iDreamPost

అరెస్టు తర్వాత హీరో దర్శన్ తొలి స్పందన.. విచారణలో ఏం చెప్పాడంటే

కన్నడ స్టార్ నటుడు దర్శన్ చిత్ర దుర్గ ఫ్యాన్స్ అసోషియేషన్ అధ్యక్షుడు రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసుల విచారణలో దర్శన్ స్పందించాడు.

కన్నడ స్టార్ నటుడు దర్శన్ చిత్ర దుర్గ ఫ్యాన్స్ అసోషియేషన్ అధ్యక్షుడు రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసుల విచారణలో దర్శన్ స్పందించాడు.

అరెస్టు తర్వాత హీరో దర్శన్ తొలి స్పందన.. విచారణలో ఏం చెప్పాడంటే

శాండల్ వుడ్ స్టార్ నటుడు దర్శన్ చిత్ర దుర్గ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టు అయిన విషయం తెలిసిందే. తన ప్రియురాలు పవిత్ర గౌడకు సోషల్ మీడియాలో అసభ్య మెసేజ్ లు పంపి వేధిస్తున్నాడన్న కారణంతో ఈ ఘోరానికి తెరలేపాడు. కాగా దర్శన్ ను అరెస్టు చేసిన పోలీసులు బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్ లో ఆయనను విచారిస్తున్నారు. హత్యకు సంబంధించి తన ప్రమేయంపై పలు ప్రశ్నలతో పోలీసులు దర్శన్ ను విచారిస్తున్నారు. ఈ విచారణలో దర్శన్ తొలిసారిగా స్పందించాడు. రేణుకా స్వామినీ చంపమని చెప్పలేదని, కేవలం బెదిరించమని చెప్పానని పోలీసుల ఎదుట సమాధానమిచ్చాడు.

నటుడు దర్శన్ ను పోలీసులు విచారిస్తున్నారు. అయితే రేణుకాస్వామీ హత్యకు గురైనప్పుడు తాను అక్కడలేనని చెప్పిన దర్శన్ పోలీసులు విచారణలో సంచలన నిజం బయటకు వచ్చింది. విచారణలో దర్శన్ అక్కడే ఉన్నట్లు వెల్లడైంది. కాగా సినీ నటి పవిత్ర గౌడతో నటుడు దర్శన్ కొంత కాలంగా రిలేషన్ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య పదేళ్ల క్రితం ఏర్పడిన పరిచయం అక్రమసంబంధానికి దారితీసింది. ఇది సహించలేక రేణుకాస్వామీ పవిత్ర గౌడను సోషల్ మీడియా ద్వారా ఆమెను టార్గెట్ చేస్తూ అసభ్యకరమైన మెసేజ్ లతో వేధించడం స్టార్ట్ చేశాడు.

ఇక ఈ విషయం తెలిసిన నటుడు దర్శన్ రేణుకాస్వామికి వార్నింగ్ ఇచ్చేందుకు సుపారీ ఇచ్చాడు. ఆ తర్వాత రేణుకాస్వామిని తీసుకొచ్చి తీవ్రంగా కొట్టడంతో మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో దర్శన్ దాడి చేయడం వల్లనే రేణుకాస్వామీ చనిపోయాడంటూ నిందితులు పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు దర్శన్ తో పాటు ప్రియురాలు పవిత్ర గౌడను అరెస్టు చేశారు. వీరి అరెస్టు కన్నడ చిత్ర పరిశ్రమలో తీవ్ర కలకలం సృష్టించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి