iDreamPost
android-app
ios-app

Lokesh Kanagaraj: సినిమాలకు లోకేశ్ కనగరాజ్ గుడ్ బై! అదే చివరి సినిమా అంటూ..

  • Author Soma Sekhar Published - 06:02 PM, Tue - 20 June 23
  • Author Soma Sekhar Published - 06:02 PM, Tue - 20 June 23
Lokesh Kanagaraj: సినిమాలకు లోకేశ్ కనగరాజ్ గుడ్ బై! అదే చివరి సినిమా అంటూ..

లోకేశ్ కనగరాజ్.. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. కేవలం తీసింది నాలుగు సినిమాలే అయినా 50 సినిమాలు తీసిన డైరెక్టర్ కు వచ్చిన పేరును సంపాదించుకున్నాడు. తమిళంలో స్టార్ డైరెక్టర్ గా ప్రస్తుతం కొనసాగుతున్నాడు లోకేశ్. లోకేశ్ యూనివర్స్ పేరుతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. అయితే తాజాగా ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు లోకేశ్. త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు ప్రకటించాడు. దాంతో అభిమానులు షాక్ కు గురైయ్యారు.

లోకేశ్ కనగరాజ్.. ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాల ద్వారా పాన్ ఇండియా డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించాడు. వరుసగా హిట్ సినిమాలను తెరకెక్కిస్తూ.. ఇండస్ట్రీలో తనకంటూ ఓ బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం లోకేశ్ యూనివర్స్ పేరిట వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా లియో అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా విజయ్ పుట్టిన రోజు సందర్భంగా.. అందరికి ఊహించని షాక్ ఇచ్చాడు లోకేశ్. తాను కేవలం 10 సినిమాలే చేస్తానని, తర్వాత ఇండస్ట్రీకి గుడ్ బై చెబుతానని ప్రకటించాడు. దాంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ కు గురైయ్యారు.

ఇక నాకు ఎలాంటి సుదీర్ఘమైన ప్రణళికలు లేవని, ఇండస్ట్రీలో శాశ్వతంగా ఉండాలన్న ఆలోచనలేదని లోకేశ్ తెలిపాడు. అందుకే పది సినిమాలు తీసిన తర్వాత ఇండస్ట్రీకి గుడ్ బై చెబుతానన్నాడు. కాగా.. లియో సినిమా కశ్మీర్ లో భారీ షెడ్యూల్ ను ఇటీవలే పూర్తి చేసుకుంది. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష నటిస్తుండగా.. సంజయ్ దత్, మిస్కిన్, ప్రియా ఆనంద్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హాలీవుడ్ డైరెక్టర్ క్వింటెన్ టరెంటీనోలా కూడా తాను 10 సినిమాలు మాత్రమే చేసి ఇండస్ట్రీకి గుడ్ బై చెబుతానని ప్రకటించాడు. ఇప్పుడు లోకేశ్ కూడా ఆయన బాటలోనే నడుస్తున్నాడు.