iDreamPost
android-app
ios-app

Mr Bachchan: మిస్టర్ బచ్చన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ పై భారీ అంచనాలు..

  • Published Aug 13, 2024 | 2:12 PM Updated Updated Aug 13, 2024 | 2:46 PM

Mr Bachchan Break Even Target: హిట్స్ , ప్లాప్స్ తో సంబంధం లేకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను తీయడంలో ముందుండేది.. మాస్ మహారాజ రవి తేజ. ఇక ప్రస్తుతం రవి తేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమా రిలీజ్ కు రెడీ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Mr Bachchan Break Even Target: హిట్స్ , ప్లాప్స్ తో సంబంధం లేకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను తీయడంలో ముందుండేది.. మాస్ మహారాజ రవి తేజ. ఇక ప్రస్తుతం రవి తేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమా రిలీజ్ కు రెడీ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

  • Published Aug 13, 2024 | 2:12 PMUpdated Aug 13, 2024 | 2:46 PM
Mr Bachchan: మిస్టర్ బచ్చన్  బ్రేక్ ఈవెన్ టార్గెట్ పై భారీ అంచనాలు..

రవి తేజ , హరీష్ శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న మిస్టర్ బచ్చన్.. మూవీ రిలీజ్ కు ఇంకా ఎంతో సమయం లేదు. దీనితో మూవీ రిలీజ్ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే మీడియా సోషల్ మీడియాలో మూవీ ప్రమోషన్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. అలాగే మూవీ గురించి అంతకంటే ఎక్కువ పాజిటివ్ బజ్ నడుస్తుంది. ఆల్రెడీ అందరికి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి.. అలాగే బ్రేక్ ఈవెన్ టార్గెట్ గురించి.. డిస్కషన్స్ మొదలయ్యాయి. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఇపప్టికే మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి రిలీజ్ అయినా ట్రైలర్ , సాంగ్స్ అన్నీ కూడా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వీటితో పాటు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రికార్డ్ స్థాయిలో జరిగినట్లు సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా మిస్టర్ బచ్చన్ థియేట్రికల్ బిజినెస్ 31 కోట్ల వరకు జరిగిందట. అలాగే నైజాం , ఆంధ్ర ఈ రెండు ప్రాంతాల్లో కలిపి.. థియేట్రికల్ రైట్స్ 23 కోట్ల‌కు అమ్ముడుపోయినట్లు సమాచారం. సీడెడ్ నాలుగు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్.. ఓవ‌ర్‌సీస్‌లో రెండు కోట్లు.. అలాగే మిగిలిన ప్రాంతాల్లో మరొక రెండు కోట్లు.. ఇలా మొత్తంగా మూవీ.. ప్రీ రిలీజ్ బిజినెస్ 31 కోట్లు జరిగినట్లు సమాచారం. దీనిని బట్టి చూస్తే.. మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 32 కోట్లు ఉంటుందని అంచనా.. ఈ మార్క్ ను క్రాస్ చేస్తే కానీ.. మిస్టర్ బచ్చన్ టీం లాభాల్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంటుంది.

mr bachan breakeven target

ఒకవేళ అనుకున్నట్లుగానే మూవీ కథ బావుండి.. ఇప్పుడు కొనసాగుతున్న హైప్ రిలీజ్ తర్వాత కూడా ఉంటే మాత్రం.. అనుకున్నట్లుగానే ఈజీగా బ్రేక్ ఈవెన్ ను దాటేస్తుంది. అయితే అదే రోజు ఈ మూవీకి పోటీగా రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ , తారక్ బావమరిది నితిన్ నార్నె ‘ఆయ్’ సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. ఈ రెండు సినిమాలకు కూడా ప్రస్తుతం డీసెంట్ హైప్ నడుస్తుంది. కాబట్టి మిస్టర్ బచ్చన్ అనుకున్న టార్గెట్ ను రీచ్ అవుతుందా లేదా అనే సందేహం కూడా ఓ వైపు అభిమానులలో నెలకొంది. ఇవన్నీ తెలియాలంటే మూవీ రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే. మరి మిస్టర్ బచ్చన్ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş