చిత్రపరిశ్రమలో ఎవరికైనా కొన్నిసార్లు హిట్స్, ప్లాప్స్ బట్టి.. గౌరవం దక్కుతుంటుంది. అది హీరోలైనా, హీరోయిన్స్ అయినా.. ఫామ్ లో ఉన్నప్పుడే కొత్తగా అవకాశాలు అందుకుంటారు. ఒకసారి వరుసగా రెండు మూడు ప్లాప్స్ పడ్డాయంటే అంతే. ఒకప్పుడు ఇంత పోటీ లేనప్పుడు ప్లాప్స్ పడినా అవకాశాలు వచ్చేవేమో. కానీ.. కొన్నాళ్ళుగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎందుకంటే.. ప్రెజెంట్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి కొదవలేదు. అలాగని పాత వాళ్ల మీద ఆధారపడి సినిమాలు చెయ్యట్లేదు. సీనియర్స్ బిజీగా ఉన్నారంటే.. వెయిట్ చేసే టైమ్ అంతకన్నా లేదని కొత్త వాళ్లను తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేసేస్తున్నారు దర్శకనిర్మాతలు.
ఇక తెలుగులో మొదటి సినిమాతోనే సూపర్ క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ కియారా అద్వానీ. మహేష్ బాబు సరసన ‘భరత్ అనే నేను’ మూవీతో తెలుగు డెబ్యూ చేసింది. ఆ తర్వాత రామ్ చరణ్ తో ‘వినయ విధేయ రామ’ చేసింది. ఆ సినిమా ఫలితం నిరాశపరిచే సరికి వెంటనే మకాం ముంబైకి మార్చి.. పూర్తిగా బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టింది కియారా. అందుకు తగ్గట్టుగా బాలీవుడ్ పలు హిట్స్ పడ్డాయి. కానీ.. టైమ్ ఎప్పుడు ఒకవైపే ఉండదుగా.. గత కొంతకాలంగా కియారా సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్లాప్స్ అవుతున్నాయి. ఇప్పటికే భూల్ భూలైయ 2, జుగ్ జుగ్ జియో, గోవింద్ నామ్ మేరా సినిమాలు ప్లాప్ అయ్యాయి.
అనంతరం రీసెంట్ గా.. కార్తీక్ ఆర్యన్ తో చేసిన ‘సత్య ప్రేమ్ కి కథ’ మూవీ కూడా అదే బాటపట్టిందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే.. చాలా కాలం తర్వాత కరణ్ జోహార్ తెరకెక్కించిన ఈ సినిమాకి.. టాక్ బాగానే వచ్చినప్పటికి.. కలెక్షన్స్ పెద్దగా లేవని సమాచారం. సో.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా చాలా దూరంలో ఉందంట. కాబట్టి.. కియారా డిజాస్టర్స్ లో ఇది కూడా చేరబోతుంది. అందుకే ఇప్పుడు అమ్మడి ఆశలన్నీ రామ్ చరణ్ తో చేస్తున్న పాన్ ఇండియా మూవీ ‘గేమ్ చేంజర్’ పైనే ఉన్నాయని తెలుస్తోంది. మరి రామ్ చరణ్ తో ఆల్రెడీ ప్లాప్ చూసిన కియారా.. ఈసారి హిట్ కొడుతుందేమో చూడాలి. ఇదిలా ఉండగా.. కియారా ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ మల్హోత్రాని పెళ్లాడిన విషయం తెలిసిందే. మరి కియారా గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.