iDreamPost
android-app
ios-app

Mahesh Babu: ఇండస్ట్రీకి మహేష్ వారసుడు గౌతమ్ గ్రాండ్ ఎంట్రీ.. ఎప్పుడంటే?

  • Published Jul 14, 2024 | 4:33 PMUpdated Jul 14, 2024 | 4:33 PM

రీసెంట్ గా అనంత్ అంబానీ , రాధికా వివాహంలో మహేష్ కిల్లింగ్ లుక్స్.. అందరిని మైమరపించాయి. ఇక ఆ ఫోటోలు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాము. ఇక ఇప్పుడు మహేష్ కు సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.

రీసెంట్ గా అనంత్ అంబానీ , రాధికా వివాహంలో మహేష్ కిల్లింగ్ లుక్స్.. అందరిని మైమరపించాయి. ఇక ఆ ఫోటోలు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాము. ఇక ఇప్పుడు మహేష్ కు సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.

  • Published Jul 14, 2024 | 4:33 PMUpdated Jul 14, 2024 | 4:33 PM
Mahesh Babu: ఇండస్ట్రీకి మహేష్ వారసుడు గౌతమ్ గ్రాండ్ ఎంట్రీ.. ఎప్పుడంటే?

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమా కల్కి రిలీజ్ అయిపొయింది. ఇక అది కాకుండా మరో మూడు స్టార్ హీరోస్ సినిమాలు రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి. ఇవి కాకుండా అందరు ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న బ్లాక్ బస్టర్ మూవీనే. ఈ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు కానీ.. అప్పుడే ఈ సినిమాపై అందరికి భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇక రీసెంట్ గా సోషల్ మీడియాలో మహేష్ లుక్స్ ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు వినిపిస్తున్న బజ్ ఏంటంటే మహేష్ వారుసిడి గ్రాండ్ ఎంట్రీ గురించే. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

ఇండస్ట్రీలో వారసులు ఎంట్రీ ఇవ్వడం అనేది.. ఎప్పటినుంచే వస్తూనే ఉంది. అలా ఘట్టమనేని వంశం నుంచి.. ఇప్పుడు మూడో తరం వారసులంటే.. మహేష్ కూతురు, కొడుకే కనిపిస్తున్నారు. వారిలో ప్రస్తుతం మహేష్ కుమారుడు గౌతమ్.. బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసుకునేందుకు లండన్ కు వెళ్లారు. అక్కడ ఓ వైపు స్టడీస్ ను కొనసాగిస్తూనే.. మరోవైపు యాక్టింగ్ లో కూడా శిక్షణ తీసుకుంటున్నారని.. అందుకోసం న్యూయార్క్ లోని ఫిలిం అకాడమీకి కూడా వెళ్తున్నారని.. బజ్ వినిపిస్తుంది. అంటే దాదాపు తన చదువు పూర్తైన వెంటనే.. మహేష్ లా ఓ మంచి సినిమాతో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే మహేష్ లెగసిని కంటిన్యూ చేయడంలో.. గౌతమ్ ఏ మాత్రం నిరాశ పరచరని చెప్పి తీరాల్సిందే. మరి గౌతమ్ ఎంట్రీని ఎప్పుడు అనౌన్స్ చేస్తారో వేచి చూడాలి.

ఇక మరోవైపు మహేష్ ముద్దుల కూతురు.. సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే సోషల్ మీడియాలో తన డ్యాన్స్ తో ఫుల్ క్రేజ్ సంపాదించేసుకుంది. అలాగే కొన్ని వాణిజ్య ప్రకటనలలో కూడా.. తనదైన బ్రాండ్ ను క్రియేట్ చేసుకుంది. తండ్రి నుంచి పుణికిపుచ్చుకున్నట్లుగా.. ప్రతి ఒక్క విషయంలోనూ మహేష్ నే తలపిస్తూ ఉంటుంది సితార. మరి వీరిద్దరూ కనుక ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారంటే మాత్రం.. ఇక ఇండస్ట్రీలో కొత్త తరం మొదలైనట్లే. అటు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో మంది కొత్త దర్శకులు కూడా మంచి మంచి కథలతో సిద్ధంగా ఉన్నారు. రానున్న రోజుల్లో ఎలాంటి అప్ డేట్స్ వస్తాయో వేచి చూడాలి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి