iDreamPost

నా ఫేవరెట్ సినిమా అదే.. 100 సార్లు చూశాను: మహేష్ బాబు

  • Published Jun 12, 2024 | 11:54 AMUpdated Jun 12, 2024 | 11:54 AM

తాజాగా సుధీర్ బాబు హరోం హర సినిమాలో నటించిన విషయం తెలిసిందే. కాగా,ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం జరిగింది. ఇక ఈవెంట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు, సుధీర్ బాబు సినిమాను ప్రమోట్ చేయడానికి ముందుకు వచ్చారు. ఈక్రమంలోనే.. సుధీర్ బాబుతో కలిసి ఓ ఆడియో ఇంటరాక్షన్ లో పాల్గొని పలు తన ఫెవరెట్ సినిమా గురించి చెప్పుకొచ్చారు.

తాజాగా సుధీర్ బాబు హరోం హర సినిమాలో నటించిన విషయం తెలిసిందే. కాగా,ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం జరిగింది. ఇక ఈవెంట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు, సుధీర్ బాబు సినిమాను ప్రమోట్ చేయడానికి ముందుకు వచ్చారు. ఈక్రమంలోనే.. సుధీర్ బాబుతో కలిసి ఓ ఆడియో ఇంటరాక్షన్ లో పాల్గొని పలు తన ఫెవరెట్ సినిమా గురించి చెప్పుకొచ్చారు.

  • Published Jun 12, 2024 | 11:54 AMUpdated Jun 12, 2024 | 11:54 AM
నా ఫేవరెట్ సినిమా అదే.. 100 సార్లు చూశాను: మహేష్ బాబు

సూపర్ స్టార్ ‘మహేష్ బాబు’.. ఈ ప్రస్తుతం ఈ హీరో దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌ లో ‘SSMB29’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా, మహేష్, రాజమౌళి కాంబినేషన్ లో మూవీ తెరకెక్కునుందని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ సినిమాపై అభిమానుల్లో భారీగా ఆసక్తి మొదలైంది. ఇక ప్రస్తుతానకిి SSMB29 వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా క్యాస్టింగ్ కూడా సెలక్ట్ చేయబోతున్నారు. కాగా, ఈ చిత్రంలలో మహేష్ కొత్త లుక్ లో కనిపించబోతున్నారు. అందుకోసమే ఈ హీరో బయట జరిగే ఏ ఈవెంట్స్ కు కూడా పెద్దగా హాజరు కావడం లేదు. కానీ, తాజాగా మహేష్ బావమరిది సుధీర్ బాబు ‘హరోం హర’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. కాగా,ఈ మూవీని మహేష్ ప్రమోట్ చేయడానికి ముందుకొచ్చారు. ఈ క్రమంలోనే సుధీర్ బాబుతో కలిసి ఓ ఆడియో ఇంటరాక్షన్ లో పాల్గొన్నారు. అయితే ఇందులో సుధీర్ బాబు అడిగిన పలు ప్రశ్నలకి మహేష్ చాలా ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇచ్చారు. ఆ వివరాళ్లలోకి వెళ్తే..

తాజాగా సుధీర్ బాబు ‘హరోం హర’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. కాగా,ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం జరిగింది. ఇక ఈవెంట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు, సుధీర్ బాబు సినిమాను ప్రమోట్ చేయడానికి ముందుకు వచ్చారు. ఈక్రమంలోనే.. సుధీర్ బాబుతో కలిసి ఓ ఆడియో ఇంటరాక్షన్ లో పాల్గొన్నారు. అయితే ఇందులో సుధీర్ బాబు అడిగిన పలు ప్రశ్నలకి మహేష్ చాలా ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా.. హరోం హర చిత్రంలో ఎక్కువగా గన్స్ ఉపయోగించడంతో ఇందుకు సంబంధించిన ప్రశ్న అడిగారు సుధీర్ బాబు. ‘మీకు ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్స్ లో గన్స్ ను బాగా హ్యాండిల్ చేసిన మీ ఫేవరెట్ హీరో ఎవరు? అని మహేష్ బాబును అడిగారు. ఇక దీనికి సమాధానమిస్తున్న మహేష్ బాబు.. ”సూపర్ స్టార్ కృష్ణగారే అని బదులు చెప్పారు. అంతేకాకుండా.. నేను మోసగాళ్లకి మోసగాడు సినిమా 100 సార్లు చూసుంటాను. నాన్న సినిమాల్లో నాకు చాలా ఇష్టమైన చిత్రం ఇదే.” అంటూ మహేష్ బాబు చెప్పుకొచ్చారు.

‘ఇకపోతే నిజం సినిమాలో కూడా ఎక్కువగా గన్ ఉపయోగించారు కదా ఆ అనుభవం ఎలా ఉంది అంటూ’ సుధీర్ బాబు అడిగారు. దానికి సమాధానమిస్తూ.. ”ఆ టైమ్‌లో నాకు బాగా ఇష్టమైన సినిమాల్లో నిజం ఒకటి. ఒక్కడు తర్వాత ఆ చిత్రం చేశాను. చాలా ఎమోషనల్, ఇంటెన్స్ సీన్స్ ఉన్న చిత్రం అది. అందులో ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలు అయితే నాకు బాగా పేరు తెచ్చాయి. అంత మంచి సినిమా నాకు ఇచ్చినందుకు తేజ గారికి థ్యాంక్స్ చెప్పాలి” అంటూ మహేష్ బాబు చెప్పుకొచ్చారు. ఇక హరోం హర సినిమా ట్రైలర్ బాగుందని.. ఖచ్చితంగా సినిమా మంచి విజయం సాధించాలని మహేష్ మూవీ టీం అంతటికి విష్ చేశారు. మరి, సుధీర్ బాబుతో మహేష్ బాబు చెప్పుకొచ్చిన ఆసక్తికర విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి