iDreamPost
android-app
ios-app

ప్రభాస్, రామ్ చరణ్ తో లోకేశ్ కనకరాజ్ మూవీ! ఇంత షాకిచ్చాడేంటి?

ప్రభాస్, రామ్ చరణ్ తో లోకేశ్ కనకరాజ్ మూవీ! ఇంత షాకిచ్చాడేంటి?

లోకేశ్ కనకరాజ్.. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో బాగా వినిపిస్తున్న పేరు ఇది. కమల్ హాసన్ తో విక్రమ్ సినిమా తీసి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఖైదీ సినిమా నుంచి లోకీ యూనివర్స్ క్రియేట్ చేసినట్లు ఇందులో ఎంతో మంది హీరోలు, ఎంతో మంచి కథలు వస్తున్నట్లు లోకేశ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే విక్రమ్ సినిమాలో అదే విషయాన్ని రివీల్ కూడా చేశాడు. ఇప్పుడు అంతా ఖైదీ-2 సినిమా గురించే ఆలోచిస్తున్నారు. అయితే అంతకన్నా ముందు లియో సినిమా వస్తోంది. ఈ సినిమా తర్వాత లోకేశ్ ఎవరితో మూవీ చేస్తారు అంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

అయితే రామ్ చరణ్, ప్రభాస్ లతో సినిమాలు ఉన్నాయని టాక్ వచ్చింది. ఆ వార్తలు బాగా వైరల్ కూడా అయ్యాయి. ముందు ప్రభాస్ తో సినిమా చేసి.. ఆ తర్వాత రామ్ చరణ్ తో కూడా సినిమా చేస్తారని చెప్పారు. అలాగే లోకీ యూనివర్స్ లో వీళ్ల క్యారెక్టర్స్ కీలకం అవుతాయంటూ చెప్పుకొచ్చారు. ఇదే విషయంపై లోకేశ్ కనకరాజ్ కు కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి. ఒక ఇంటర్వ్యూలో లోకేశ్ ను ఇదే ప్రశ్న అడిగారు. ప్రభాస్, రామ్ చరణ్ తో మీరు సినిమా చేయబోతున్నారంట నిజమేనా? అని క్వశ్చన్ చేశారు. అయితే ఈ ప్రశ్న విని లోకేశ్ ఒకింత ఆశ్చర్యపోయాడు. తాను అలాంటి వార్తలను పట్చుకోనని వ్యాఖ్యానించాడు.

“ప్రభాస్, రామ్ చరణ్ నాకు చాలా మంచి ఫ్రెండ్స్. నేను ఎప్పుడూ వారితో టచ్ లోనే ఉంటాను. నేను వారితో సినిమాలు చేయబోతున్నాను అనే వార్తల్లో నిజం లేదు. నేను ప్రస్తుతం లియో సినిమా చేస్తున్నాను. నా ధ్యాస అంతా ఆ సినిమా మీదే ఉంది. నిజానికి ప్రభాస్, రామ్ చరణ్ లను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి కథలు సిద్ధం చేయలేదు. నిజానికి అలాంటి స్టార్లతో కలిసి మంచి ప్రాజెక్ట్ చేయాలని నాకూ ఉంది” లోకేశ్ కనకరాజ్ చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలు విన్నతర్వాత సోషల్ మీడియాలో ప్రచారాలు అన్నీ అవాస్తవమని క్లారిటీ వచ్చింది. అయితే ఫ్యాన్స్ మాత్రం ఒకింత షాక్, నిరాశలో ఉన్నారు. లోకీ యూనివర్స్ లో ప్రభాస్, రామ్ చరణ్ ఉంటే బాగుంటుంది అంటూ కామెంట్ చేస్తున్నారు.