iDreamPost

ఉత్తమ నటిగా జాతీయ అవార్డు.. ఆ గుడిలో కృతి ప్రత్యేక పూజలు!

ఉత్తమ నటిగా జాతీయ అవార్డు.. ఆ గుడిలో కృతి ప్రత్యేక పూజలు!

కేంద్ర ప్రభుత్వం తాజాగా, 69 జాతీయ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సారి జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌ అవార్డును సొంతం చేసుకున్నారు. ఉత్తమ నటుడిగా ఈ అవార్డు అందుకున్న తొలి తెలుగు వ్యక్తిగా అల్లు అర్జున్‌ రికార్డు సృష్టించాడు. ఇక, జాతీయ ఉత్తమ నటి విభాగంలో ఇద్దరు హీరోయిన్లు జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. ఆలియా భట్‌, కృతి సనన్‌లు ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. ‘గంగుబాయ్‌ కతియావాడి’ సినిమాలో నటనకు గాను ఆలియా భట్‌కు ఈ అవార్డు వరించింది.

‘మిమి’ సినిమాలో నటనకు గాను కృతి సనన్‌కు ఈ అవార్డు సొంతం అయింది. జాతీయ అవార్డు సొంతం అయిన నేపథ్యంలో కృతి భావోద్వేగానికి లోనైంది. తన మనసులోని మాటల్ని సోషల్‌ మీడియాలో పోస్టు ద్వారా అందరికీ తెలియజేసింది. తనతో పాటు ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న ఆలియాకు కూడా శుభాకాంక్షలు తెలిపింది. ఇక, జాతీయ అవార్డు సొంతమైన ఆనందంలో కృతి సనన్‌ ముంబైలోని సిద్ధి వినాయక గుడికి వెళ్లింది. గుడిలో ప్రత్యేక పూజలు చేయించింది. కృతిని గుడి దగ్గర చూసిన పపరజీలు తమ కెమెరాలకు పని చెప్పారు.

ఫొటోలు, వీడియోలు తీస్తూ హల్‌చల్‌ చేశారు. కృతి వినాయకుడి గుడికి వెళ్లిన దృశ్యాల తాలూకా ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, కృతి సనన్‌ 2014లో వచ్చిన సైకలాజికల్‌ యాక్షన థ్రిల్లర్‌ సినిమా ‘నేనొక్కడినే’తో సినీ రంగ ప్రవేశం చేసింది. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేష్‌ బాబుకు జంటగా నటించింది. తెలుగుతో పాటు పలు హిందీ సినిమాల్లో ఆమె నటించింది. మరి, కృతి సనన్‌ను జాతీయ అవార్డు వరించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి