iDreamPost
android-app
ios-app

Balakrishna: ఆ డైరెక్టర్ కోసం కత్తి తీసుకొని వెళ్లా.. బాలయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • Published Sep 02, 2024 | 1:48 PM Updated Updated Sep 02, 2024 | 2:53 PM

Nandamuri Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి తెలిసిందే. ఆయన ఎవ్వరితోనైనా ఈజీగా కలసిపోతారు. చిన్నా, పెద్ద అనే తేడాల్లేకుండా అందరు నటులు, టెక్నీషియన్స్​తో మంచి రిలేషన్స్ మెయింటెయిన్ చేస్తారు. అలాంటి ఆయన ఓ డైరెక్టర్ కోసం కత్తి పట్టుకొని వెళ్లారట. ఇలా ఎందుకు చేశారో ఇప్పుడు చూద్దాం..

Nandamuri Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి తెలిసిందే. ఆయన ఎవ్వరితోనైనా ఈజీగా కలసిపోతారు. చిన్నా, పెద్ద అనే తేడాల్లేకుండా అందరు నటులు, టెక్నీషియన్స్​తో మంచి రిలేషన్స్ మెయింటెయిన్ చేస్తారు. అలాంటి ఆయన ఓ డైరెక్టర్ కోసం కత్తి పట్టుకొని వెళ్లారట. ఇలా ఎందుకు చేశారో ఇప్పుడు చూద్దాం..

  • Published Sep 02, 2024 | 1:48 PMUpdated Sep 02, 2024 | 2:53 PM
Balakrishna: ఆ డైరెక్టర్ కోసం కత్తి తీసుకొని వెళ్లా.. బాలయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

నందమూరి నటసింహం బాలకృష్ణకు ఉన్న ఫాలోయింగ్, క్రేజ్ గురించి స్పెషల్​గా చెప్పాల్సిన పనిలేదు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్​తో బాక్సాఫీస్​ను షేక్ చేస్తున్నారాయన. ఇంత స్టార్​డమ్, పాపులారిటీ ఉన్నా బాలయ్య ఎక్కడా అలా ఉండరు. ఎవ్వరితోనైనా ఈజీగా కలసిపోతారు. చిన్నా, పెద్ద అనే తేడాల్లేకుండా అందరు నటులు, టెక్నీషియన్స్​తో మంచి రిలేషన్స్ మెయింటెయిన్ చేస్తారు. విశ్వక్​సేన్, సిద్ధు జొన్నలగడ్డ లాంటి కుర్ర హీరోలతోనూ కలసి సందడి చేస్తుంటారు. తన సినిమా ఈవెంట్స్​కు వాళ్లను పిలుస్తూ, వాళ్ల మూవీస్​ ఫంక్షన్స్​కు ఆయన వెళ్తూ యంగ్ హీరోస్​తోనూ మంచి ర్యాపో మెయింటెయిన్ చేస్తున్నారు. ఈ తరం దర్శకులతోనూ ఆయన అంతే ఫ్రెండ్లీగా ఉంటున్నారు. అలాంటి బాలయ్య ఓ డైరెక్టర్ కోసం ఏకంగా కత్తి పట్టుకొని వెళ్లారట. ఈ విషయాన్ని స్వయంగా బాలకృష్ణే చెప్పారు. అసలు ఆయన ఎందుకిలా చేశారనేది ఇప్పుడు తెలుసుకుందాం..

టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన సుకుమార్ కోసం బాలకృష్ణ కత్తి పట్టుకొని వెళ్లారట. ‘పుష్ప 2’ మూవీ షూటింగ్ జరుగుతున్న లోకేషన్​కు కత్తి తీసుకొని వెళ్లారట. దీంతో సుక్కూ భయపడిపోయారట. ఈ విషయాన్ని బాలయ్యే చెప్పారు. తాజాగా ఓ ఛానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘పుష్ప 2’ షూటింగ్ జరుగుతున్న లొకేషన్​కు పక్కనే తాను నటిస్తున్న ఓ యాడ్ షూట్ అవుతుండటంతో అక్కడికి వెళ్లానని అన్నారు. ఒక కత్తిని దాచుకొని ‘పుష్ప 2’ సెట్​కు తీసుకెళ్లానని చెప్పారు. బన్నీతో మాట్లాడాక సుకుమార్​ను కలిశానన్నారు బాలయ్య. సుకుమార్ హలో చెప్పగానే కత్తి బయటకు తీశానని.. కత్తెందుకు అంటూ ఆయన భయపడ్డారని తెలిపారు. తనతో మూడ్నెళ్లలో సినిమా తీస్తానని ‘అన్​స్టాపబుల్’ షోలో మాట ఇచ్చి తీయకపోవడంతో ఇలా చేశానంటూ నవ్వుల్లో ముంచెత్తారు బాలయ్య.

మూవీ తీస్తావా? లేదా కత్తితో సమాధానం చెప్పనా? అంటూ సుకుమార్​ను సరదాగా భయపెట్టానని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. ఈ సీన్​తో అంతా నవ్వుకున్నామని తెలిపారు. తనకు ఎలాంటి భేషజాలు లేవని, అందరితో కలసిపోతానన్నారు. షూటింగ్స్, బిజీ షెడ్యూల్స్ వల్ల ఇతర హీరోలను పెద్దగా కలవట్లేదని.. కానీ కలిసినప్పుడు మాత్రం సరదాగా మాట్లాడుకుంటామని పేర్కొన్నారు నందమూరి నటసింహం. రామ్ చరణ్, అల్లు అర్జున్​తో తాను చాలా క్లోజ్​గా ఉంటానని.. ఎక్కువగా కలవనని, కానీ కలిస్తే వాళ్లతో సరదాగా మాట్లాడుతూ టైమ్ స్పెండ్ చేస్తానని వివరించారు. ఇక, తన వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి కూడా ఇదే ఇంటర్వ్యూలో బాలయ్య క్లారిటీ ఇచ్చారు. మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి సంబంధించి గ్రౌండ్ వర్క్ జరుగుతోందని, ఇంకో మూడ్నెళ్లలో సినిమా మొదలవుతుందని తెలిపారు. ఆ సినిమాకు సంబంధించి ప్రొడక్షన్ హౌజ్​తో పాటు మిగిలిన విషయాలు ఫైనలైజ్ అవుతున్నాయని పేర్కొన్నారు.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibommarsbahisMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/