Tirupathi Rao
లోకేశ్ కనకరాజు- దళపతి విజయ్ కాంబినేషన్ లో వచ్చిన లియో చిత్రం వరల్డ్ వైడ్ గా రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే రూ.540 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు లియో కలెక్షన్స్ మరింత దూసుకుపోయేందుకు రెడీ అవుతోంది.
లోకేశ్ కనకరాజు- దళపతి విజయ్ కాంబినేషన్ లో వచ్చిన లియో చిత్రం వరల్డ్ వైడ్ గా రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే రూ.540 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు లియో కలెక్షన్స్ మరింత దూసుకుపోయేందుకు రెడీ అవుతోంది.
Tirupathi Rao
లోకేశ్ కనకరాజు- దళపతి విజయ్ కాంబినేషన్ లో వచ్చిన లియో చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా భారీ స్పందన వచ్చింది. రూ.540 కోట్లకు పైగా వసూళ్లతో లియో చిత్రం దూసుకుపోతోంది. ఈ సినిమా లోకేశ్- విజయ్ స్టామినా ఏంటో మరోసారి బాక్సాఫీస్ కు బలంగా చెప్పినట్లు అయింది. ఇప్పుడు లియో కలెక్షన్స్ మరింత దూసుకుపోయే అవకాశం ఉంది. ఎందుకంటే సరికొత్త లియో మరోసారి థియేటర్లలోకి రాబోతున్నాడు. ప్రేక్షకుల కోరిక మేరకు లియో మేకర్స్ ఒక నిర్ణయం తీసుకున్నారు. నిజంగా ఇది విజయ్ ఫ్యాన్స్ సూపర్ గుడ్ న్యూస్ అవుతుంది.
లోకేశ్ కనకరాజు యూనివర్స్ లో విజయ్ కూడా ఉన్నాడు అనే విషయాన్ని ఈ సినిమాతో మరింత బలంగా చెప్పారు. రాబోయే చిత్రాల్లో కమల్ హాసన్ తో కలిసి విజయ్ నటించే అవకాశం ఉందని క్లారిటీ వచ్చింది. కార్తీ, సూర్య, కమర్ హాసన్, విజయ్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ ఇలాంటి స్టార్స్ మొత్తం ఏదో ఒక సీన్ లో కచ్చితంగా కనిపించే పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని ఊహించుకుంటే ఇప్పటికే సినిమా ఫ్యాన్స్ ఊహల్లో తేలిపోతున్నారు. అలాంటి సమయంలో ఇంకో గుడ్ న్యూస్ ని లియో మేకర్స్ చెప్పారు. లియో సినిమాకి 15 సెన్సార్ కట్స్ పడ్డాయి. అవి పడటం వల్లే ఈ సినిమాకి యూఏ సర్టిఫికేషన్ దక్కింది. కాబట్టే అందరూ ఈ సినిమాని చూడగలిగారు.
విజయ్ ఫ్యాన్స్ నుంచి సినిమా విడుదల సమయం నుంచే ఒక మాట వినిపిస్తూ ఉంది. సెన్సార్ కట్స్ లేకుండా సినిమా విడుదల చేసి ఉంటే ఇంకా బాగుండేది అంటున్నారు. అయితే ఇది ఇప్పుడు డిమాండ్ గా కూడా మారింది. అభిమానుల నుంచి వినిపిస్తున్న ఈ డిమాండ్ నేపథ్యంలో లియో మేకర్స్ ఒక నిర్ణయం తీసుకున్నారు. లియో సినిమాని సెన్సార్ కట్స్ లేకుండా రిలీజ్ చేయాలి అనుకున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. నవంబర్ 3 నుంచి లియో సినిమా సెన్సార్ కట్స్ లేకుండా ప్రదర్శన జరుగుతుంది. అయితే ఈ సినిమాకి 18 ఏళ్లు దాటిని వారిని మాత్రమే అనుమతిస్తారు.
నవంబర్ 3 నుంచి చిన్న పిల్లలతో లియో సినిమా చూడటం కుదరదు. ఈ నిర్ణయం వల్ల లియో సినిమా ఇంకో అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. యూకేలో 18 ప్లస్ క్లాసిఫికేషన్ తో విడుదలవుతున్న తొలి తమిళ చిత్రంగా లియో నిలవనుంది. ఇప్పటికే ఈ సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ లభించాయి. ఇప్పుడు ఈ సెన్సార్ కట్స్ లేకుండా సినిమా మళ్లీ రిలీజ్ అనగానే బాక్సాఫీస్ మరోసారి షేకవుతుందనే చెప్పాలి. ఇప్పటికే సినిమా చూసిన అందరూ మళ్లీ సినిమాకి వెళ్తారు. ఇప్పటివరకు ఉన్న కలెక్షన్స్.. మరోస్థాయికి వెళ్లే అవకాశం లేకపోలేదు. మరి.. లియో చిత్రాన్ని మళ్లీ రిలీజ్ చేయాలన్న మేకర్స్ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.