iDreamPost
android-app
ios-app

లాస్ ఏంజెల్స్ లో మెగాస్టార్ చిరంజీవికి ఘన సన్మానం

  • Published Feb 19, 2024 | 4:47 PM Updated Updated Feb 19, 2024 | 4:47 PM

మెగాస్టార్ చిరంజీవికి ఇటీవల ప్రఖ్యాతిగాంచిన "పద్మ విభూషణ్" అవార్డును .. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా చిరుకు లాస్ ఏంజెల్స్ లో ఘన సత్కారం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

మెగాస్టార్ చిరంజీవికి ఇటీవల ప్రఖ్యాతిగాంచిన "పద్మ విభూషణ్" అవార్డును .. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా చిరుకు లాస్ ఏంజెల్స్ లో ఘన సత్కారం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Feb 19, 2024 | 4:47 PMUpdated Feb 19, 2024 | 4:47 PM
లాస్ ఏంజెల్స్ లో మెగాస్టార్ చిరంజీవికి ఘన సన్మానం

దేశంలోనే అత్యంత ప్రఖ్యాతి గాంచిన పురస్కారాలలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం “పద్మ విభూషణ్”. ఈ ప్రత్యేకమైన అవార్డును సంపాదించుకోవాలంటే.. దాని వెనుక ఎంతో కృషి , శ్రమ చేసి ఉండాలి. ఈ క్రమంలోనే స్వయం కృషితో అంచలంచెలుగా .. అంచనాలను మించుతూ సినీ పరిశ్రమలో ఎదిగిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. కొన్ని దశాబ్దాల నుంచి సినీ కళామతల్లికి చిరు అందించిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం “పద్మ విభూషణ్” అవార్డును ప్రకటించింది. ఈ సంధర్బంగా అమెరికాలోని చిరంజీవి అభిమానులు “మెగా ఫెలిసిటేషన్” అనే ఈవెంట్ ను ఫిబ్రవరి 19న గ్రాండ్ గా లాస్ ఏంజిల్స్‌లో నిర్వహించారు. ఆ ఈవెంట్ కు సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.

మెగాస్టార్ కు “పద్మ విభూషణ్” ప్రకటించిన విషయంలో.. చిరు అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు . ఈ క్రమంలోనే తాజాగా అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో .. చిరు అభిమానులు “మెగా ఫెలిసిటేషన్” ఈవెంట్ ను ఆర్గనైజ్ చేశారు. ఈ ఈవెంట్ లో అభిమానులంతా చిరును ఎంతో ప్రేమ అభిమానులతో .. ఘనంగా సత్కరించారు. ఈ క్రమంలో ఆయనపై ఎల్లలు దాటిన తెలుగు అభిమానుల ఆప్యాయతను, తనకిచ్చిన గౌరావాన్ని చూసిన చిరంజీవి.. ఎంతో ఉప్పొంగిపోయి .. అభిమానులందరికి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఈ సందర్బంగా చిరు మాట్లాడుతూ.. “ఎంతో ప్రఖ్యాతి గాంచిన “పద్మ విభూషణ్” అవార్డు రావడమే సంతోషంగా ఉంది. కానీ, మీరు చూపించే ప్రేమ, అభిమానం అంతకుమించి ఆనందాన్ని ఇస్తున్నాయి.” అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెటిజన్లకు ఎంతో ఆసక్తికరంగా మారాయి.

ఇక చిరు సినిమాల విషయానికొస్తే .. ప్రస్తుతం చిరంజీవి “విశ్వంభర” మూవీతో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. చిరు అభిమానులంతా ప్రస్తుతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు రాబోయే రోజులలో తెలియనున్నాయి. మరి మెగాస్టార్ చిరంజీవికి “పద్మ విభూషణ్” ప్రకటించిన సందర్బంగా.. లాస్ ఏంజెల్స్ లో చిరుని ఘనంగా సత్కరించిన విషయంలో .. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetMadridbetJojobetJojobetjojobetJojobetlunabetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet