎంతో సునాయాసంగా చేసేస్తాడు. తన నటనతో ఎంతో ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్నాడు. కానీ, వ్యక్తిగత జీవితంలో మాత్రం నవాజుద్దీన్ కు నెగెటివ్ మార్కులు పడతాయి. తన భార్యను పిల్లలను పట్టించుకోవడం లేదని.. వారిని ఇంట్లో నుంచి గెంటేశాడంటూ ఇప్పటికే అతని భార్య ఆరోపణలు చేయడం, అర్ధరాత్రి రోడ్డుపై ఉండి వీడియోలు పెట్టడం చూశాం. సినిమా లైఫ్ కంటే పర్సనల్ లైఫ్ విషయంలోనే నవాజుద్దీన్ ఇప్పుడు వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీ పరంగా కూడా నవాజుద్దీన్ పేరు మళ్లీ వార్తల్లోకి ఎక్కింది.

నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రస్తుతం “టీకూ వెడ్స్ షేరూ” అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. సినిమా ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒక జూనియర్ ఆర్టిస్ట్, హీరోయిన్ గా ఎదగాలి అనుకునే ఒక యువతికి పెళ్లైతే.. తర్వాత వారి గోల్స్ ని ఎలా రీచ్ అయ్యారు అనే విషయాన్ని కాస్త ఇంట్రెస్టింగ్ గా, సరదాగా చూపించారు. అయితే ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధిఖీకి లిప్ లాక్ సీన్ కూడా ఉంది. ట్రైలర్ అలా వచ్చి ఇలా వెళ్లిపోయినా కూడా.. ప్రేక్షకులు మాత్రం ఆ సీన్ గురించే మాట్లాడుతున్నారు.

కేవలం చర్చించుకోవడం మాత్రమే కాదండోయ్.. నవాజుద్దీన్ ని ట్రోల్ కూడా చేస్తున్నారు. 50 ఏళ్ల వయసులో 21 ఏళ్ల అమ్మాయితో నీకు రొమాన్స్ అవసరమా అంటూ సూటిగానే ప్రశ్నిస్తున్నారు. ఈ ట్రోలింగ్ ఎక్కువ కావడంతో నేరుగా నవాజుద్దీన్ సిద్ధిఖీనే స్పందించాడు. ట్రోలర్స్ కు తనదైనశైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. రొమాన్స్ కు వయసుతో సంబంధం లేదు అంటూ కుండ బద్దలు కొట్టేశాడు. “హీరో- హీరోయిన్లకు వయసు వ్యత్యాసం ఉండదు. అసలు రొమాన్స్ కి వయసుతో సంబంధమే ఉండదు. షారుక్ ఖాన్ ని చూడండి. ఇప్పటకీ గ్లామర్ రోల్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న యువతకు అది చేతకాదు కాబట్టి.

అసలు ఇప్పుడు ప్రేమ- బ్రేకప్ అన్నీ వాట్సాప్ లో నే జరిగిపోతున్నాయి. అయినా రియల్ లైఫ్ లో రొమాన్స్ చేయగలిగిన వాళ్లే.. ఇలాంటి సీన్స్ లో నటించగలరు” అంటూ ట్రోలర్స్ కి గట్టి రిప్లయి ఇచ్చారు. నవాజ్ చెప్పిన సమాధానంలో ట్రోలర్స్ కూడా తోక ముడిచారు. ఈ విషయంలో నవాజుద్దీన్ కు మద్దతు కూడా లభిస్తోంది. ఒక నటుడు కెమెరా ముందు చేసే నటనను ఉదాహరణగా చూపించి అతడిని వ్యక్తిగతంగా ట్రోల్ చేయడ కరెక్ట్ కాదంటున్నారు. పాత్రకు తగినట్లు, డైరెక్టర్ చెప్పినట్లుగానే నటుడు యాక్ట్ చేస్తాడంటూ చెప్పుకొస్తున్నారు.