iDreamPost
android-app
ios-app

మంగళవారం సినిమాలో జమీందారు భార్యగా నటించిన ఈమె బ్యాగ్రౌండ్‌ మాములుగా లేదుగా..

  • Published Nov 23, 2023 | 11:08 AMUpdated Dec 28, 2023 | 1:34 PM

విభిన్న కథాంశంతో తెరకెక్కిన మంగళవారం సినిమా భారీ విజయం సాధించింది. ఈ సినిమాలో హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌తో పాటు జమీందారు భార్య పాత్రలో నటించిన యువతి కూడా మంచి పేరు తెచ్చుకుంది. మరి ఆమె బ్యాగ్రౌండ్‌ ఏంటి.. ఎక్కడ నుంచి వచ్చింది అంటే..

విభిన్న కథాంశంతో తెరకెక్కిన మంగళవారం సినిమా భారీ విజయం సాధించింది. ఈ సినిమాలో హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌తో పాటు జమీందారు భార్య పాత్రలో నటించిన యువతి కూడా మంచి పేరు తెచ్చుకుంది. మరి ఆమె బ్యాగ్రౌండ్‌ ఏంటి.. ఎక్కడ నుంచి వచ్చింది అంటే..

  • Published Nov 23, 2023 | 11:08 AMUpdated Dec 28, 2023 | 1:34 PM
మంగళవారం సినిమాలో జమీందారు భార్యగా నటించిన ఈమె బ్యాగ్రౌండ్‌ మాములుగా లేదుగా..

విభిన్న కథాంశంతో తెరకెక్కిన చిత్రాలు భారీ విజయాన్ని సాధిస్తున్నాయి. విరూపాక్ష, మా ఊరి పోలిమేర, పోలిమేర-2 వంటి సినిమాలు ఈ విషయాన్ని నిరూపించాయి. నవంబర్‌ 17న రిలీజైన మంగళవారం సినిమా కూడా ఇలానే భిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కి.. ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు నుంచే పాజిటీవ్‌ టాక్‌ తెచ్చుకుని.. బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు సాధించింది. అజయ్‌ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోయిన్‌. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఆర్‌ఎక్స్‌ 100 సినిమా ఎంత విజయం సాధించిందో.. మంగళవారం సినిమా అంతకు మించిన హిట్‌ అయింది. తాజాగా, ఈ మూవీ ఓటీటీలోకి వచ్చింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో డిసెంబర్ 25 నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఇక సినిమా విషయానికి వస్తే.. 80,90వ దశకంలో సాగే కథతో తెరకెక్కించారు. మానసిక వ్యాధి, అక్రమ సంబంధం.. వాటి చుట్టూ మూఢనమ్మకాల నేపథ్యంలో తీసిన ఈ కథలో ప్రతి ఒక్కరు తమ పాత్రలకు న్యాయం చేశారని చెప్పవచ్చు. ఇక సినిమాలో వచ్చే క్లైమాక్స్‌, ప్రీ క్లైమాక్స్‌ సన్నివేశాలు మూవీకే హైలెట్‌గా నిలుస్తాయి. సెకండాఫ్‌లో ఊహించని ట్విస్ట్‌లతో సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు అజయ్‌ భూపతి. ఇక సినిమాలో హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ క్యారెక్టర్‌తో పాటు మరో పాత్ర ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అదే ఈ సినిమాలో జమీందారు భార్య పాత్ర. ఈ క్యారెక్టర్‌ సినిమాను కీలక మలుపు తిప్పుతుంది. ఇప్పుడు ఓటీటీలో కూడా జమీందారు భార్య పాత్రకు మంచి అప్రిషియేషన్‌ లభిస్తోంది. మరోసారి ఆమె ట్రెండింగ్‌లోకి వచ్చింది. సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఆమె గురించే చర్చించుకుంటున్నారు.

managalavaram zamindar wife character

జమీందారు భార్య పాత్రలో నటించింది తనే..

సినిమాకు ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ పాత్రలో నటించిన నటి పేరు దివ్యా పిళ్లై. సినిమాలో ఎంతో అందంగా.. అంతకు మించి ఎంతో మంచి వ్యక్తిగా కనిపించి.. ఆఖర్లో ఊహించని షాక్‌ ఇచ్చే పాత్రలో దివ్యా పిళ్లై చక్కగా ఒదిగిపోయింది. సినిమాలో అందం, నటనతో ప్రేక్షకుల మతి పోగొట్టింది. దాంతో ప్రస్తుతం నెటిజనులంతా దివ్యా పిళ్లై గురించి ఆరా తీయడం ప్రారంభించారు. ఇమె మలయాళ నటి. అక్కడ చాలా సినిమాల్లో నటించింది.

అంతేకాదు ఓటీటీలో సూపర్ హిట్ అయిన టొవినో థామస్ చిత్రం ‘కలా’లో ఆమె హీరో భార్యగా ముఖ్య పాత్రలో యాక్ట్‌ చేసింది. మలయాళంలోనే కాకుండా తమిళంలో కూడా రెండు సినిమాల్లో యాక్ట్‌ చేసింది. దివ్య తెలుగు ప్రేక్షకులకు కనిపించడం మాత్రం ఇదే తొలిసారి కాదు. మంగళవారం కన్నా ముందు ఆమె ఓ తెలుగు చిత్రం ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.

తెలుగులో తొలి సినిమా అదే..

దండుపాళ్యం దర్శకుడు తెరకెక్కించిన తగ్గేదెలే అనే సినిమాలో నవీన్ చంద్ర సరసన దివ్యా పిళ్ళై హీరోయిన్‌గా నటించింది చేసింది. ఇక తాజాగా మంగళవారం సినిమాతో మరోసారి ప్రేక్షకులు ముందుకు వచ్చింది. తగ్గేదెలే చిత్రంలో దివ్య యాక్టింగ్‌ చూసిన అజయ్‌ భూపతి.. మంగళవారం చిత్రంలో ఆమెకు కీలక పాత్ర ఇచ్చారు. ఈ సినిమాలో ప్రారంభంలో ఆమె క్యారెక్టర్‌కు పెద్దగా స్కోప్‌ లేకపోయినా.. ఆఖర్లో మాత్రం ఊహించని ట్విస్ట్‌ ఇచ్చి అందరిని షాక్‌కు గురి చేస్తుంది. సినిమాలో దివ్యా పిళ్లై నటనకు మంచి మార్కులే పడ్డాయి. పైగా సినిమా కూడా సూపర్‌ హిట్‌ అవ్వడంతో.. ఆమెకు తెలుగులో వరుస అవకాశాలు వస్తాయని భావిస్తున్నారు నెటిజనులు.

వ్యక్తిగత జీవితం..

దివ్యాపిళ్లై వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఆమె యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో ఓ మలయాళీ కుటుంబంలో పుట్టి పెరిగిన ఆమె సినిమాల్లోకి రాకముందు ఎయిర్‌లైన్స్‌లో పని చేసింది. 2015లో తొలిసారి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. నటుడు వినీత్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన అయల్‌​ నజనల్ల సినిమాలో హీరోయిన్‌గా నటించింది. రొమాంటిక్‌ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఫహద్‌ ఫాసిల్‌ హీరో. ఆ తర్వాత ఆమె తన రెండో సినిమా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో.. పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఊజమ్ (2016) అనే రివెంజ్ డ్రామాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయం సాధించింది. కాతువాకులు రెండు కాదల్‌ చిత్రం ద్వారా తమిళ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

ది విలేజ్‌ అనే తమిళ వెబ్‌ సిరీస్‌లో కూడా నటించింది. ఇక 2022లో విడుదలైన తగ్గేదెలే సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తాజాగా మంగళవారం సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఇక సినిమాలే కాక రియాలీటీ షో, టీవీ షోలు చేస్తూ కెరీర్‌లో చాలా బిజీగా ఉంది దివ్యా పిళ్లై. ఆమె తెలుగులో మరిన్ని చిత్రాల్లో నటించానలని కోరుకుంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి