iDreamPost
android-app
ios-app

జాతీయ అవార్డు విజేతలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

  • Published Aug 26, 2023 | 7:49 PM Updated Updated Aug 26, 2023 | 7:49 PM
  • Published Aug 26, 2023 | 7:49 PMUpdated Aug 26, 2023 | 7:49 PM
జాతీయ అవార్డు విజేతలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

ఇటీవల కేంద్ర ప్రభుత్వం 69వ జాతీయ చలన చిత్ర అవార్డులు ప్రకటించింది. పలు విభాగాల నుంచి ఎంతో మందికి అవార్డు దక్కడం విశేషం. ఇదిలా ఉంటే.. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి జతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కు అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు అవార్డు విజేతలకు తాజాగా శుభాకాంక్షలు తెలిపారు. మరీ ముఖ్యంగా టాలీవుడ్ నుంచి ఉత్తమ నటుడిగా అవార్డును సొంతం చేసుకుని సత్తా చాటిన అల్లు అర్జున్ ను సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.

69 ఏళ్లలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ హీరో సాధించని ఘనతను అల్లు అర్జున్ దక్కించుకోవడం చాలా గొప్ప విషయమని కొనియాడారు. నటుడిగా ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగి ఇలా జాతీయ అవార్డు సొంతం చేసుకోవడం చిత్ర రంగానికి ఎంతో గర్వకారణమన్నారు. ఇదే కాకుండా తన సాహిత్యంతో ఆసార్క్ అవార్డు అందుకుని జాతీయ అవార్డును సైతం సొంతం చేసుకున్న ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ ను సైతం సీఎం కేసీఆర్ అభినందించారు. ఇక దీంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తన వంతు కృషి చేస్తుందని కూడా తెలిపారు. భవిష్యత్తులో తెలుగు చిత్ర పరిశ్రమ విశ్వవ్యాప్తం కావాలని కూడా సీఎం ఆకాంక్షించారు.

ఇది కూడా చదవండి: ఉత్తమ నటిగా జాతీయ అవార్డు.. ఆ గుడిలో కృతి ప్రత్యేక పూజలు!

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetmeritbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom