మృణాల్ ఠాకూర్.. ఒకే ఒక్క చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది. సీతారామం మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ.. తొలి చిత్రంతోనే కుర్రాళ్ల గుండెలు కొల్లగొట్టింది. సీత పాత్రలో తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఇక ఈ చిత్రం సూపర్ సక్సెస్ సాధించడంలో.. మృణాల్ కు వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో వరుసబెట్టి సినిమాలు చేస్తుంది. ఈ క్రమంలోనే తన రిలేషన్ స్టేటస్ గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. ఓ స్టార్ హీరోతో ప్రేమలో పడ్డానని చెప్పుకొచ్చింది ఈ అందాల సోయగం.
మృణాల్ ఠాకూర్ ఓ స్టార్ హీరోతో ప్రేమలో పడిందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా? తాజాగా ఓ మీడియా ఛానల్ మీరు ఎవరితోనైనా ప్రేమలో పడ్డారా? అని మృణాల్ ను ప్రశ్నించింది. దీనికి ఈ ముద్దుగుమ్మ ఈ విధంగా ఆన్సర్ ఇచ్చింది.”హాలీవుడ్ హీరో కీను రీవ్స్ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచే అతడిని చూసి ప్రేమలో పడ్డాను. కీను రీవ్స్ లాంటి భర్త తనకు రావాలని కోరుకుంటున్నాను. అయితే నాది వన్ సైడ్ లవ్ మాత్రమే” అని చెప్పుకొచ్చింది. దీంతో కుర్రాళ్లు ఊపిరి పీల్చుకున్నారు.
ఇక తన పెళ్లి గురించి ఇంట్లో ఒత్తిడి తెస్తున్నారని, కానీ తను మాత్రం కెరీర్ పైనే ఫోకస్ పెట్టినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో నానికి జతగా ‘హాయ్ నాన్న’ మూవీలో నటిస్తోంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీనితో పాటుగా విజయ్ దేవరకొండతో కూడా ఓ సినిమాలో నటిస్తోంది. ఇవే కాకుండా.. చిరంజీవి సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసినట్లు టాక్ వినిపిస్తోంది. మరి స్టార్ హీరోతో వన్ సైడ్ లవ్ లో పడ్డాను అని చెప్పిన మృణాల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.